Breaking News

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?


24 comments:

 1. జగన్ కంటె చంద్రబాబు గారే బాగా నడిపించగలడు. కానీ అతని మంత్రివర్గం పూర్తిస్థాయిలో దోపిడీ ముఠాను తలపిస్తోంది. ఆంధ్రా ప్రజలకు బాబుపై నమ్మకమున్నా మంత్రులను, కొంతమంది MLA లను నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

  ReplyDelete
 2. నేను కొంతమందిని విచారించి చూశాను. నెక్స్ట్ సి.యమ్ ఎవరైతే బాగుంటుందని? ఇంచుమించు 30మందిలో 22మంది చంద్రబాబునే కోరుకున్నారు. అదే సమయంలో మంత్రుల పట్ల,mlaల పట్ల విరక్తి భావనతో పెదవి కూడా విరిచారు.

  ReplyDelete
 3. 100% TRUE!! I too heard the same !! Operation success but patient died laga.. CM pass but all other members failed miserably !!

  ReplyDelete
 4. చంద్రబాబు గవర్నమెంట్ ను ప్రభుత్వ ఉద్యోగులే కూల్చేసేలా ఉన్నారు. వారు డిమాండ్ చేస్తున్న cps రద్దుకు ఆల్రెడీ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. చంద్రబాబు గారు ఎందుకు స్పందించడం లేదో. ఇప్పటికే ఉద్యోగులు సీపీస్ రద్దు చెయ్యకపోతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇక గద్దె ఎక్కనీయం, కూల్చేస్తాం అని హెచ్చరించారు కూడా.

  ReplyDelete
 5. జగన్ అధికారంలోకి వచ్చినా సి.పి.ఎస్. రద్దు అవ్వదు. కేంద్ర ప్రభుత్వంలో కూడా 2004 తరువాత చేరిన ఉద్యోగులకి పెన్షన్‌లు లేవు. అది చంద్రబాబు నాయుడి తప్పు కాదు. అతను కేంద్ర ప్రభుత్వ విధానాన్నే ఫాలో అయ్యాడు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలని నింపేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ఖాళీలు పెరిగాయి. ఆయన కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచి తన పై వ్యతిరేకత రాకుండా చూసుకున్నాడు.

  ReplyDelete
 6. ఇటీవలి ఇండియా టుడే సర్వ్ తరువాత తాజాగా రిపబ్లిక్ టీవీ సర్వ్ కూడా జగన్ ఎన్నికలు స్వీప్ చేస్తాడని చెప్పింది. Finally ache din for Andhra

  ReplyDelete
  Replies
  1. బీజేపీకి,, ఆంధ్రాలో 12% ఓటింగ్ ఉంది అనికూడా రిపబ్లిక్ టీవీ చెప్పింది. నమ్మొచ్చా?

   Delete
  2. నాకు తెలిసి ఆంధ్రాలో బిజెపి కి పది శాతం ఓట్లు కూడా పడవు. ఆంధ్ర ప్రజలకు మాత్రమే కాదు మొత్తం దేశ ప్రజలకే బీజేపీ పై నమ్మకం పోయింది.

   Delete
  3. జగన్కు బీజేపీతో దోస్తీ ఉందన్న వార్త ప్రజలలో బలపడితే బీజేపీకి పట్టిన గతే వైఎస్సార్ సీపీకి కూడా పడుతుంది.

   Delete
  4. బీజేపీకి ఆంధ్రాలో 12% ఓట్లు వస్తాయా రావా అన్నది ప్రధాన ప్రశ్న కాదు, వైకాపా టీడీపీ ఇద్దరిలో ఎవరు ముందున్నారన్నదే అసలు గొడవంతా.

   ఇక బీజేపీ విషయానికి వస్తే వారికి మునుపటి 2% దాటితే కొంతలో కొంతయినా ఊరట కదా.

   Delete
  5. @ జై గారు,

   కర్ నాటకం లాగా ఆంధ్రా కి జరిగితే పవన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు ?
   పవన్ చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తారా లేక జగన్ గారినా ?

   Delete
  6. నా ఊహ ప్రకారం బీజేపీకి ఆంధ్రాలో 1-2 శాతం మించి ఓట్లు రావు. ఇంచుమించు సగం సీట్లకు అభ్యర్థులు కూడా దొరకక పోవచ్చు. ఖచ్చితంగా పోటీ చేసిన ప్రతిచోటా డిపాజిట్ కోల్పోతుంది. నా లెక్క ప్రకారం కేవలం 3-4 లోకసభ సీట్లకు మాత్రం అభ్యర్థుల్ని నిలబెట్టి, అసెంబ్లీ ఎన్నికలనుంచి పూర్తిగా తప్పుకోవచ్చు, లేకపోతే పది పన్నెండు సీట్లకు పోటీ చేయవచ్చు.అసలు అభ్యర్థులు దొరకడమే వాళ్లకు చాలా కష్టం. ఏమైనప్పటికిన్ని ఘోర పరాభవం మాత్రం ఖాయం. పుండు మీద కారంలా దానికి వచ్చే ఓట్ల శాతం, సీట్లు కన్నా పురిటి బిడ్డ జనసేనకు వచ్చేవే ఎక్కువ కాబోతోంది.

   Delete
  7. నీహారిక గారూ, కర్ణాటకలో జరిగిన పూర్తి నాటకం గుర్తు చేసుకుందాం.

   జేడీఎస్ బీజేపీతో కుమ్ముక్కయిందని సిద్దరామయ్య ఊరూరా చాటారు, పచ్చబాకాలూ తానా అంటే తందానా వంత పాడారు. ఈ తంటాలన్నీ ఫలానా కులం బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాలలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమకే పడాలని కాంగీయుల ఆదుర్దా.

   ఫలితం చూస్తే డామిట్ కథ అడ్డంగా తిరిగిందని రీతిలో ఆ పాచికలు ఏమీ పారలేదు. నేనే మొనగాడినంటూ విర్రవీగిన సిద్దు గారు డీకే శివకుమార్ & రమ్యగార్లతో రాయబారాలు చేయించినా ఫలితం సున్నా. చివరికి కుమారస్వామికే పట్టం కట్టి బీ టీముగా హస్తం మిగిలింది.

   సీన్ కట్ చేస్తే కుమారస్వామి స్థానంలో తన్ను తాను ఊహించుకొని పవన్ కళ్యాణ్ గారు కలలు కంటున్నారు, అవి ఎంతవరకు నిజం అవుతాయో రానున్న రోజులలో చూడాలి.

   Delete
  8. పవన్ అంత తెలివైనవాడైతే చిరంజీవి పార్టీని అమ్ముకుంటున్నప్పుడు ఏమి చేసాడు?

   Delete
  9. కలలు కనడానికి తెలివి అక్కరలేదండీ. ఆయన నిద్ర, ఆయన కళ్ళు, ఆయన కలలు!

   Delete
  10. ఉన్న బ్లాక్ మనీ ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, ఆ పని పూర్తి చెయ్యడానికి పార్టీ పెట్టుంటాడు.

   Delete
  11. @ప్రవీణ్,
   స్వంత అన్నకే డబ్బు సర్దలేక నానా అవస్థలూ పడ్డాడని విన్నాను. పవన్ చేసిన సినిమాలు ఎన్ని ? వదిలేసిన భార్యలకు ఇచ్చిన భరణాలు ఎన్ని ? ఈ లెక్కలన్నీ పోను "కాంగ్రెస్ హఠావో" అని గొంతెత్తి అరిచిన సభకి అయిన ఖర్చులు ఎన్ని ? ఆయన దగ్గర ఇంకా మిగిలి ఉంటుందంటారా ?

   జై గారూ,
   మీరు నేనడిగినదానికి సమాధానం చెప్పలేదు.కలయో, వైష్ణవ మాయో అలా జరిగితే పవన్ ఏం చేస్తారో ఊహించి చెప్పండి.

   Delete
  12. నీహారిక గారూ,

   నా సమాధానం స్పష్టంగా రాయలేక పోయానేమో? ఈ సారి ఇంగిలీషులో రాస్తాను, బ్రాకెట్లలో ఉన్నవి కర్ణాటక నాటక పాత్రలు.

   If Karnataka situation repeats in Andhra, Pavan (HDK) will become CM with TDP (INC) support & push YCP (BJP).

   PS: ఇది పవన్ కోరికని నా అంచనా. ఇప్పటి దాకా వస్తున్న సంకేతాల ప్రకారం ఇది నెరవేరుతుందని నమ్మకం లేదు.

   Delete
  13. పవన్ గారి దగ్గర బ్లాక్ మనీ ఉందో లేదో తెలియదుగానీ కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి భారీగానే ఖర్చులు అందుతున్నాయని టి.డి.పి వాళ్లు విమర్శిస్తున్నారు

   Delete
 7. అసలు "ముందుకి" అంటే ఏంటో జనం డిఫైన్ చెయ్యాలండి. లేకపోతే ప్రతీ నాయకుడూ నేను ఎటు నడిస్తే అదే "ముందుకి" అంటున్నాడు 😀

  ReplyDelete
  Replies
  1. ముందుకి అంటే ముందస్తుకి అని అర్థం.

   Delete
 8. చిరంజీవి గారు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్టే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా తన జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని జనాలు అనుకోవడం వింటున్నాం ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే

  ReplyDelete
 9. పైకి కనిపించకపోయినా జనసేన పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు బిజెపికి అనుకూలంగానే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో మటుకు జనసేన పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ కొట్లాడుకుంటున్నాయి. ఇది ఏ విధమైన రాజకీయ ఎత్తుగడో అర్థం కావడం లేదు.

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్