Breaking News

రిజర్వేషన్ల వలన దేశానికి ఉపయోగముందా?

రిజర్వేషన్ల కారణంగా అర్హత కలిగిన వారికంటే, అర్హత లేనివారే ప్రభుత్వ సంస్థలలో కూర్చుంటున్నారు. దీని వలన ప్రభుత్వ సంస్థలలో బద్ధకస్తులు, సోమరిపోతులూ పెరిగిపోయి తుప్పుపడుతున్నాయన్న వాదన బలంగా ఉంది. మరొక విషయమేమిటంటే ఆర్ధిక స్థితిగతులను కాకుండా, అర్హతలను,నైపుణ్యాలను కాకుండా కేవలం కులాల ప్రాతి,పదికపై రిజర్వేషన్లు కలిపించడం మరీ దారుణమన్న వాదన కూడా బలంగా ఉంది.దీనికేమంటారు?

16 comments:

 1. "అర్హత లేనివారే ప్రభుత్వ సంస్థలలో కూర్చుంటున్నారు"

  ఇది పూర్తిగా అవాస్తవం.

  రిజర్వేషన్లు కోటా అంటే ఉన్న అవకాశాలాలలో నిర్ణీత శాతం స్థానాలు కొన్ని వర్గాలకు కేటాయింపు. ఇందులో కనీస ప్రవేశ అర్హత సడలించడం జరగదు.

  ReplyDelete
  Replies
  1. ఏమీ చేతగాని వాడు రిజర్వేషన్ కోటాలో కూర్చుంటే ఉపయోగమేముంది? అసలు ఈ రిజర్వేషన్లు పూర్తిగా ఎట్టిపారేసి టాలెంట్ పరన్స్ కి ఉద్యోగాలు కలిపించాలి. అది ఎవడైనా కావచ్చు.పని చేసేవాడై ఉంటే దేశం సగం బాగుపడుతుంది.

   Delete
  2. కనీస అర్హతలు ఉన్నవారిని "ఏమీ చేతగాని వాడు" అని ఎలా అనగలరు? రిజర్వేషన్లు ఉన్నవారికి & లేనివారికీ ఒకే అర్హత పాటించినంతవరకు అభ్యంతరం ఎందుకు?

   Delete
 2. రిజర్వేషన్ వల్ల సమస్యలు ఉన్నాయి. దళితులు, ఆదివాసులు చదవకప్పోయినా ఉద్యోగాలు వస్తాయనుకుని, మా ప్రాంతంలో మా కులంవాళ్ళు అందరూ తమ ఆడపిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగులకే ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నారు. అందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో గుమాస్తా ఉద్యోగాలు చేస్తే వ్యాపారం, వ్యవసాయం ఎవరు చేస్తారు అనే సందేహం వాళ్ళకి రాదు.

  ReplyDelete
  Replies
  1. రిజర్వేషన్ల దుర్వినియోగం ఎక్కువే ఉంది. కొన్ని కులాలనే అట్టడుగు స్థాయనడం కరెక్ట్ కాదు. అన్ని కులాలలోనూ అట్టడుగు కుటుంబాలు ఉన్నాయి. కుల ప్రాతి పదికన కాకుండా రిజర్వేషన్లు నిర్మూలించాలన్నది నా అభిప్రాయం.

   Delete
 3. రిజర్వేషన్‌కి నేను వ్యతిరేకం కాదు. కానీ రిజర్వేషన్ quotaలో ఉద్యోగం దొరికే అవకాశం లేని పల్లెటూరివాడు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం సర్కస్ చెయ్యడం చూస్తున్నాను కదా.

  ReplyDelete
 4. ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించవల్సిందే!కులాలను కాకుండా ఆర్ధిక స్థితిగతులను బట్టి, అర్హతను బట్టి ఉంటేనే బాగుంటుంది. పెద్ద కులాలని ముద్ర వేసిన వాళ్ళలో కడు బీదరికంతో మగ్గుతున్నవారు లేరా? కాబట్టి ఈ రిజర్వేషన్ల వలన ఉపయోగం ఏముంది?

  ReplyDelete
 5. కులప్రసక్తిని పూర్తిగా తీసేసి ఆర్ధికాన్ని చూడవలసి వస్తే అసలు రిజర్వేషన్ అనే వూహయే అసంబధ్ధం అవుతుంది.ఎందుకంటే రిజర్వేషన్లు మొదలు పెట్టింది ఎప్పుడు? స్వతంత్రం వచ్చిన వెంటనే! ఇంగ్లీషు వాళ్ళ నుంచి విడిపోయాక దేశంలో అసమానతలు ఉండకూదదని.అప్పటి సమాజం ఉన్న స్థితిని బట్టి కొన్ని కులాలకి విద్య,వైద్యం,సంపద వంటివి పూర్తిగా దూరంగా ఉండటం వల్ల ఒక్కసారి పోటీ ప్రపంచంలోకి వీళ్లని తోస్తే వెనకబడిన వాళ్ళు వెనకే ఉండిపోతారని కదా!

  దాన్ని తీసెయ్యడం అంటే మొత్తం రిజర్వేషన్లని యెత్తెయ్యడంతో సమానం.ఆర్ధిక ప్రాతిపదికని పెట్టటం కూడా అందరూ ఒప్పుకుంటారా అనేది సందేహమే - క్రీమీ లేయర్ ఉద్దేశం అదే,కానీ వర్కవుట్ అవ్వలేదు!అగ్రవర్ణాల లోని బీదవాళ్ళూ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే,కానీ రిజర్వేషన్లని సామాజీక్ కారణాలతో గదా నిర్ణయించాల్సింది?అసలు చెయ్యాల్సింది తెలంగాణలో సకలజనుల సర్వే మాదిరిగా వెనుకబడిన వర్గాల నిజస్థితి ఎట్లా ఉంది అనేది తెలుసుకుని రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అని తేల్చుకుని అనవసరమైన వ్యామోహాలకి పోకుండా ఎత్తెయ్యటమో మరింత శాస్త్రీయమైన పధ్ధతిలో కొనసాగించడమో చెయ్యాలి

  రిజర్వేషన్లు అనేవి కొన్ని కులాల వారిలో మనం నిజంగానే ఎందుకూ పనికిరామేమో అనే ఆత్మన్యూనత బలంగా ఉన్న రోజుల్లో ప్రవేశపెట్టారు గాబట్టి అలాంటి ఆత్మన్యూనత అంశాన్ని అంచనా వేస్తూ సర్వే జరగాలి. ఒకటి మాత్రం నిజం - ఇవ్వాళ అమేరికాలోనో మరొక చోటో హఠాత్తుగా పదిమంది గుమిగూదే చోత పిచ్చెత్తినట్టు తుపాకీ/మారణాయుధం పట్టి విధ్వంసం స్ర్ష్టించేవాళ్ళు పోటీలో వెనకబడిన వాళ్లని అప్ట్టించుకోని పెట్టుబడిదారీ ఆర్ధికవిధానం యొక్క క్రూరత్వం వల్ల కాబ్ట్టి పోటీలో వెనక్కి తగ్గిన వాణ్ణి "వెనకాబ్డితే వెనకే" నాన్నట్టు తోసెయ్యకుండా ఏదో ఒక రూపంలో రక్షణ ఆవసరమే.కాట్టి పూర్తిగా ఎత్తెయ్యాలని నేను అనుకోవడం లేదు.మరినత్ శాస్త్రీయమైన పధ్ధతిని పాటించహ్దమే మార్గం.దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలై అనేదాని మీద చర్చ జరగాలి.

  ReplyDelete
 6. నేను హరిబాబు గారి వ్యాఖ్యని సమర్థిస్తాను.

  మన దేశంలో రిజర్వేషన్లు ఉన్నదే సామాజిక కారణాల వల్ల. సామాజికాంశాన్ని పక్కకు పెడితే ఇక రిజర్వేషన్లే అవసరం లేదు.

  అందువల్ల ప్రతి ఐదు/పది సంవత్సరాలకు ఒకసారి నిస్పాక్షిక సర్వే జరిపి, రిజర్వేషన్ల ఫలాలు పొందిన వర్గాలని అందులోంచి మినహాయిస్తూ క్రమంగా రిజర్వేషను వ్యవస్థను అంతం చేయాలి.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ హరిబాబుగారిని సమర్థించిన సందర్భం బాగుంది.
   ప్రత్యేకతలు కొన్నాళ్ళే అని అన్నా ఈ రిజర్వేషన్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. క్రమంగా వందశాతాన్నీ మించినా ఆశ్చర్యం లేదు. ప్రత్యేకతలకు అలవాటుపడినవారు వాటిని ఎట్టిపరిస్థితుల్లోవనూ వదులుకోరన్నది నిజం. వారు ఓటుబ్యాంకులుగా ఉన్నంతకాలమూ వారికి ప్రత్యేకతను రద్దుచేసే సాహసాన్ని ఏ ప్రభుత్వమూ చేయలేదు. అలా చేయాలని ఏ రాజకీయ వర్గమూ ప్రతిపాదించనూ లేదు కదా. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తే కాని ఈ మార్పు వచ్చే అవకాశం దాదాపు శూన్యం అనే చెప్పాలి.

   Delete
  2. శ్రీకాంత్ చారిగారి సూచన చాలా బాగుంది.నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. అయినా ఇందులో కొన్ని లోపాలు కూడా లేకపోయేది. అయినప్పటికీ కులాలను బట్టే ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

   Delete
  3. హరిబాబు, శ్రీకాంత్ గార్లు ఇద్దరూ మంచి సూచనలు చేసారు.

   ప్రత్యేకతలు పొందిన వారు ఒక పట్టాన దాన్ని వదులుకోరు అన్న శ్యామలీయం మాస్టారి మాట కూడా అక్షర సత్యం. అంతెందుకు మరాఠా, జాట్, పటేల్, కాపు, వన్నియార్ లాంటి వర్గాలే కొత్తగా తమకూ ఇవ్వమని అడగడం చూస్తున్నాము.

   నా అభిప్రాయాలు కొంత మేరకు భిన్నమయినా చర్చ కోసం మీ ముందు ఉంచుతాను.

   1. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశ్యం తగినంత ప్రాతినిధ్యం లేని వర్గాలకు (under represented groups) ప్రాతినిధ్యం కల్పించడం. ప్రాతినిధ్య కొరతకు ముఖ్య కారణం కులం ఆధారంగా జరిగిన వివక్ష మరియు/లేదా అవకాశాల లేమి కనుక విరుగుడుకు కూడా అదే ప్రాతిపదిక అవసరం.
   2. క్రీమీ లేయర్ తొలగించడంతో రిజర్వేషన్ల శాతం తగ్గదు కనుక మిగిలిన వారికి (FC) ప్రయోజనం లేదు. బడుగు వర్గాలలో రెండు గ్రూపులు తయారవ్వడమే కాక ఇది ఆయా వర్గాలకు సహజనాయకులను (natural leadership) దూరం చేస్తుంది కనుక వారికీ నష్టం.
   3. మారుతున్న కాలంతో పాటు రిజర్వేషన్ల తీరుతెన్నలు కూడా మారాయి. ప్రభుత్వ రంగం యొక్క ప్రాముఖ్యం పడిపోవడం మొదలయ్యింది. ఒకప్పుడు బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న రిజర్వేషన్లు రానురాను గుదిబండలు కానున్నాయి. దీన్నే తరుతున్న కంచంలో పెరుగుతున్న భాగం (increasing share of a shrinking pie) అనుకోవచ్చు.
   4. మారాల్సింది రాజకీయ వ్యవస్థ కాదు, సామాజిక ఆర్ధిక వ్యవస్థ. షెకు షెతె వెతె మైనారిటీలకు రాజ్యాధికారం వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. సామాజిక న్యాయం పాట పాడే పార్టీలలో అత్యధికం దొరల చేతులలోనే ఉన్నాయి కనుక ఇదంత సులభం కాదు. ఆయా దొరలను & వారి వంత పాడే పాలేరు మంత్రులను & జీతగాళ్ళను నమ్ముకుంటే బడుగులకు ఏమీ ఒరగదు.

   Delete
  4. Thanks Jai,

   Nicely summed up.

   నిజానికి సర్వే చేసి తీసెయ్యండి అని చెప్పడం సులభమే, కాని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే అది సాధ్యమయ్యే పని కాదు.

   అలాగే ఇప్పుడు రిజర్వేషన్ల ప్రాధాన్యత కూడా క్రమ క్రమంగా తగ్గి పోతోంది. క్రీమీ లేయర్‌లోని వారు కూడా ప్రభుత్వోద్యోగాలకు వెంపర్లాడక ప్రైవేట్ రంగంలోని సాఫ్ట్‌వేరు మొదలైన రంగాలు ఎంచుకోవడం ద్వారా క్రింది వారికి ప్రభుత్వోద్యోగాల్లో ఖాళీ వదులుతున్నారు.

   పైగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా SC/ST కేటగిరీల్లో అభ్యర్థులు లేక బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండడం శోచనీయం. కాబట్టి ప్రభుత్వం కేవలం రిజర్వేషన్లు కల్పించి చేతులు దులుపుకోకుండా ఆయా వర్గాల వారిని ఆర్థికంగా పరిపుష్టి కావడానికి దోహద పడ్డప్పుడే వారికి నిజమైన సామాజిక న్యాయం లభిస్తుంది. కొంతవరకు ఫీ రీ-ఇంబర్సుమెంటు స్కీములు విద్యార్జనకు తోడ్పడుతున్నా... అది కేవలం ఉన్నత విద్యవరకే పరిమితం. KG to PG వంటి స్కీములు నిజాయితీగా అమలు చేసినపుడే బడుగువర్గాల అభివృద్ధి సాధ్యపడుతుంది.

   Delete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. వాదనలో గట్టిగా ఉండటం తప్పు లేదు గాబట్టి గట్టిగా పోట్లాడుకున్నట్టు కనిపిస్తాం గానీ శ్రీకాంత్ చారి పట్ల నాకు వ్యక్తిగతంగా ద్వేషం ఏమీ లేదు.తనవైపు నుంచీ అంతే ననుకుంటాను.నాకు చర్చని ఏకపక్షంగా ఫిరాయించుకోవాలనే దురద లేదు కాబట్టి ఒకరకంగా అభిమానమే ఉంది.మిగిలిన వాళ్ళు కూడా మాలాగే ఉంటే బ్లాగుల్లో జరిగే చర్చలు ఆరోగ్యకరంగా ఉంటాయని నా ఆభిప్రాయం.

  ReplyDelete
 9. * ముందుగా మీకు రిజర్వేషన్ల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్యేశం చెప్పాలి.. "రిజర్వేషన్లు ఆర్థిక ప్యాకేజీ కాదు" రిజర్వేషన్ అనేది అవకాశాలకు దూరంగా నెట్టివేయబడిన ప్రజలకు అవకాశాలలో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఏర్పాటైన భద్రత... దీని ఆసరాగా తరతరాలుగా గురైన దోపిడి నుండి ఉపశమనం పొందుతూ., కోల్పోయిన వనరులలోని తన వాటాను తిరిగి సాధించే దిశగా అడుగులు వేయడం దీని ప్రధాన కర్తవ్యం... ఈ క్రమంలో తమ హక్కులను గుర్తిస్తూ కుల వ్యవస్థ బంధనాల నుండి బయటపడి కుల నిర్మూలన వైపు అడుగులు వేస్తూ సమ సమాజ నిర్మాణం జరగాలి...

  అది మరి జరిగిందా?? జరగకపోవడానికి రిజర్వేషన్లు కేవలం ఆర్థిక ప్యాకేజీగా భావించే రాజకీయ నాయకులు కాదా??

  * ఈ దేశ పౌరునిగా దేశ సంపదలో తన వాటా పొందడం ఒక నైతిక హక్కు., అది సాధించేందుకు అగ్రకులాలు అడ్డు పడుతూనే ఉంటాయి కాబట్టి అందుకు కావలసిన ప్రాతినిధ్యం రిజర్వేషన్ల ద్వారా కల్పించారు... అది ఒక నిరంతర ప్రక్రియగా జరగాలి.. వనరుల పంపకంలో కూడా సమానత్వం సాధించేటంత వరకూ అది కొనసాగాలి...

  అలాంటి ఈ దేశ ప్రజల నైతిక హక్కు

  * రిజర్వేషన్లు పొంది తమ పొట్టకూడు సంపాదించుకున్నంత మాత్రాన సమాజంలోని కుల వ్యవస్థ ప్రభావం నుండి., అగ్రకులాల దోపిడీ స్వామ్యం నుండి తప్పించుకున్నట్లా?? రాష్ట్రపతులు., ముఖ్యమంత్రులూ కూడా ఈ వివక్షాపూరిత వ్యవస్థ ప్రభావం నుండి తప్పించులేనంత కులం కంపు సమాజంలో ఉంటున్న నీకు తెలియదా... రిజర్వేషన్ల లక్ష్యాలు నెరవేరలేదని??

  * పేద విధ్యార్థికి చదువు దూరం అవడానికి., మొత్తం అవకాశాలలో నామమాత్రం కూడా కాని రిజర్వేషన్లు ఎలా కారణం అవుతాయి?? పేద విధ్యార్థులకు చదువు దూరం అవడానికి కారణం, విధ్యను వ్యాపారం చేసి ఒక ఖరీదైన సరుకుని చేసిన., కార్పొరేట్ విధ్యా సంస్థలు కాదా??

  * నియో లిబరల్ పాలసీల పేరుతో., దేశ సంపదను కొన్ని కులాల దగ్గర కేంద్రీకరిస్తూ, అంకెలలో మాత్రమే కనిపించే ఆర్థిక ప్రగతిని అమలు చేసే క్రమంలో., ప్రైవెటైజేషను పేరుతో రోజు రోజుకూ రిజర్వేషన్లు సంఖ్య తగ్గిస్తున్నాయి కాబట్టే, వాటి మీద వొత్తిడి పెరిగి చేరుకోవాల్సినంత మందికి చేరుకోవడం లేదు...

  మరి సమాజ హితం కోసం ఆలోచిస్తానంటూ ప్రగల్భాలు పలికే వాళ్ళు, అవకాశాలు పెంచే విధంగా పోరాటాలు చేయాలే గానీ., అసలు మొత్తంగా అవకాశాలే లేకుండా చేయాలని మతిలేని వాదన చేయడం, అగ్రకుల మనస్తత్వ ప్రభావానికి సంకేతం కాదా???

  మరి నవ్వు చెబుతున్న పేదరికానికి కానీ., వెనకబాటుతనానికి కానీ ఏ మాత్రం కారణం కాని రిజర్వేషన్ల పై నువ్వు విషం కక్కడం ఎవరికోసం?? నీ లాంటి మనువాద మనస్తత్వం గల రాజకీయ నాయకులు ఈ దేశానికి చీడలా తయారై, రాజ్యాంగ నిర్మాతల ఆశలు నెరవేరకుండా అడ్డు పడుతూ ఉన్నారు...

  వ్వవస్థలో కాదు లోపాలు ఉన్నది.. మనువాదంతో నిండిన మీ మెదళ్ళలో ఉంది ప్రధాన లోపం... దిశా నిర్ధేశం చేసే రాజకీయాల నుండి మీలాంటి వాళ్ళను దూరంగా పెట్టడమే నిజమైన పరిష్కార మార్గం..

  నువ్వు నీ పార్టీ చేస్తున్న గొబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి అంబేద్కరిస్టులుగా మేం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం.. మీ అగ్రకులాల ప్రయోజనాల కోసం దేశంలోని అత్యధిక సంఖ్యాకుల అభివృద్ధిని పణంగా పెట్టేందుకు చేసే మీ ప్రతీ ప్రయత్నాన్నీ నిరభ్యంతరంగా ఎదుర్కొంటాం..

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్