Breaking News

పరిపూర్ణనంద స్వామి-కంచె ఐలయ్య అసలు సిద్ధాంతాన్ని వక్రీకరిస్తూ మార్గం తప్పిస్తున్నారన్న వాదన సరయినదేనా?

ఐలయ్య విషయంలో ప్రస్తుతం జరుగుతున్నదంతా కులాల మధ్య వ్యవహారం. దీని మధ్యలో మతాన్ని ఎందుకు దూర్చుతున్నారని పరిపూర్ణనంద స్వామినుద్దేశించి కొంతమంది తీవ్రంగానే ప్రశ్నిస్తున్నారు. మొన్న TV9 జరిపిన డిబేట్ ప్రోగ్రాంలో మొదట్లో నాకు రాగద్వేషాలు లేవని బాహాటంగా ప్రకటించుకున్న పరిపూర్ణానంద ప్రోగ్రాం మధ్య కోపోద్రిక్తుడై ఎందుకు లేచి వెళ్ళిపోయాడు. ఇక కోపతాపాలు కూడా అణుచుకోలేని పరిపూర్ణానంద సన్యాసి అయ్యి ప్రయోజనం ఏముందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక పొతే అన్ని కులాల వారిని సమంగా చూడాల్సిన పరిపూర్ణానంద ఒక కులానికి మద్దతిచ్చి మాట్లాడాల్చిన పని అతనికెందుకు? ఆయన మాటలు వింటుంటే అతనిలో ఏమాత్రం సన్యాసి లక్షణాలు కనిపించడం లేదని, అలాగే సత్యాన్ని మాత్రమే పలకాల్సిన స్వామి అబద్ధాలను మోపుతూ కంచె ఐలయ్యను చెడ్డవాడిగా చూపే ప్రయత్నం చేస్తున్నాడని...ఎలా అంటే మొన్న జరిగిన డిబేట్ లో కంచె ఐలయ్య కేవలం ఇదిగో నా తల్లిదండ్రులు..వారి పేర్లు, మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి? అని ఐలయ్య రెట్టించి అడిగినందుకే "నాతల్లిని అవమానించాడని" ఐలయ్యపై నింద మోపడం, అబద్దాన్ని అంటగట్టడం, పైపెచ్చు "నాకు పిల్లనిస్తావా?" అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం చూస్తుంటే ఆయన సన్యాసి ఏమిటబ్బా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఐలయ్య వ్యవహారాన్ని దారి తప్పిస్తూ, మరింత విద్వేషపూరితంగా మార్చుతూ రాష్రంలో అలజడులకు ఆజ్యం పోస్తున్నాడని పరిపూర్ణానందపై కొంతమంది వ్యతిరేకత చూపుతున్నారు. సిపిఐ నాయకుడు రామకృష్ణ కూడా పరిపూర్ణానందను ఖండించిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే! 

3 comments:

 1. for SELF EMPLOYMENT/HOME BUSINESS www.indiaonlines.in *** www.4job.in

  ReplyDelete
 2. కంచె ఐలయ్య అసలు సిద్ధాంతాన్ని వక్రీకరిస్తూ......

  hari.S.babu
  కంచె ఐలయ్యకి అసలు సిద్ధాంతం ఉందా?ఉంటే ందులో మీకు అర్ధమైనదిఎంత?కొంచెం క్లారిటీ ఇవ్వండి - అప్పుడు పరిపూర్ణానంద దాన్ని వక్రీకరించాడా లేదా అన్నది తెలుస్తుంది!

  ReplyDelete
 3. ఐలయ్య కేవలం ఇదిగో నా తల్లిదండ్రులు..వారి పేర్లు, మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి? అని ఐలయ్య రెట్టించి అడిగినందుకే

  hari.S.babu
  మీరేమో పైన కంచె ఐలయ్య సిద్ధాంతాన్ని పరిపూర్ణానంద వక్రీకరించాడు అంటున్నారు.అక్కద ఆయన వక్రీకరించడానికి కంచె ఐలయ్య మాట్లాడిన అంత గొప్ప సిద్ధాంతం ఏమిటి?సిద్ధాంతాల గురించి మాట్లాడకుండా కంచె ఐలయ్య తన తలిదండ్రుల పేర్లు చెప్పడం పరిపూర్ణానంద తలిదండ్రుల పేర్లు అడగటం దేనికి చేసినట్టు?తనయొక్క మరియు పరిపొర్ణానంద యొక్క తలిదండ్రుల పేర్లకీ వాళ్ళు చర్చిస్తున్న సిద్ధాంతానికీ సంబంధం ఏమిటి?

  అసలు విషయానికి సంబంధించి పరిపూర్ణానంద వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోవడం వల్లనే ఐలయ్య వ్యక్తిగతమైన విద్షయాలు యెత్తుకున్నాడనేది అర్ధం అవుతున్నది - అసలైన నీచత్వం కంచె ఐలయ్యదే!మీరు అంటున "వ్యవహారాన్ని దారి తప్పించి తప్పుకోవాలని చూడడం" కంచె ఐలయ్య వైపునుంచే జరిగింది!సందర్భం లేకపోయినా తలిదండ్రుల ప్రసక్తి తీసుకొస్తే అవతలివాడు సంసారి అయినవాడు కూడా అలాగే మాట్లాదతాడు.అది ఆయనకీ మీకూ అర్ధం కావడం లేదు!

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్