Breaking News

"రచ్చబండ"కు ప్రశ్నలు పంపించండి. | Send questions to "Rachabanda".

ముఖ్యమైన విషయాలపై చర్చించడం వలన, లోతైన సమాచారాన్ని అందించడం వలన చదూవరులకు చక్కని పరిజ్ఞానం అందుతుంది. దీని కారణం చేతనే "రచ్చబండ"ను స్థాపించడం జరిగింది. ఎందుకంటే విషయ పరిజ్ఞానం, విషయ అవగాహన మనిషిని ఉన్నత స్థితికి దగ్గర చేస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగార్ధమైన ప్రశ్నలను చర్చల కోసం అందించమని కోరుకుంటున్నాము.

మీ ప్రశ్నలను క్రింది కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీలు వెంబడి వాటిని చర్చల కోసం ఆహ్వానిస్తాను. - మీ రచ్చబండ టీం.

13 comments:

 1. వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ?

  ReplyDelete
  Replies
  1. దేశంలో హిందూ వివాహ చట్టం తీసి చెత్తబుట్టలో పడేసి, కామన్ కోడ్ తీసుకు రావాలి. దానికి "దేశ వివాహ చట్టం" అనిపేరు పెట్టాలి.. అప్పుడు ఒవైసీ గానీ, ఇంకొకడుగానీ ఏం మాట్లాడలేడు..

   Delete
  2. కామన్ సివిల్ కోడ్ ఎలా తీసుకురాగలరు? హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది. కామన్ సివిల్ కోడ్ వస్తే కుల వ్యవస్థని వేరే మతాలవాళ్ళకి కూడా వర్తింపచెయ్యగలరా? రమా సుందరి అనే ఆవిడ ఇదే ప్రశ్న అడిగారు.

   Delete
  3. >>కామన్ సివిల్ కోడ్ వస్తే కుల వ్యవస్థని వేరే మతాలవాళ్ళకి కూడా వర్తింపచెయ్యగలరా?

   వర్తింప చెస్తేనే దాన్ని కామన్ సివిల్ కోడ్ అంటారు..

   Delete
  4. ఇస్లాంలో కజిన్ మేరెజ్‌ని అనుమతిస్తారు కానీ మేనకోడలిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతించరు. ఆంధ్రాలోని అన్నికులాలలోనూ, తెలంగాణాలోని మున్నూరు కాపు కులంలోనూ మేన కోడలిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతిస్తారు కానీ పిన్నినీ, మేనత్తనీ పెళ్ళి చేసుకోవడానికి అనుమతించరు. Can you propose permitted and prohibitted degrees of relationships for the common civil code?

   Delete
  5. బిజెపి కామన్ సివిల్ కోడ్ ద్వారా కుల వ్యవస్థని రాజ్యాంగబద్దం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది. అందుకే కదా హిందూత్వవాదులు కామన్ సివిల్ కోడ్‌ని ఆహ్వానిస్తున్నది.

   Delete
  6. ఇది రెండు ధఫాలుగా జరగాలి..

   కజిన్ మారేజేస్, మేనరికంలో ఉన్న హెల్త్ ప్రాబ్లంస్ గురించి ప్రజల్లో అవగాహన మొదట తెప్పించి.. వాటికి వ్యతిరేకంగా వారిని మానసికంగా సిద్దం చేయాలి.. దేశానికి కావల్సింది ఆరోగ్యంవంతమైన, బలమైన సంతానం.అంతేగానీ... ఎప్పుడూ అనారోగ్యాలతో ఇంట్లో మూలన పడి ఉండేవారు కాదు.

   ఇక రెండవ దఫాగా.. వాటిని నిషేధించాలి..

   దేశంలో పచ్చ రంగు లేదా కాషాయ రంగు నచ్చనివారున్నారని... జాతీయజండాను ఎవరికి వాల్లని తయారు చేసుకోనివ్వలేము కదా? ఒక గుడ్డముక్కలో మనం జాతీయత చూడగలిగినప్పుడు, మరి రాబోయే తరంకోసం.. ఆమాత్రం ఆచారాలు త్యాగంచెయ్యలేమా?

   Delete
  7. ఇస్లాంలో మేనమామ మేనకోడలిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. ఆమె సొంత అక్క కూతురైనా, సవతి అక్క కూతురైనా అతను ఆమెని పెళ్ళి చేసుకోవడానికి అవ్వదు. ఇస్లాంలో కజిన్ మేరెజ్ మాత్రం చేసుకోవచ్చు. హిందూ మతంలో కజిన్ మేరెజ్ అనేది వినకూడని పదం కదా అని ఇస్లాంలో దాన్ని నిషేధించలేము. కామన్ సివిల్ కోడ్ పేరుతోనైనా ఆ నిషేధాన్ని ముస్లింలకి వర్తింపచెయ్యలేము. ఒక మతంవాళ్ళకి వర్తించేది ఎలాగూ కామన్ సివిల్ కోడ్ అవ్వదు, అలాగే ఇంకో మతంవాళ్ళ మీద ఒక మత సంస్కృతి రుద్దినా అది కామన్ సివిల్ కోడ్ అవ్వదు.

   Delete
 2. ఇలాంటి తీర్పులు ఇస్తే చాలా చట్టాలు రద్దవుతాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం సపిండులు (ఒకే తాతకి పుట్టినవాళ్ళు) మధ్య వివాహం నేరం. సపిండ వివాహాలు కూడా ఇద్దరి ఇష్ట ప్రకారమే జరుగుతాయి కనుక వాటి మీద ఉన్న నిషేధాన్ని ఎందుకు ఎత్తివెయ్యకూడదు?

  ReplyDelete
 3. నా ప్రశ్న: స్త్రీవాదులు సాంస్కృతిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే రూల్ పెట్టుకున్నారా? నేను స్త్రీవాదినే కానీ నేను స్త్రీవాదినని చెప్పుకోవడం కంటే మార్క్సిస్ట్‌నని చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఒక సారి పెన్మెత్స సుబ్బరాజు గారు నాతో ఫోన్‌లో చెప్పారు "మతం విషయంలో జోక్యం చేసుకోవద్దు అని కమ్యూనిస్టులు తమ కార్యకర్తలకి బోధించిన రోజులు ఉన్నాయట". నాకు తెలిసినంత వరకు సి.పి.ఐ., సి.పి.ఎం.లు పార్లమెంటరీ ప్రజాస్వామిక పార్టీలే తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు కావు. కమ్యూనిస్టుల మీద సుబ్బరాజు గారికి వచ్చిన డౌట్ నాకు ఇప్పుడు స్త్రీవాదుల మీద వస్తోంది. కోస్తా ఆంధ్రలో పురుషుడు తన మేనకోడలిని పెళ్ళి చేసుకునే ఆచారం ఉంది కానీ పిన్నిని లేదా మేనత్తని పెళ్ళి చేసుకోవడానికి మాత్రం అనుమతించరు. ఈ ఆచారంలో పురుషాధిక్యత స్పష్టంగానే కనిపిస్తోంది. అయినా స్త్రీవాదులు ఎవరూ దీనికి వ్యతిరేకంగా మాట్లాడరు. సంస్కృతికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని స్త్రీవాదులు రూల్ పెట్టుకున్నారా అనే సందేహం కలుగుతోంది. వరకట్నం కూడా సంస్కృతికి సంబంధించిన విషయమే కదా, మరి వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా స్త్రీవాదులు ఎందుకు మాట్లాడుతున్నట్టు? వావివరసలు అనేది సెన్సిటివ్ విషయం అనుకుని స్త్రీవాదులు దాని గురించి మాట్లాడడం లేదా? సంస్కృతిలో అసమానత్వాన్ని ఆచరించే స్త్రీలు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలు చేసినా వాళ్ళ జీవితాలలో గొప్ప మార్పేమీ రాదు. ఇస్లాం మతంలో మగవాడు అక్క కూతురిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. సొంత అక్క కూతురి విషయంలోనూ, సవతి అక్క కూతురి విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. హిందూ మతంలో అలా కాదు. ఇక్కడ మగవాడికి అక్క కూతురిని పెళ్ళి చేసుకోవడానికి మేనరికం కింద అనుమతిస్తారు. కానీ ఆడదానికి అక్క కొడుకుని తన కొడుకుతో సమానంగా చూడమంటారు. ఈ అర్థం లేని ఆచారాలని ప్రశ్నించే ధైర్యం స్త్రీవాదులకి ఎందుకు కలగడం లేదు?

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. మేనరికాలు, దగ్గరి సంబంధాలు కేవలం ఆస్థులను కాపాడుకోడానికి ఉద్దేశ్యించబడ్డాయి.జన్యు శాస్త్రం వచ్చాక మేనరికం వల్ల పిల్లల్లో అవకరాలు వస్తున్నందున ఇంకా వాటికోసం పోరాడటం అనవసరం !

   Delete
  3. విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు కూడా మేనరికాలు చేసుకోవడం చూసాను. వాళ్ళేమీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యించుకునో, పిల్లలు పుట్టే అవకాశం లేని కోగర్ రిలేషన్‌లోనో మేనరికాలు చేసుకున్నవాళ్ళు కాదు. అందాల పోటీలు స్త్రీలని కించపరుస్తున్నాయి అంటూ గోడల మీద పోస్టర్లు అంటించే మహిళా సంఘాలు మేనమామ-మేనకోడలు వరస పెళ్ళిళ్ళ గురించి నోరెత్తడం నేను చూడలేదు. ఈ విషయంలో ఇస్లాం మతమే నయం. వాళ్ళు ఆడవాళ్ళ చేత బుర్కా వెయ్యిస్తారు కానీ వావివరసలు విషయంలో మాత్రం వాళ్ళు పురుషాధిక్యతని ప్రోత్సహించరు.

   These are prohibited degrees of relationships to men in Islam

   Father's wife (includes step-father's wife)
   Son's wife (includes step-son's wife)
   Aunt (includes step-sister of mother or father)
   Niece (includes daughter of step-brother or step-sister)
   Mother-in-law and above (includes wife's step-mother and above)
   Daughter-in-law and below (includes step-daughter-in-law and below)
   Mother (includes the woman who had breast fed him)
   Sister (includes the daughter of the woman who had breast fed him)
   Daughter (includes the girl who was breast fed by his wife)

   మగాడు అక్క కూతురిని పెళ్ళి చేసుకోవచ్చు కానీ ఆడది అక్క కొడుకుని పెళ్ళి చేసుకోకూడదు లాంటి రూల్స్ ఇస్లాంలో లేవు.

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్