Breaking News

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం ప్రభావం చూపని "కిరణ్ కుమార్ రెడ్డి" తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం అమాయకత్వం కాదంటారా?

If the Kiran Kumar Reddy does not have any effect when he is Chief Minister, will it be the innocence of the Congress party's strength?

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం ప్రభావం చూపని "కిరణ్ కుమార్ రెడ్డి" తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం అమాయకత్వం కాదంటారా?

15 comments:


 1. రాజకీయాల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. "టైమింగ్". ఆ టైమింగ్ వల్లే ఎన్.టి.యార్ ఒకప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైమింగ్ లోపించడం వల్లే చిరంజీవి చతికిల పడ్డాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరో వైపు విభజన అంశం ఉదృతంగా ఉంది. అప్పట్లో ఆయనే కాదు, ఎవరున్నా అంతకన్నా చేయగలిగింది లేదు. అప్పటికీ ఆయన పరిపాలన బాగానే చేశారు. చూపించాల్సిన టైములో తన సత్తా చూపించారు.

  ఇప్పుడు పరిస్థితులు వేరు. కొత్త రాష్ట్రం, కాంగ్రెస్ తిరిగి మళ్ళీ గాడిలో పడాలంటే ఒక సారి "ముఖ్యమంత్రి"గా పనిచేసిన అనుభవం ఉన్న ఇలాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్ఛితంగా ఆయన కాంగ్రెసుకు ఒక అస్సెట్ అవుతారు.

  ReplyDelete
  Replies
  1. ఇమేజ్ అస్సలే లేని "కిరణ్ కుమార్ రెడ్డి" గారు కాంగ్రెస్ కు ఎలా అస్సెట్ అవుతారో చెప్పగలరా? దానికంటే ముఖ్యం పిల్ల కాంగ్రెస్ ను మీ తల్లి కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఉపయోగం ఉండవచ్చు. ఎందుకంటే బిజెపికి ఎలానూ మంచి రోజులు లేవు కాబట్టి. మేడమ్ సోనియా తల్చుకుంటే జగన్ ను దారికి తెచ్చుకోవడం ఇప్పుడున్న పరిస్థుతులలో పెద్ద కష్టం కాకపోవచ్చు. ఒకసారి ఆలోచించండి.

   Delete
 2. ప్రస్తుత ఆంధ్రాకి న్యాయం చేయగలిగే కరెక్ట్ సి.యం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబా? జగనా? పవనా? అనే టపా పై హరిబాబుగారు, మీరూ జరిపిన చర్చ పూర్తిగానే చదివాను. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభపడవచ్చు కాని తీవ్ర అన్యాయం చేసిన ఆంధ్రాకు తిరిగి న్యాయం చేస్తారన్న నమ్మకం ఇప్పట్లో ఆంధ్రా వాళ్లకు లేదు. ఎందుకంటే మేడం సోనియా తెలంగాణాను, కెసియార్ ను మాత్రమే నమ్మింది. ఆంధ్రాను నట్టేట మునిగినా పర్లేదు అనుకున్నారు. విశ్వ వీక్షణం గారు ఒకసారి ఆలోచించండి ఆంధ్రాకు ఏమైనా మిగిలాయా? ఎంత అన్యాయం?
  ఒక ఇంటిలో ఒక చిన్న హాలు, బెడ్ రూమ్, కిచెన్..కిచెన్ నిండా వంట సామాగ్రి, తిను బండరాలు ఉన్నాయి. ఆ ఇంటి గల ఇద్దరు యజమానులకు గొడవ వచ్చింది. వ్యవహారాన్ని ఒక పెద్ద మనిషి (మేడం సోనియా)వద్దకు తీసుకువెళ్తే ఆమె (ఇక్కడ సోనియా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ), నానా యాగీ చేసి, అన్యాయమైన ఆరోపణలు చేసిన ఒక యజమానికి (కెసియార్-తెలంగాణ)కు ఆ ఇంటిలో బెడ్ రూమ్, కిచెన్.. కిచెన్ లోని మొత్తం సామాగ్రి ఇచ్చివేసి, రెండవ యజమాని (చంద్రబాబు-ఆంధ్రా)కు ఆ చిన్న హాల్ మాత్రమె పంచి ఒక దిక్కుమాలిన తీర్పు చెప్పింది.

  పాపం ఆ రెండవ యజమానికి (ఆంధ్రా)కు ఆ చిన్న హాల్ లో కూర్చోడానికి కుర్చీ లేదు, పడుకోవడానికి మంచమూ లేదు. ముఖ్యంగా తినడానికి ఏవిధమైన సౌకర్యమూ లేదు. ఇటువంటి అన్యాయపు పంపకాలు చేసిన ఆ పెద్దమనిషి మళ్ళీ వచ్చి మీకు న్యాయం చేస్తానంటే నమ్ముతారా?

  దీనికి విశ్వ వీక్షణం గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే "కాంగ్రెస్ " వస్తే ఏదో ఊడిపడుతుందని వాదిస్తున్నారు గదా?

  ReplyDelete
 3. I am Indian గారూ,
  మీకు తప్పకుండా సమాధానం ఇస్తాను. ఈ త్రెడ్ ఇలానే ఉంటుంది కదా ! కాస్త పనులు పూర్తిచేసుకుని తీరిక పడగానే వస్తాను. ఈ డిస్కషన్ను కొనసాగిద్దాం. అంతవరకూ ఓపిక పట్టమని చెప్పడం తప్ప ప్రస్తుతం సమయం కేటాయించలేను. క్షంతవ్యుడను :-)

  ReplyDelete
 4. కిరణ్ కుమార్ రెడ్డి నెత్తి మీద రూపాయి పెడితే పావలా చేయడు. ఇటువంటి వారిని నమ్ముకోవడం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం.

  ReplyDelete
 5. ఒకప్పుడు కే.సీ.యార్ పరిస్థితి కూడా అదేనండి జైగారూ ! తరువాత తరువాత సీను మారిపోలా, ఆయన రాష్ట్రం కోసం చేసే పనులే ఆయన్ను నిలబెడతాయి.

  ReplyDelete
  Replies
  1. కిరణ్ రాష్ట్రం కోసం పనులు చేయాలంటే ముందు పదవి రావాలి. పదవి రావాలంటే ముందు కాంగ్రెస్ గెలవాలి. ఆయన పార్టీని గెలిపించలేడు మరెట్లా! This is a vicious circle.

   ప్రజల్లో కాస్త గట్టి పట్టే ఉన్న జగన్ గారిని దూరం చేసుకొని కాంగ్రెస్ బావుకున్నది ఏమిటి? శరద్ పవర్, మమతా బెనర్జీ తరువాత మళ్ళీ ఇంకో తప్పిదం.

   Delete
 6. కే.సీ.యారు కూడా 2014లో మాత్రమే అధికారములోకి వచ్చాడండి. అంతకు ముందు ఆయన చేసిన దానివల్లే వచ్చాడు ఆ పదవిలోకి.

  జగన్ విషయం తప్పా ఒప్పా అన్నది ప్రస్తుతం అనవసరమే కదా ! తిరిగి కాంగ్రెసు గూటికి చేరడమా లేక బీ.జే.పీతో కలిసి పోవడమా అన్నది ఆయన ఇష్టం. పార్టి నుండి బయటకి రావడం కూడా ఆయన ఇష్టమే. శాశ్వత శతృవులుండరన్నట్టు ఆయన ఎప్పుడైనా రావచ్చేమో కానీ, ప్రస్తుతానికి కాంగ్రెస్ మాత్రం ఆయన వైపు చూడట్లేదు.

  ReplyDelete
  Replies
  1. పదవిలో లేకపోయినా, అసలు పదవి వస్తుందా రాదా అని తెలీక పోయినా, ప్రజల్లో తిరిగి భావజాలవ్యాప్తి చేసిన లాంటివారితో (ఉ. కెసిఆర్/జగన్/చంద్రబాబు) కిరణ్ కుమార్ రెడ్డిని పోల్చలేము.

   టీవీ ఛానెల్ పెట్టకుంటేనో లేదా మీడియా/ట్విటర్ హడావుడితో ఎవరూ నాయకులూ కాలేరు. ఇది గుర్తించే పవన్ రోడ్డు మీద పడ్డాడు.

   పోయిన ఎన్నికలలో వైకాపా-కాంగ్రెస్ కూటమి కలిసి పోటీ చేసి ఉండుంటే జగన్ ఆంద్ర ముఖ్య మంత్రి అయుండే వాడు. సొంతంగా పోటీ చేయడం & రుణమాఫీ వ్యతిరేకించడం రెండూ అతినమ్మకంతో చేసిన పొరపాట్లు.

   Delete
 7. జైగారూ,

  నేను చెప్పేది కూడా ఆల్మోస్ట్ అదేనండి.
  ఆయన పార్టీలోకి వచ్చిన తరువాత తిరిగి ఏమి చేస్తారు అనేదే అసలు విషయం. పార్టీలో చేరగానే ఆయన కాంగ్రెసును గెలిపించగల నాయకుడు అవుతాడు నేను ఎప్పుడూ అనలేదు. కానీ, ఆయన సమర్ధవంతంగా పనిచేయడం మొదలు పెడితే.. (ఆ సమర్ధత ఆయనకు ఉంది), తిరిగి పార్టీని పునర్వైభవానికి తీసుకొచ్చే దిషగా మొదటి అడుగు పడినట్టే. ఆంధ్రాలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటే చాలు 2019లో కాకపోయినా 2023/4 లో ఖచ్ఛితంగా అధికారములోకి వచ్చే అవకాశం ఉంది. 2019లో తమ ఉనికిని గట్టిగా చాటుకుంటే చాలు, ఆ అవకాశమైతే ఉంది.

  ReplyDelete
  Replies
  1. "ఆయన సమర్ధవంతంగా పనిచేయడం మొదలు పెడితే"

   సరే మీ నమ్మకం మీది.

   "2023/4 లో ఖచ్ఛితంగా"

   2024 గురించి ఇప్పుడే ఏమి చెప్పగలము, ఎన్ని మార్పులు జరుగుతాయో?

   Delete
  2. ఆంధ్రాలో ఎన్ని మార్పులైనా జరగొచ్చు. కానీ కాంగ్రెసు మాత్రం తిరిగి పుంజుకోవాలంటే, ఇప్పటినుండె పనులు మొదలు పెట్టాలి. అసలు ఈపాటికే మొదలు పెట్టి ఉండాల్సింది. బహుషా కర్ణాటకాలో సాధిచిన విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చు. కర్నాటక ఎలక్షన్లు కాంగ్రెసుకు టర్నింగ్ పాయింటు అసలు. తెలంగాణలో కూడా కర్ణాటక తరహా కూటమితో టి.ఆర్.ఎస్ ను ఎదుర్కో బోతున్నాం అని చెప్పేశారు కదా కాంగ్రెస్ వారు. తెలంగాణాలో పార్టీ ఆంధ్రా అంత అధ్వాన్నంగా లేదు, స్ట్రాంగుగానే ఉంది. కాస్త సరైన వ్యూహం తోడైతే.. టి.ఆర్.ఎస్ కు చుక్కలు కనిపించినా ఆశ్చర్యపోను.

   Delete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. ప్రస్తుతం ఊమెన్ చాందీ ఇంచార్జిగా ఉన్నారు కదా ! అదిష్టానం కూడా అంధ్రాను సీరియసుగానే తీసుకుంది అని తెలుస్తూనే ఉంది.

  https://www.thenewsminute.com/article/tough-task-ahead-oommen-chandy-appointed-congress-andhra-charge-81990

  ReplyDelete
 10. కాంగ్రెస్ పార్టీకి సంబందించినవి తప్ప మరే వాటికి రెస్పాండ్ కాకూడదు అన్న నియమాన్ని (నాకు నేను పెట్టుకున్నది) ఉల్లంఘించిన మీదట, కాస్త సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకునే వరకూ కొంత కాలం మౌనం.

  హరిబాబు బ్లాగులో ఈ కామెంటూ రాశాను కానీ, హరి బాబేమో ఇంకా ప్రచురించలేదు.

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్