Breaking News

కరెన్షీ నోట్ మీద నుండి జాతిపిత గాంధీ గారి బొమ్మ తొలగించాలన్న వాదన సమంజసమా?


11 comments:

 1. ఒకటే బొమ్మ ఉంటే దొంగనోట్లు పుడతాయి
  ఒకరే వ్యక్తీ ఉంటె వక్రీకరణలు తారాస్థాయికి చేరతాయి కాబట్టి మార్చాలి!

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది బాగానే ఉంది ప్రసాద్ గారు.కాని మన పైడి నాయుడిగారి అనుమానం నిజమయ్యేలా ఉంది. గాంధిగారి బొమ్మ తీసిన మరుక్షణం ప్రతి అడ్డమయిన అవినీతి నాయుకుడు కరెన్షీ మీద తిష్ఠ వేసే పరిస్థితి లేకపోలేదు. మిగతా మహానుభావులకు ఆ గౌరవం దక్కుతుందన్న నమ్మకాలు ఉండవు.

   Delete
  2. అంటే ప్రజలు దొంగ నోట్లతో బాధ పాడడం మంచిదా?
   మీకు గుర్తుందా ఈ వంద నోట్ల మీద నాలుగు సింహాల గుర్తు ఉండేది, పోనీ అవే ప్రచురించినా పర్వాలేదు! మార్పులు లేని ప్రచురణలు జరగడం ప్రజలను problems పెరుగుతాయి!

   Delete
  3. మీ ఉద్దేశ్యం నాకర్ధమయ్యింది. ఇప్పుడున్న నోటును మార్పులు చేస్తే ఇప్పటికే ఉన్న దొంగ నోట్లు, నల్ల ధనం ఇవేవీ పనికిరాకుండా పోతాయి. దొంగగాళ్లందరూ భారీగా నష్టపోతారు. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే కష్టమే!

   Delete
 2. అవసరమా?
  ? దేశంలో చాలా problems ఉన్నాయి. వాటి పై పోరాడాలి. ఇప్పుడు మార్చితే రకరకాల రాజకీయ నేతలను కరెన్సీ నోట్లపై చూడవలసి వస్తుంది.
  గాంధీజీ తో సరిపెట్టుకుందాం.

  ReplyDelete
  Replies
  1. మీరు నకిలీ ధనం నుంచీ జనాలని కాపాడాలి చెప్పండి!

   Delete
 3. గాంధీని నోట్లపైనుండి తొలగించడానికీ fake currencyకి సంబంధం ఏమిటి? ఒకవేళ ప్రభుత్వం గాంధీనికాక ఇతర నాయకులనూ నోట్లపై ముద్రించడం మొదలుపెట్టిందనే అనుకుందాం, అంతమాత్రాన చలామణిలో ఉన్న గాంధీనోట్లను వెనక్కి తీసుకోవడం చాలా ఖర్చైనపని కదా. ఒకవేళ వ్యయానికోర్చి వెనక్కితీసుకున్నా, అప్పుడుకూడా templatesమార్చి వేర్వేరు నాయకుల బొమ్మలున్న దొంగనోట్లను ప్రచురించడం దొంగలకు పెద్దకష్టమని (అసాధ్యమైతే ఎంతమాత్రమూ కాదు) నాకు అనిపించడంలేదు. ఎందుకంటే మారుతుంది template మాత్రమే, technologyకాదు. For that matter, even technology changes can be accomodated. అప్పుడు కూడా దొంగలు నోట్లపైని నాయకులను పంచుకొని, ఆయా పంపకాలప్రకారం ఒక గ్యాంగు ఛత్రపతినోట్లనూ, ఇంకొక గ్యాంగు పటేల్ నోత్లనూ ముద్రించి చలామణిలోపెడితే ఏంచెయ్యగదు RBI?

  అసలు ఇదంతా దొంగనోట్లను అరికట్టడానికి అని మీరెందుకు అనుకుంటున్నారు? ఇలా దిమాండు చేస్తున్నవారేమైనా దొంగనోట్లను అరికట్టడానికి ఇదంతా చెయ్యాలి అని అన్నారా?

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు మార్కెట్లో ఉన్న దొంగనోట్లను పూర్తిగా నిర్మూలించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుచేత పాత నోట్లను అతివేగంగా రద్దు పరచి కొత్తనోట్లను మరింత టెక్నికల్ గా తీసుకు వచ్చి, ఇక దొంగనోట్లు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగలిగితే పాత దొంగనోట్ల సమస్యతో పాటు బ్లాక్ మనీ పీడ కూడా వదిలిపోతుందని నా అభిప్రాయం.

   Delete
 4. "ఇక దొంగనోట్లు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగలిగితే"

  మీరన్నవాటితో ఏకీభవిస్తాను. కానీ ఇకపై దొంగనోట్లు రాకుండా చెయ్యడం సాధ్యమని మాత్రం నాకు అనిపించడంలేదు. ఎందుకంటే దానికి ప్రజల సహకారంకూడా అవసరం. ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను.

  మీకు ఎవరో ఒక 500 రూపాయల దొంగనోటును అంటగట్టారనుకుందాం, అప్పుడు మీరు ఏంచేస్తారు? (మీరు అంటే మీరు అనికాదు. సాధారణంగా ఏం జరుగుతుంది అని చెబుతున్నాను)
  a) ఒక బాధ్యత గలిగిన పౌరుడిలా వ్యవహరించి ఆ దొంగనోటును చించేస్తారు.
  b) ఎలాగోలా దాన్ని చెల్లుబాటు చేయించి వదిలించుకోవాలని చూస్తారు.

  ReplyDelete
  Replies
  1. ప్రజల సహకారం ఉండాలన్న మాట 100% వాస్తవమే నేను అంగీకరిస్తాను. ఇక గతంలో 2సార్లు 500రూ// దొంగనోట్లు వస్తే (అదీ ATM లో) బ్యాంక్ మేనేజర్ని అడిగితే మాకు సంబంధం లేదన్నాడు.రెండవసారి వచ్చినప్పుడు నేనే చించివేసాను. ఎవరికో అంటగట్టాలని గాని,వదిలించుకోవాలని గాని చూడలేదు. ఆ విధంగా మీరు, ఇతరులందరూ చేసినప్పుడు కొంతవరకూ ప్రయోజనం ఉంటుంది మనకి కొద్ది నష్టపోయినప్పటికీ! అయితే ఇది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు.

   Delete
 5. రాసుకోండి శాశనంగా రాళ్లమీద : దొంగనోట్లను అరికట్టడం ఒక జాతిగా ఎంతమాత్రమూ భారతీయులకు సాధ్యం కాదు.

  నోట్లమీద కొత్తగా ఎవరిని ముద్రించినా I don't think that makes even a triffle of difference to the common man.

  ReplyDelete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్