Breaking News

హిందూ మహిళలు నల్గురు పిల్లలను కనాలన్న బి.జె.పి. ఎం.పి సాక్షీ మహరాజ్ సూచనను మీరు సమర్ధిస్తారా?


11 comments:

 1. కుటుంబనియంత్రణ అనేది నా దృష్టిలో చాలా ప్రమాదకరమైనది, చాలా దారుణమైన అనర్ధాలకు కూడా దారి తీస్తుంది. అనదరూ చాలనుకున్న ఇద్దరు పిల్లలు మగవారై ఉంటే చాలు అనే పరిస్థితి వచ్చింది. దాని కారణంగా ఆడపిల్లల పెరుగుదల విపరీతంగా తగ్గిపోతుంది. అల్రెడీ కొన్ని వర్గాలలో స్త్రీల సంఖ్య తగ్గిపోయింది కూడా. ఇది ఎంతవరకూ దారి తీస్తుందంటే స్త్రీ కనిపిస్తే చాలు ఎత్తుకుపోయే పరిస్థితి దాపురిస్తుంది. ఇక స్త్రీలకు ఏవిధమైన రక్షణ లేకుండా పోతుంది. నిజానికి ఈ కుటుంబ నియంత్రణ దేని కోసమో ఇప్పటికీ నాకు అర్ధం కాదు.ఉండడానికి దేశంలో చోటు లేకా? తినడానికి తిండి లేకా? ఒక్కప్పుడు దేశ జనాభా 60 కోట్లు ఉన్నప్పుడు ఎకరం పొలం 15 నుండి 20 బస్తాల వరకూ పండేది. ఇప్పుడు 100 కోట్ల జనాభా వచ్చినందుకు ఎకరం పొలం 35 నుండి 40 బస్తాల వరకూ పండుతుంది. పుట్టించిన దేవుడికి అంతా తెల్సు. వేద గ్రంధాల ప్రకారం భువి పైకి వస్తున్న జనాభాను అడ్డుకుంటే చాలా అనర్ధాలు చవి చూడవల్సివస్తుంది.

  ReplyDelete
 2. ఆడ, మగపిల్లల పుట్టుక is in the all governed by randomness. మనం గర్భంలోకి తొంగిచూసి ఏరివేతలు చేయడమే ఆడమగరేషియో చెడడానికి కారణం తప్ప కుటుంబనియంత్రణకాదు.

  వేదాల్నీ, కురాన్నీ, బైబిల్నీ కాసేపు పక్కనబెట్టి బుర్రవాడడం మొదలుపెట్టాలి మనం. ముఖ్యంగా లౌకిక విషయాల్లో. అడ్డూఅదుపూ లెకుండా సంతానన్ని కంటూ పోతే, వాళ్లందరికీ తిండిగుడ్డ దేవుడూ పెట్టడు, చౌదరిగారూ పెట్టరు. ఆవిషయం ఎవరికివారు తెలుసుకొని జాగ్రత్తగా మసలుకోవాలి. దేవుడికి తెలుసు లాంటి బాధ్యతా రహితమైన stetements ఆచరనలో కొంపముంచుతాయి. బ్లాగు వ్యాఖ్యలుగా బాధ్యరాహిత్యాన్ని బయటపెడతాయి. మతాన్ని సీరియస్‌గ ఫాలో అయితే ఎలా తయారవుతారు అని చెప్పడానికి చౌదరిగారి వ్యాఖ్య ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన ఖురనుకాక ఇంకేమైనా చదివి ఉన్నారా (దిగ్రీలు గటృఆ) తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతోంది. ఒకవేళ చదువుచదివీకూడా ఆయన ఖురాన్నో, వేదాలనో ఆధారంగా చేసుకొని లౌకిక నిర్ణయాలు తీసుకుంటుంటే ఆవిషయంకూడ declare చేస్తే. అప్పుడు ఆయన విశ్వసనీయతగురించి ఇతరులు ఒక అభిప్రాయానికి రావడానికి వీలవుతుంది.

  ReplyDelete
  Replies
  1. కుటుంబ నియంత్రణ వచ్చిన తరువాతే లింగ నిర్ధారణ సమస్య పెరిగిపోయింది. ఇకపోతే మీరు ఈ థార్మిక శాస్త్రాల పట్ల ఈనాటి మత చాంధసవాదులను చూసి దాని ప్రకారం అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు. ఎందుకంటే మీరనుకుంటున్న మతానికి ఈ శాస్త్రాలకు ఏవిధమైన సంబంధం లేదని గమనించగలరు. మీరు నన్ను వ్యక్తిగతంగా కలిస్తే నా డిగ్రీలు తెలుస్తాయి. (అత్యధికులు డిగ్రీలు సాధించినవారే ఈరోజు మతమౌఢ్యంలో ఉన్న విషయం మీరు గమనించగోరుతాను.) నేను గొప్ప చెప్తున్నానని మీరు నాగురించి అనుకోవద్దు.వేదాన్ని, ఖురాన్ని మూల బాషలోనే అధ్యయనం చేసినవాడిని. అయినంత మాత్రాన శాస్త్రాలు చెప్పేదే యధార్ధం అవుతుంది తప్ప నేను చెప్పేది కేవలం అభిప్రాయం మాత్రమే అవుతుంది. ఏదిఏమైనా మీరు నన్ను చాలా ఘాటుగానే విమర్శించారు.

   Delete
  2. కుటుంబ నియంత్రణ వచ్చిన తరువాతే లింగ నిర్ధారణ సమస్య పెరిగిపోయింది.

   chronologically correct but suffers from false correlation. మీరన్నది కాలమానం ప్రకారం సరైనదే. కానీ ప్రజలు మగశిశువుల్ని prefer చేసి ఆడశిశువుల్ని చంపెయ్యడానికి కారణం మతాలపేరుతో మనదేశంలో ప్రచారంలో ఉన్న ఆచారాలు కారణం. కుటుంబ నియంత్రణ కాదు.

   "ఇకపోతే మీరు ఈ థార్మిక శాస్త్రాల పట్ల ఈనాటి మత చాంధసవాదులను చూసి దాని ప్రకారం అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు."

   పైన మీరు వెలువరించిన అభిప్రాయాలు ఛందసవాదుల అభిప్రాయాలకన్నా వేరుగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. ముఖ్యంగా "పుట్టించిన దేవుడికి అంతా తెల్సు. వేద గ్రంధాల ప్రకారం భువి పైకి వస్తున్న జనాభాను అడ్డుకుంటే చాలా అనర్ధాలు చవి చూడవల్సివస్తుంది." విషయంలో. చదువుకున్నవారుకూడా మూడత్వానికి అతీతంగా వ్యవహరించడంలేదని అన్నారుకాబట్టి ఇహ మీ విద్యార్హతల గురించి నేను పెద్దగా పట్టించుకోవడంలేదు.

   "కుటుంబ నియంత్రణ దేని కోసమో ఇప్పటికీ నాకు అర్ధం కాదు" అన్నమీ వ్యాఖ్య మీరు ఆలోచించడంలేదని నాకు తెలియజేసింది. ఒకజంటా A పదిమంది పిల్లలను కన్నది. మరొకజంట B నలుగురు పిల్లలను కన్నది. ఇప్పుడు ఈ రెండు జంటల్లో ఏ జంటయొక్క పిల్లలకు తమ తల్లిదండ్రులనుండి సాపేక్షికంగా ఎక్కువ care అందుతుంది? చిన్నకుటుంబాలు ఒక norm ఐ కూర్చున్న ప్రస్తుత సమాజంలో ఏ కుటుంబం తన సంతానానికి తగిన పోషక విలువలనూ, విద్యా బుధ్ధులనూ అందించగలదు? ఇలాంటి వాటికి జోలికిపోకుండా, ఒక లౌకిక విషయాన్ని వేదాలూ, దేవుడూ అంటూ ఏదేదో వ్యాఖ్యానించిన మిమ్మల్ని ఇంకెవరైనా ఏమని విమర్శించాలి?

   నేను ఘాటుగా విమర్శించడం కావాలని చేసినపనే! ఇప్పటిదాకా నిరక్షర ముస్లిములకూ, అతివాద క్రైస్తవులకూ (అంతటి అతివాదం అమెరికాలో తప్ప నేను ఇంకెక్కడా చూడలేదు) మాత్రమే పరిమితమైన ఒక జాడ్యాన్ని హిందువులు (వీళ్లలో ఎక్కువమంది కొంచెం realisticగా ఆలోచించగలిగినవాళ్ళు) కూడా పాటించాలని మీరు అభిప్రాయపడ్డారు. దానికి వత్తాసుగా మీరు వేదాలను అరువు తెచ్చుకున్నారు. ఇక మిమ్మల్ని విమర్శించకుండా ఎలా ఉండగలను? వేదాలు వ్రాయబడినకాలానికి, ప్రస్తుత కాలానికీ చాలా తేడాలు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా వేదాల్లో ఉన్నది పాటించవలసిందే అంటే దాన్ని ఏవిధంగా ఎవరైనా సమర్ధించగలరు? అట్టి పిలుపును మౌఢ్యం అనిగాక ఇంకెవరైనా ఏమనగలరు? ఇద్దరిని పెంచడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణను గాలికొదలండి అనడం ఏవిధంగా ఒక బాధ్యతా యుతమైన పిలుపు అవుతుంది? దాన్ని సమర్ధించిన మీ వ్యాఖ్య బాధ్యతారహితమైనదిగాక ఇంకేమవుతుంది?

   Delete
 3. @K.S.Chowdary,
  Iconoclast వ్యాఖ్యతో పూర్తిగా అంగీకరిస్తున్నా.
  అంతటి అతివాద క్రైస్తవ అమెరికా జనాభా గత 50 సంవత్సరాల పెరుగుదల , మన జనాభా పెరుగుదల చూడండి. ఇంకో 20 సంవత్సరాలలో మన జనాభా, అందులో చదువుకున్న గ్రాడ్యుయేట్లు విపరీతంగా పెరిగిపోతారన్నది నిజం, అంతమందికి ఉపాధి యెలా దొరుకుతుందో తల్చుకుంటేనే భయమెస్తొంది, మీరేమో యింకా ఎక్కువ సంతానం కనమని....
  నేను హిందువునే అనుకుందాం, ఎప్పటివో వేదాల్ని, అందులోని సారంశాలని తూచా తప్పకుండా ఎందుకు పాటించాలి? అప్పటి జనాభా ఎంత, ప్రజల అవసరాలెలాంటివి?
  అసలెంతమంది పిల్లలుంటే తల్లిదండ్రులకు ఆనందం? అంతమంది పిల్లలెందుకుండాలి?

  ReplyDelete
 4. "కుటుంబ నియంత్రణ వచ్చిన తరువాతే లింగ నిర్ధారణ సమస్య పెరిగిపోయింది."

  కేవలం మీ వాదన అర్ధరహితం అని చెప్పడానికి నేనింకో వాదన చేస్తున్నాను. నావ్యాఖ్యలో చెప్పినట్లుగా నా వాదనక్లూడా the fallacy of false correlation.

  స్వాతంత్ర్యం వచ్చాకనే రైలు/రోడ్డు ప్రమాదాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి స్వాతంత్ర్యమే రోడ్డుప్రమాదాలకు కారణం.

  ReplyDelete
 5. తండులాలు వుంటే యెంతమందినైనా కనవచ్చు.నందమూరి తారక రామారావు అంతమందిని కన్నా అందరికీ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తినీ తరతరాలు మేం ఆయన కొడుకులం మనవళ్లం అని చెప్పుకు బతికే కీర్తినీ ఇచ్చాడు!అందరికీ అంత అదృష్టం లేదు గదా?కుటుంబ నియంత్రణ పేరుతో యే యెర్రత్రికోణం ప్రచారామూ లేకుండానే ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు ఇవాల్టి వాళ్ళు,యెందుకని?కనడంతో సరిపోదు, పెంచాలి గదా - పాల దబ్బాల నుంచి పీజీ చదువుల వరఊ అన్నిత్నీ చుక్కల్లో నిలబెట్టి కనండి కనండంటే యెట్లా?!

  ReplyDelete
 6. పిల్లలి కనడటం ఒక్కటే కాదు కదా, వారిని సమాజంలో ఉన్నత పురులుగా తీర్చి దిద్దటం కూడా కన్నా వారి భాద్యత కానీ కని వారిని పెంచటం చేత కాకా ఎంతో మంది బాల కార్మికులగా, దొంగలుగా విధి రౌదిలుగా తాయారు కావడానికి అధిక జనాభానే కారణం ప్రబుత్వం పునుకోని మధ్యహానం భోజనం పెట్టకుంటే పిల్లలి బడి కూడా పంపించలేని దుర్వాస్తలో ఉన్నాము మనం. దేశం మరుయు ప్రజల ప్రయోజనాల కన్నా శస్త్రాలు మతం గొప్పయి కావు, ప్రజలని మంచి మార్గం లో ఉంచడానికి మతం ఉమయోగపడాలి.

  ReplyDelete
  Replies
  1. Exactly my friend!

   'దేశ ప్రయోజనాలు'లాంటి పెద్ద మాటలు నాకర్ధంకావు. ఒక సామాన్యుడు ఒక offspringని పెంచడానికీ, నలుఇగుర్ని పెంచడానికి మధ్య తేడా తల్చుకుంటే, నలుగుర్ని కనాలన్న బడుధ్ధాయి(నలుగురేసి కంటున్న బడుధ్ధాయిల) మీద కోపము/జాలి తప్ప నాలో ఇంకెమీ కలగడంలేదు.

   Delete
 7. కుటుంబ నియంత్రణ అనేది లింగ నిర్దారణకే గాని దేనికి ఉపయోగపడదు. అది అనేకమైన ఆడశిశువుల హత్య కారణమవుతుంది. ఇకపోతే పోషించే స్తోమత లేనప్పుడు, ఒకవేళ ఉన్నా వారిని సరిగా తీర్చిదిద్దే సామర్ధ్యం లేనప్పుడు కనకపోవడం ఉత్తమమేనన్న వాదనతో ఏకీభవిస్తాను.ధర్మం విషయానికొస్తే పై అర్హతలు ఏవీ లేనప్పుడు కని పాడేయండి ఎప్పుడూ చెప్పలేదు.పిల్లల పెళ్ళి వరకూ తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాల్సిందే.అయితే జనాభ పెరగడం వలన తిండి సదుపాయాలు తరిగిపోతాయి అనే వాదనతో నేను ఏకీభవించను. ఆహార కొరతకు ప్రధాన కారణం పేదవాడిని మాడ్చి, ఉన్నవాడు దోచుకు తినడమే.

  ReplyDelete
 8. మీరు అర్జంటుగా నేలకు దిగిరావాలి.

  జనాభా పెరిగినంతమాత్రాన, ఆహారనిల్వలు తగ్గవు. నిజమే. కానీ ఆ నిల్వల్లో వాటా కుటుంబానికి ఎలా అందుతుంది అన్నది ప్రశ్న. ఇంతలావున చెబుతున్నారే. మీకు ఎంతమంది పిల్లలుసార్? పదహారు?

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్