Breaking News

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

నీహారికా మేడమ్ గారు అడిగిన "వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు?" ప్రశ్నకు ఇప్పటికే చాలా మంది తమతమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే కొన్ని సబ్జెక్ట్ కు అతీతమైన కామెంట్లు కూడా వచ్చాయి. మరికొన్ని కామెంట్లలో అసభ్యకరమైన పదజాలం ఉందని శ్యామలీయం మాష్టారు గారు మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు ఆయన సూచించిన కామెంట్లను వెంటనే తొలగించడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటె పై ప్రశ్న నీహారికా మేడం గారు అడిగిన ప్రశ్నలాగే ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమయినది. ఒకవేళ "వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం" పూర్తీ స్థాయిలో అమలయితే భవిష్యత్ లో దాని పర్యవసానం ఎలా ప్రజలపై ఎలా ఉంటుంది? అనే సందేహం కలిగింది. ఇప్పటికే స్త్రీలకు రక్షణ కరువవుతున్న మనదేశంలో ఈ చట్టం వలన బంధాలు,బాంధవ్యాలు సర్వనాశనమవుతాయనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలను అంగడి వస్తువుగా మార్చేసే ప్రమాదమే కనిపిస్తోంది. దీని వలన ముఖ్యంగా పతనమయ్యేది హిందూ సంస్కృతే అనిపిస్తోంది.

మా మిత్రుడు ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేసాడు. అది ఈ తీర్పు పై చేయబడిన ఒక షార్ట్ ఫిలిం.
ఒక భర్త తన భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెల్సి గన్ తీసుకుని కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని భార్య తన ప్రియుడితో (నా దృష్టిలో ప్రియుడు అనేది కరెక్ట్ పదం కాదు. తప్పక అలా రాయాల్సి వచ్చింది.) పడక గదిలో చూసి కోపంగా ఊగిపోతాడు. తన భార్య ప్రియుడ్ని బయటకు తీసుకుని గన్ పెట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య తన ప్రియుడిని తన భర్త చంపేస్తాడనుకుందో లేక భర్తకంటే ప్రియుడే ముఖ్యమనుకుందో తెలీదు గాని తన భర్తను నిర్ధాక్షిణ్యంగా గన్ తో కాల్చి వేస్తుంది. వెంటనే ఆమె భర్త అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు. ఇందంతా చూసిన ఆమె ప్రియుడు "నీ భర్తనే ఇలా చంపుతావా? నీవు నాకు కరెక్ట్ కాదు, నీకూ నాకూ సంబంధం లేదు" అంటూ కారెక్కి వెళ్ళిపోతాడు. తరువాత ఆమె కొడుకు (6నుండి 7సంవత్సరాలు ఉండొచ్చు.) స్కూల్ నుండి వస్తూ తండ్రిని రక్తపు మడుగులో చూసి ఏడుస్తూ తండ్రిని లేపుతూ ఉంటాడు. అప్పటికే తండ్రి కన్నీళ్ళతో కొడుకు వైపుకు చూస్తూ మరణిస్తాడు. ఈ చట్టం అమలయితే బంధాలెక్కడ? అనే క్యాప్షన్ తో ముగుస్తుంది.

ఏది,ఏమైనా ఈ సుప్రీం తీర్పు చట్టమయితే భారతదేశ పటిష్టమైన వివాహ వ్యవస్థ బీటలు వారినట్టే!!

2 comments:

  1. ఈ తీర్పు యొక్క ఇంపాక్ట్ సమాజంపై పెద్దగా ఉండదు. ఆడవాళ్ళలో ఎక్కువ మంది పరువు పేరుతో అక్రమ సంబంధాలకి దూరంగానే ఉంటారు. తమకి ఏ చట్టం అడ్డు రాదనే ధైర్యం ఉండేది మగవాళ్ళకే.

    ReplyDelete
  2. http://www.chennaimemes.in/section-497-effect-woman-committed-suicide-after-knowing-her-husband-revealed-his-extra-marital-affair/

    ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్