Breaking News

దేవుడున్నాడు అనడానికి, లేడనడానికి ప్రామాణిక కొలమానాలేమిటి?

పై ప్రశ్న పంపినవారు: సతీష్ (కోదాడ)

69 comments:

 1. దేవుడున్నాడు అనడానికి ఈ సృష్టే ఒక పెద్ద కొలమానం.లేడు అనడానికి ఏ విధమైన కొలమానం లేదు.

  ReplyDelete
 2. రెండింటికి నమ్మకమె కొలమానం. ఉన్నాడు అంటే ఉన్నాడు లేడు అంటే లేడు. తన నమ్మకమె కారణాలు వెతుకుతుంది.

  ReplyDelete
 3. అహ్మద్ చౌదరి గారు: విశ్వానికో సృష్టికర్త ఉన్నాడనడానికి మీవద్ద ఉన్న ఆధారమేమిటో తెలుసుకోవచ్చా? విశ్వం స్వయంభువు. దాన్నింకొకడు సృష్టించాల్సిన అవసరంలేదు.

  దేవుడు అనేది ఒక gap theory. మనిషి తను explain చెయ్యలేని దానికి దేవుడు కారణమనుకుంటాడు. కాబట్టే ఒకప్పుడు సాధారణ జ్వరాలకే దేవుణ్ణాశ్రయించిన మానవులు నేడు ఆపని మానుకున్నారు. ఎప్పుడైతే మనుషులు ప్రతి రోగానికీ మందుని కనుక్కుంటారో, అప్పుడు దేవుడు వైద్యరంగం నుంచి గెంటివేయవడతాడు. దేవుడు ఒక బొద్దింకలాగా మనిషి మనిషి జ్ఞాన శకలాలమధ్య బ్రతుకీదుస్తుంటాదు. science అభివృధ్ధిచెంది ఆ జ్ఞానశకలాల మధ్య ఖాళీలను జ్ఞానంతో నింపడం మొదలుపెట్టగానే దేవుడు అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంటాడు.

  స్రష్ట మానవ సృష్టి. అంతకుమించి మానవుని అపోహ, అజ్ఞానం.

  ReplyDelete
 4. జ్ఞానం మరియు నమ్మకం అనేవే దేవుడు. దేవుడి గురించి చక్కగా వివరించి, దేవుడు లేడంటారే? మీరు చెప్పిన ఏదైతే "గేప్" ఉన్నదో అదే అజ్ఞానం. దానిని జ్ఞానంతో నింపగానే అది దైవత్వం అవుతుంది. అప్పుడు దేవుడిని వేరుగా చూడవలసిన పనిలేదు.రెండవది నమ్మకం. రోగాలు వచ్చినప్పుడు కావాలిసిన మందుతోబాటు నమ్మకంకూడా రోగికి కావాలి. అదే రోగాన్ని తగ్గిస్తుంది. ఆ నమ్మకమే దైవత్వం.

  ReplyDelete
 5. ముందుమాట: ఈ వ్యాఖ్య రచ్చబండ చర్చావేదిక నిర్వాహకులను ఉద్దేశించి చేసిన ఒక విజ్ఞప్తి. అంతే కాని ఈ చర్చలో నేను పాలుపంచుకోవటం కోసం కాదు.

  ఒక్క విషయం గమనార్హం. ఏ చర్చ ఐనా, కామెంట్లపంట పండించాలంటే వివాదాస్పద విషయాలమీద చర్చావిషయం ఉండాలన్న అభిప్రాయం కాని మీకు ఉన్నట్లైతే నా అభిప్రాయానికి ఇక్కడ విలువలేదు.

  తమతమ వ్యాఖ్యలను తగినసంయమనంతో చేయవలసిందిగా మీరు మీ వ్యాఖ్యాతలకు విజ్ఞప్తి చేయగలరా?

  ఒక వ్యాఖ్యాత " దేవుడు ఒక బొద్దింకలాగా మనిషి మనిషి జ్ఞాన శకలాలమధ్య బ్రతుకీదుస్తుంటాదు" అనటం‌ తీవ్రంగా బాధించింది. విశ్వం స్వయంభువు అన్న మాట చెప్పిన వారికి విశ్వం అనేది కూడా భగవంతుని అనంతకోటినామధేయాలలో ఒకటి అన్న స్పృహ లేకపోవటం గమనార్హం.

  ఇలాంటి దూషణలు కొందరికి ఆనందమూ కొందరికి వినోదమూ‌ కలిగిస్తాయని మీరు భావిస్తున్నారేమో తెలియదు. కొందరికి మనస్సులకు నొప్పి కలిగిస్తాయని కూడా దయచేసి తెలుసుకోండి. మీకు ఏది ఉచితం అనిపిస్తే అలాగే చేయండి. నా మాటలకు విలువను ఇవ్వటం మానటం మీ యిష్టం.

  ReplyDelete
 6. అహ్మద్ చౌదరి గారూ ! శ్యామలీయం గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను . బిన్నత్వంలో ఏకత్వం కలిగిఉన్న మన భారతదేశం అనేక విశ్వాసాల, సంస్కృతుల సమ్మేళనం . అందుకే ఏ మతమైనా మనదేశంలో నిలిచినట్లుగా ఇతర దేశాల్లో నిలవదు. దయచేసి మతపరమైన, సాంస్కృతిక పరమైన విశ్వాసాలపై వివాదాస్పద ప్రశ్నలు అడుగవద్దు . ఇది మీ బ్లాగుకు కామెంట్లనూ, దూషణలనూ తీసుకు వస్తుందేమో గానీ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరదు ..

  ReplyDelete
 7. ఇంకో విషయం ... మీ బ్లాగులోని కామెంట్ లకు మోడరేషన్ పెట్టలేదు .. ఇది మరింత ప్రమాదకరం ( ఇటువంటి చర్చా బ్లాగులకు )

  ReplyDelete
 8. శ్యామలీయంగారు...త్రిశూల్ గారి కామెంట్ నాకు కూడా చాలా ఇబ్బంది కలిగించింది. దైవాన్ని బొద్దింకతో పోల్చడం బాధాకరంగా అనిపించింది. దైవం పట్ల, భక్తి పట్ల ఒక నిర్ణయం కోసమే పై ప్రశ్న తప్ప.విమర్శలకు దారి తీయడం కోసం కాదని మనవి. ఇక త్రిశూల్ గారి నాస్తిక వాదానికి ఆయనగారు పెట్టుకున్న పేరుకు ఏవిధమైన సంబంధం లేదు.విచిత్రంగా ఉంది.

  ReplyDelete
 9. దేవుడు ఉన్నాడు అనేది ఓ విశ్వాసం. లేడనేది ఆ విశ్వాసానికి ఆధారాలు చూపమనే ప్రశ్న. నాకు తెలిసి దేవుడున్నాడా? లేడా? అనే వాదులాట అనవసరం. దేవుడిని నమ్మేవాడైనా, నమ్మనివాడైనా కర్మలను చేయకుండా ఫలితం రాదు. కర్మలను చేయడమే మనిషి పని. దేవుడి గురించి ప్రామాణిక కొలమానాలు అనే కర్మ (యోచన) వల్ల దేవుని గురించిన ఫలితం ఎన్నటికీ రాదు.

  ReplyDelete
 10. దేవుడు అన్న భావనని బొద్దింకలాంటిది అనిచెప్పడం సరైనదే అయినా ( నేను పోలికతోకూడా చెప్పాను), అలా అనడం మిమ్మల్ని బాధించిందిఉకాబట్టి నేనలా అనకూడదంటారు! బాగుంది. నిజానికన్నా, తర్కంకన్నా మనోభావలకే విలువనిస్తున్నారుకాబట్టి నేను మిమ్మల్ని మనోభావాలాళ్ళు అంటాను. మీరు మీకు నచ్చిన అశాస్త్రీయమైన విషయాలచుట్టూ నిక్షేపంగా మనోభావాల దడికట్టుకోవచ్చు. అశాశ్త్రీయమైన విషయాలు ఇప్పుడుకాకుంటే రేపు నాశనమైపోతాయి (trend గమనించి నేను ఈ అభిప్రాయానికి వచ్చాను).

  శ్యామలీయంగారు : కుక్కని రాజహంస అనిపిలిచినంతమాత్రాన, ఆపేరు పెట్టినంతమాత్రాన అది ఎలాగైతే గాలిలో ఎగురలేదొ, దేవుణ్ణికూడా విశ్యం అని పిలుచుకున్నంత మాత్రాన దేవుడు నిజమైపోడు. ప్రతిజీవిలోనూ దేవుణ్ణి చూడవచ్చు అని చెప్పినమతంలో పుట్టినమీరు, బొద్దింకను అంత తగనిదిగానూ, నీచమైనదిగానూ భావించడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది!

  ReplyDelete
  Replies
  1. బొద్దింక నీచమైనది కాదు, (దేవుడి సంగతి తరువాత ఆలోచిద్దాంకాని,) కొందరు మనుషులకన్నా అన్నది మీరు ఋజువు చేసారుగా చాలును.
   బ్లాగుఓనరుగారికి నా విజ్ఞప్తి. దుర్వాఖ్యలు వ్రాయటమే కాక సమర్థించుకుంటున్న ఈ త్రిశూల్ గారి మాటలు మీకు సమ్మతం కాబట్టి అచ్చొత్తారా అని నేను ప్రశ్నించటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు కనిపించే వాతావరణం ఉండే చోటుకు రాకుండా నా జాగ్రత్త నేను తీసుకుంటాను. you go to your church and I go to mine అని ఒక సామెత ఉంది అలా నా దారి నేను చూచుకుంటాను లెండి. వాక్స్వాతంత్ర్యం అంటే ఇలా కూడా ఉంటుందని అనుకునే చోట్తికి దూరంగా ఉండటమే మంచిది.

   Delete
  2. త్రిశూల్ గారు ఏ విషయమైనా శాస్త్రబద్ధంగా ఆలోచించవల్సిందే! 100% ఏకీభవిస్తున్నాను.అశాస్త్రీయం నిర్వియోగమైనదే! అయితే మీరు ఏ శాస్త్రీయతను (లేక శాస్త్రాన్ని) బట్టుకుని పై విషయాన్ని కాదంటున్నారు?

   Delete
  3. శ్యామలీయం గారు మీలాంటి పెద్దలు ఈ రచ్చబండకు దూరంగా ఉంటాననే మాట మేము జీర్ణించుకోలేనిది. ఇక చర్చలు పాజిటివ్ గానే, వ్యక్తిగత దూషణలు లేకుండా చూద్దాం సర్! దయచేసి రచ్చబండకు దూరం ఉండవద్దని మనవి. ఈ చర్చలనేవి అందరికీ ఉపయోగకరం కావాలనేదే నా అభిలాష.

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. త్రిశూల్ గారు శ్యామలీయంగారి పట్ల మీరు చేసిన పై కామెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అందులో కేవలం దురుష పదజాలం ప్రయోగించడమే కాకుండా పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయాన్ని కూడా మర్చినట్టున్నారు. దానికారణంగా మీ కామెంట్ తొలగించాను.క్షమించాలి.

   Delete
  6. చౌదరి గారు : మీకామెంట్లను నేను చూడడం/పట్టించుకోవడం కొంచెం లేటవుతోంది. నా వ్యాఖ్య ఉపహరించబడనందుకు నాకు అభ్యంతరం లేదు. ఏమయినా నీతులు చెప్పేహక్కూ, ఇతరుల్లో తప్పులుబట్టేహక్కూ, ఇతరుల్ని వ్యక్తిగతంగా దూషించే హక్కూ, ఇతరులను సరిదిద్దే హక్కూ బాధ్యతా కూడా మతాలావలంబకులైన మర్యాదా పురుషులకే దఖలుపడ్డాయితప్ప ఇతరులు కాదన్న బ్లాగులోకపు మర్యాదలు నేనెరగనివాడిని కాను (in case you don't understand, this is sarcasm).

   అసలు ఈ చర్చా బ్లాగుకూడా కొండలరావుగారిదే ననుకున్నాను. ఇది మీదన్నమాట! మీరు చాలా openగా ఉన్నారు. (ఇది నేను మన:స్ఫూర్తిగా చెబుతున్నాను)

   Delete
 11. శ్యామలీయం గారు,

  ఇలాంటి ప్రతి చర్చలోకి కొద్దిగా తొంగిచూడడం, ఎక్కువగా చిన్నబుచ్చుకోవడం, గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేయడం ఆనక బ్లాగు నిర్వాహకులకు ఇలాంటి చర్చలు అనుమతించడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోండి అని ఒక ఉచిత సలహా పడెయ్యడం, చివరగా మళ్లీ ఇలాంటి చర్చల్లోకి వస్తే ఒట్టు అని పలాయనం చిత్తగించడం…. ఏమిటండి ఈ చిన్నపిల్లవాడి ప్రవర్తన?

  ఏ ఆరోగ్యకర చర్చలోనైనా ఎదుటివారి ఆలోచనలు, అభిప్రాయాలు, భావనలు, సిధ్ధాంతాల (ideas, opinions, concepts and theories) పై తర్కబద్ధము, కారణబద్ధము, హేతుబద్ధమైన విమర్శ ఆహ్వానించదగ్గదే (fair game within the boundaries of logic, reason and rationality). అలా కాకుండా వ్యక్తిగతమైన, వ్యక్తిపరమైన నిందారోపణలు ఉంటే తప్పకుండా ఆక్షేపణీయం.

  ఒక public forum లో చర్చలు మీ వ్యక్తిగత నమ్మకం విశ్వాసాల పరిధిలోనే జరగాలని పట్టుబట్టడం ఎంతవరకు సమర్థనీయం? ఆవలి వారి అభిప్రాయలు తప్పనిపిస్తే, ఎందుకు తప్పో ఎలా తప్పో చెప్పండి, లేదా ఆ అంశంపై మీ దృక్కోణం వేరుగా ఉంటే అందరితో పంచుకోండి. సుహృద్ధ్భావ వాతావరణంలో చర్చ సాగడానికి మీ చేతనైన సాయం చేయండి. కాదంటే చర్చకి దూరంగా ఉండండి. అంతే గాని, ప్రతి సారి ఈ emotional blackmailing కొంచం ఇబ్బందిగా ఉంది మాస్టారూ.

  గమనిక: ఈ బ్లాగు నిర్వహించడం వెనుక ఉన్న ముఖ్యోద్దేశ్యం (నిర్వాహకుడి మాటల్లో)
  ఈబ్లాగు ద్వారా అనేక అంశాలపై చర్చలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రచ్చబండ ను స్థాపించాను.ఏదైనా అంశం పట్ల నల్గురూ కల్సి చర్చించగలిగినప్పుడే దాని యొక్క లోతుపాతులు తెలుస్తాయి. దాని యొక్క అసలు ప్రయోజనం మనిషికి అర్ధమవుతుంది. దాని అసలు ఉద్దేశ్యం నిరూపితమవుతుంది. దాని కారణంగానే ఈ రచ్చబండ బ్లాగు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేను నిర్వహించాలనుకుంటున్నాను.

  ReplyDelete
 12. I agree with @Edge.
  అవతలివాళ్ళు వ్యక్తిగతంగా ప్రస్తావించనంతవరకు ఎటువంటి అభిప్రాయమైనా చెప్పే స్వేచ్ఛ లేనప్పుడు చర్చలెందుకు? @త్రిశూల్ చెప్పింది కేవలం ఆయన అభిప్రాయం అని నాకర్ధమయ్యింది, ఆయన అభిప్రాయలతో నాకేమి యిబ్బంది లేదు, ఆ అభిప్రాయాల వల్ల నా విశ్వాసాలకొచ్చిన భయమేమి లేదు.
  ఒకవేళ బ్లాగు నిర్వాహకుడికి ఏమన్న యిబ్బంది వున్నా, అతని వ్యాఖ్యలు ప్రచురించడం ఇష్టం లేక పోయినా ఆ విషయమే పబ్లిక్ గా చెప్పొచ్చు, అది వారిధ్ధరి మధ్య విషయం.

  ReplyDelete
 13. వ్యక్తిగతమైన దూషణలు లేని ఏ అభిప్రాయమునకైనా రచ్చబండ అనుమతి కల్గిస్తుంది. ఇక వారి,వారి అభిప్రాయాలు సశాస్త్రీయమైనవా? అశ్శాస్త్రీయమైనవా అనేది విజ్ఞులు అర్ధం చేసుకుంటూనే ఉంటారు.ఏ విషయమైనా తమదైన కోణాలను విశిదీకరించినప్పుడే అసలు వాస్తవ కోణం బయటపడుతుంది.అది స్వీకరించడం స్వీకరించకపోవడమనేది వారి,వారి ఇష్టాయిష్టాలకు వదిలివేయవల్సిందే!

  ReplyDelete
 14. దేవుడున్నాడు అనడానికి ఈ సృష్టే పెద్ద కొలమానం.ఆయన లేకుండా ఈ సృష్టంతా ఇంత క్రమంగా ఎలా నడుస్తోంది?"ఐన్ స్టీన్" లాంటి మహా శాస్త్రవేత్తే ఒక శక్తి ఈ సృష్టిని నడుపుతోంది అన్నాడు.ఆ శక్తినే దేవుడని,సర్వేశ్వరుడని,అల్లాహ్ అని యెహోవా అని ప్రజలు తమతమ భాషల్లో పిలుచుకుంటారు.ఈ విషయాలు ధృవీకరించడం కోసం ఎన్నో ఆధ్యాత్మిక శాస్త్రాలున్నాయి.

  ReplyDelete
  Replies
  1. ఐన్‌స్టీన్ ఏ దేవుడిని ప్రతిపాదించాడు చౌదరిగారు?

   Delete
  2. చౌదరి గారు: Appeal to authority అనేది ఒక logical fallacy. అంటే ఏమిటంటే... ఆధారాలు చూపాల్సినచోట, తర్కాన్ని వాడాల్సినచోట లబ్దప్రతిష్టులైన వారి అభిప్రాయాలను (సుభాషితాలనూ, quotesనూ) వాడి వాదనను గెలవాలనుకోవడం. మతంలోలా ఎవరో వందేళ్ళక్రితం కొన్ని మంచివిషయాలతోపాటు కొన్ని అతి చెత్త విషయాలనుకూడా చెబితే వాటిని పట్టుకొని వేళ్ళాడడం సైన్సులోనూ, తర్కంలోనూ కుదరదు. There are no authorities in science but experts. తర్కంలోనూ, సైన్సులోనూ వాళ్లవాళ్ళ కీర్తిప్రతిష్టలతో పనిలేదు వారి నైపుణ్యంతోనే అని.

   అ) ఐన్స్టైన్ చెప్పినవన్నీ మనం ఈనాడు అంగీకరించడంలేదు. ఆయన సాపేక్ష సిధ్ధాంతం నిజమైనంతమాత్రాన, ఆయంచెప్పినవన్నీ అర్జంటుగా అంగీకరించి తీరాల్సిందే అన్న మీ అభిప్రాయం చెల్లదు. ఇప్పటికిప్పుడు ఐన్స్టీన్ బ్రతికొచ్చి 'సాపేక్షసిధ్ధాంతం తప్పు' అని చెప్పినా సైన్సు 'ఆధారాలు చూపించు' అంటుందే తప్ప, ఆయనేకదా దాన్ని ప్రతిపాదించింది అని గమ్మున ఒప్పేసుకోదు.

   ఆ) ఐన్స్టైన్ మితవాద నాస్తికుడు అని ఆయన జీవిత చరిత్ర చదివితే అర్ధం అయ్యింది. ఐన్స్టైన్ దేవుడు అన్నపదాన్ని వాడినది విశ్వాన్నినడిపిస్తున్న శక్తి అన్న అర్ధంలోకాదు. విశ్వంలో ఏ నియమాలు వర్తిస్తున్నాయో, ఆనియమాలన్నింటినీ కట్టగట్టి దాన్ని ఆయన దేవుడు అన్నాడు. పైన శ్యామలీయం ('గారు' తీసేశాను) అన్నట్లు విశ్వాన్నే ఒకరకంగా దేవుడని సంబోధించాడు. సరే ఐన్స్టీన్ దేవుణ్ణి నిజంగా నమ్మాడనుకున్నా, మీ appeal to authority వాదన ప్రకారం ఆయన యెహోవాను నమ్ముంటాడే తప్ప ఇంకొకరిని కాదు. ఆయన చెప్పని దేవుణ్ణి మీరెందుకు నమ్ముతున్నారో కొంచెం వివరించగలరా?

   Delete
  3. త్రిశూల్ గారు..మీరన్నట్టే మత గ్రంధాలు వద్దు,సరే సైన్స్, సైన్స్ ...అసలు సైన్స్ అంటే ఏమిటో? సైన్స్ ఆధారం ఏమిటో చెప్పండి సర్?
   ఐన్ స్టీన్ ఒక శక్తి అన్నాడే గాని యెహోవా అని గాని లేక ఇతర పేర్లు ఆయన పెట్టలేదు. ప్రజలు ఆయా భాషలలో తమ దగ్గరున్న థార్మిక గ్రంధాలను బట్టి కొన్ని పేర్లతో పిలుస్తున్నారు.దేవుడు లేడు అని సైన్స్ ఏవిధంగా రుజువు చేసిందో అర్ధం కాదు.ఇక మరొక ముఖ్య విషయం ఎవరో కనిపెట్టిన విషయాలను సూత్రాలను బట్టుకుని సైన్స్,సైన్స్ ఘోషించే మనం ఆ దేవుని విషయంలో భోదించబడిన ఆయా థార్మిక గ్రంధాలను ఎందుకు పరిశీలించరు? వాటిలో సైన్స్ కి వ్యతిరేకమైన విషయాలు ఎక్కడున్నాయి? నిజానికి సైన్స్ అంటేనే శాస్త్రం...ఆ శాస్త్రాలు ఈథార్మిక గ్రంధాలే! ఏదైనా వాటిని పరిశీలించినప్పుడే కదా తెలిసేది?

   Delete
  4. >>> దేవుడున్నాడు అనడానికి ఈ సృష్టే పెద్ద కొలమానం. ఆయన లేకుండా ఈ సృష్టంతా ఇంత క్రమంగా ఎలా నడుస్తోంది?

   ఈ సృష్టంతా ఎలా నడుస్తోంది అన్న ప్రశ్నకు ఇంతవరకు పూర్తి శాస్త్రీయ సమాధానం దొరకలేదు. కొన్ని పరిశోధనలు జరుగుతున్నా... కొన్ని సిద్ధాంతాలు ఆవిష్కరించబడ్డా... అవింకా శైశవ దశలోనే వున్నాయి.

   మరి ఈ సృష్టికి మూలం దేవుడేనని ఎలా నిర్ధారణకు వచ్చారు?
   మీరు చెప్తున్న దేవుణ్ణి సరిగా వర్ణించిన ప్రామాణిక గ్రంధమేది? వేదాలా, గీతనా, ఖురానా, బైబిలా, ఇంకేదైనానా?
   ఒకవేళ అటువంటి ప్రామాణిక గ్రంథమేదైనా వుంటే అది కాక మిగతావన్నీ తప్పుడుగా, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఒప్పుకుంటారా?

   నా మూసిన గుప్పెట్లో రేగిపండు ఉందని నేను చెపితే అది వుందని ౠజువు చేయవలసిన బాధ్యత నాదే. అంతే తప్ప నేను గుప్పిట తెరవనంత వరకూ లేడని ఋజువు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే దేవుడు ఉన్నాడని చేప్పేవారే దాన్ని ఋజువు చేయవలసి వుంటుంది.

   Delete
  5. దయచేసి "నేను గుప్పిట తెరవనంత వరకూ లేడని ఋజువు చేయడం ఎవరికీ సాధ్యం కాదు." అన్న వాక్యాన్ని "నేను గుప్పిట తెరవనంత వరకూ అది గిప్పిట్లో లేదని ఋజువు చేయడం ఎవరికీ సాధ్యం కాదు." అని చదువుకోండి.

   Delete
  6. Bertrand Russel ఇలా అంటాడు. ఒకవేళ ఒక వ్యక్తి భూమిచుట్టూ ఒక టీపాయ్, దానిమీద నాలుగు కాఫీ కప్పులూ తిరుగుతున్నాయని చెబితే, దాన్ని తప్పని ఋజువు చెయ్యాల్సిన అవసరం ముందుగా మనకుండదు. దాన్ని నిజమని ఆధారాలతో నిజమని ఋజువుచెయ్యాల్సిన అవసరం అలా చెప్పిన వ్యక్తికే ఉంటుంది. దీన్ని ఇంగ్లీషులో ముద్దుగా the burden of proof lies with the who claimed such a miraculous existence అంటారు. ఆ టీపాయ్ కధని వందమంది నమ్మినా, వంద మిలియన్ల మందినమ్మినా ముందుగా ఋజువులు చూపాల్సిన అవసరం వారికే ఉంటుంది. ఇంకో ఉదాహరణైస్తాను. ఒకరు భూమికి ఇంకో చంద్రుడు ఉన్నాడు అని claim చేస్తే, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరికీ తమతమ పనులు మానుకొని, బోలెడు డబ్బు వెచ్చించి నన్ను తప్పు అని ఋజువు చెయ్యాల్సిన అవసరం ఉండదు. నేను కొంచెమన్నా valid ఆధారాలు చూపించగలిగితేనే వాళ్ళు స్పందిస్తారు తప్ప, ప్రతిఒక్కరినీ సీరియస్‌గా పట్టించుకుంటే ఇక వాళ్ళు పనిచేసినట్లే.

   సైన్సుకి మూలం experimental proof and repeatable results అవి(ప్రార్ధ్జించిన ప్రతిసారీ ప్రార్ధనను ఫలింపజేసే దేవుడు, నిజ్జంగా ఉనికిలో ఉన్నదేవుడు) మతంలో ఎక్కడైనా మీకు కనబడితే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా నామడం మొదలుపెడతాను.

   అన్నట్లు science ఏమీ ఖాళీగా కూర్చోలేదు. ఒక్కొక్క రంగాన్నీ దేవుడి, దేవుడి పూజారుల చేతుల్లోంచి లాగేసుకుంటోంది (ofcourse that is working to our benefit). చిన్న జ్వరాలకే దేవుడికి మొక్కుకోవడం తప్ప వేరే ఏమీ చేయలేను మనుషులు నేను ఆసుపత్రుల్లో వాటిని నేను 100% ఖచ్చితత్వంతో మాపుకోగలుగుతున్నారు. వైద్యరంగం మరించ వృధ్ధిచెంది క్యాన్సర్లాంటి వ్యాధులక్కూడా మందులు కనుగొన్నప్పుడు దేవుడికి వైద్యరంగంతో చెల్లిపోయినట్లే! సరిగ్గా ఈ అర్ధంలోనే నేను దేవుణ్ణి మానవుడి జ్ఞాన శకలాలమధ్య బ్రతుకీడ్చే ప్రాణి అన్నాను.

   Delete
  7. >శ్యామలీయం ('గారు' తీసేశాను) అన్నట్లు విశ్వాన్నే ఒకరకంగా దేవుడని సంబోధించాడు.


   ఒకరు గౌరవింపకుండిన లోపమే
   నన్ను మెచ్చువాడు నాకు గలడు
   మీర లెవని గూర్చి చేరి చర్చింతురో
   వాదులుడిగి యతని వలన నుంటి

   Delete
  8. ఎవనిని చర్చించుచు మీ
   రెవనికొఱకు నన్యజనుల నెన్ని తెగడిరో
   వివరించిచూడ నయ్యది
   యవకతవక యనినుడువడె అతడే వున్నన్?

   స్వోత్కర్ష మాని ఎదుటివారు చెప్పిన విషయాలపై ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందేమో శ్యామలీయం 'గారూ'!

   Delete
  9. క్షమించాలి! మీ ఇద్దరి భాష నాకు అర్ధం కాలేదు. శ్రీకాంత్ చారి గారి వ్యాఖ్య శ్యామలీయంకు రిటార్ట్ అనిమాత్రం అర్ధమయ్యింది.

   శ్యామలీయం! ఏదైనా ఉంటే 'విషయం'లో చూపించు పాండిత్యంలో కాదు. నేను నీకంటే గొప్పగొప్ప కవితల్ని నామాతృభాషలో రాయగలను. Please don't just make a fool of yourself by making such comments -which cannot be comprehended by MOST of the people from your very own land. It's not a show of your erudition buddy! If u have a thing to say, you better channel it through logic చెప్పాలనుకున్నది అవతలివాడికి అర్ధంకాకపోతే అది ఎంత అందంగా ఉన్నా అది అక్కరకురానిదే! don't use 'blinding with language' strategy with me for I'm not the one to fall for that.

   Delete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. అల్లాహ్ అనేది కేవలం ఒకభాషలో దేవుణ్ణి address చేసే పేరుమాత్రమే కాదు. ఇతర దేవుళ్ళ లక్షణాలతో విభేదించే లక్షణాలున్న ఒక కొత్త దేవుడు. అల్లాహ్, యెహోవా, జీసస్, బ్రహ్మ వీళ్ళు పూజలందుకొనే విధానంవేరు. వీళ్ళు మంచివిగానూ, చెడ్డవిగానూ భావించే విషయాలు వేరు, చెప్పిన నీతులు వేరు. పూజలందుకొనే విధానం వేరు. వారి వారి idealogyనే వేరు. ఇదిగాక ఒకరు చెప్పిన చెప్పిన విషయం ఇంకొకరు చెప్పినదానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. అందరూ ఒకటే ఐతే యెహోవాను పూజించి అల్లాహ్‌ను పూజించనందుకు మహమ్మద్ ఎందుకు యూదులపై ఆగ్రహం ప్రదర్శించాడు? 'ఇతర దేవుళ్ళను ప్రార్ధిస్తే నాకు కోపం వస్తుంద'ని బైబిల్లో దేవుడు ఎందుకలా కుండబ్రద్దలుకొట్టాడు?

   ఎర్రగా ఉండేపండును ఒక పండును ఇంగ్లీషులో 'ఆపిల్' అంటే, హిందీలో 'సేపు' అంటారు. ఇక్కడ మీరన్న మాట వర్తిస్తుంది. వాటిని ఎవరు ఏపేరుతో పిలిచినా 'ఆపిల్', 'సేపు'ల లక్షణాలు ఒకటే. కానీ అది లక్షణాలు వేరుగా ఉన్న రెండు వేర్వేరు పళ్ళకు ఈతర్కం అతకదు (ఉదాహరణకు అరటిపందును హిందీలో (apple అన్న అర్ధంలో) 'సేపు' అనడం అర్ధరహితం. రూపాలు ఒకేలా ఉన్నా వేర్వేరు ప్రవర్తనలు కలిగిన సారూప్య కవలల్ని వేర్వేరు వ్యక్తులుగా పరిగణించినట్లే దేవుళ్ళనుకూడా వారివారి హోదాలనీ(titles), వారి దైవత్వాలనోగాక వారివారి ప్రవర్తన, బోధనలు లాంటి లక్షణాల ప్రకారం వేర్వేరుగానే భావించాల్సి ఉంటుంది.

   శాస్త్రాల్లో ascertations (ధృవీకరణలు) ఉన్నమాట నిజమే కానీ కావలసింది వాటికవి సరైనవని చెప్పుకోవడం (ధృవీకరణ) కాదు. కావలసింది proofs (ఋజువులు). ఒక scientific theory యొక్క evolutionని చదివి, దాని ఋజువులు ఒకసారి పరిశీలించి, అప్పుడు మీరు 'ఆధ్యాత్మిక గ్రంధాల్లోని ధృవీకరణలను' చదివితేగనుక, మీరు చెప్పిన గ్రంధాల్లోని ascertations కేవలం ప్రాపగాండా అన్నవిషయం అర్ధమవుతుంది. అదొక ప్రపగాండా కాబట్టే రాజకీయ పార్టీలు మారినట్లు మతాలు మారడాలూ, ప్రచారాలూ, డబ్బులూ, ఇతరులపై దాడులకు పాల్పడటాలూ మతాల విషయంలో సర్వ సాధారణం.

   Delete
  2. నా ఉద్దేశ్యం assertion. ఆ తప్పును సరిచేసి మళ్ళీ వ్యాఖ్యరాదామనుకున్నాను. కానీ కుదరలేదు. ఇక ఆపని పెట్టుకోను.

   Delete
  3. త్రిశూల్ గారు మీ వాదన అర్ధరహితంగా ఉంది.తెలుగు మాటలాడే మనమలో ఏ మతస్తుడైనా కామన్ గా దేవుడని ఎలా అంటామో అలాగే అక్కడ అరబిక్ మాట్లాడే ప్రజలు అల్లాహ్ అనేది కామన్.ఈ విషయం తెలియకుండా కొత్త దేవుడనడం చాలా విడ్డూరం.యెహోవాను పూజించే యూదులపై అల్లాహ్ ను పూజించనందుకు ముహమ్మద్(స) ఆగ్రహం వ్యక్తం చేసాడనేది పూర్తి అజ్ఞానపూరితమైనది. మీరొక ముఖ్య విషయం తెలుసుకోవాలి.ఆయనున్న ప్రాంతం అరేబియా.ఆయనగాని,అక్కడ నివశిస్తున్న యూదులుగాని,అరబ్బులుగాని, క్రైస్తవులుగాని మాట్లాడే భాష అరబీనే! వాళ్లు కామన్ గా దేవున్ని అల్లాహ్ అనే పిలుస్తారు.ఇప్పటికి కూడా అరబిక్ బైబిల్లో అల్లాహ్ అనే ఉంది. ముహమ్మద్(స) యూదులపై ఆగ్రహం చూపింది విగ్రహారాధనను మాననదుకు, యేసును ప్రవక్తగా నమ్మకుండా నిందలు మోపుతున్నందుకు. అందుకనే థార్మిక పుస్తకాలను చదవమనేది.పరిశీలించమనేది..సైన్స్,తర్కం అంటూ ఉన్న సైన్స్ వదిలి పెట్టి లేని తర్కాన్ని ప్రదర్శిస్తూ థర్మాన్ని భ్రష్టు పట్టించడమే ఏమీ లేదు సర్!

   Delete
  4. అల్-ఇలాహ్ (the God) అంటే ఏమిటో నాకు తెలుసనే అనుకుంటున్నాను. సిరియన్ క్రిస్టియన్లుకుకూడా తమదేవుణ్ణి అల్లా అని సంబోధిస్తారని నాకు తెలుసు. కానీ అల్లా అనేది దేవునిపేరుకూడా. అదే కానప్పుడు "లా ఇలాహ్ ఇలల్లాహ్" అన్నమాటను "దేవుడు వినా దేవుడెవరూలేరు" అని చెప్పుకోవాలి. మరి అలా చెప్పకుండా "అల్లా వినా దేవుడు లేడు" అని ఎందుకు అర్ధం చెప్బుతున్నారో మీరే చెప్పాలి. అల్లా అన్నపేరుకి రెండు usages ఉన్నయి. ఒకటి దేవుని పేరుగానూ, "దేవుడు" అన్నమాటకి అర్ధం గానూ. అల కాదనుకున్నప్పుడు యూదులెవరైనా "లా ఇలాహ్ ఇల్యహ్వ" అంటే దాన్ని ముస్లిములు కల్మా అంతటి పవిత్రమైనదిగనే భావిస్తారా?

   అల్లాని పూజించనివాళ్ళుకూడా ఏదో ఒక (వాళ్ళవాళ్ళ) భాషల్లో ఇతరులని పూజిస్తున్నప్పుడు "అవిశ్వాసులపై" మహమ్మద్ యుధ్ధాలెందుకు చేయవలసి వచ్చిందో చెబుతారా? యూదులపై మహమ్మద్ కోపాన్ని వ్యక్తపరచిందీ, వాళ్ళు ఏ నరకంలో పడతారన్నది వివరించిందీ నిజంకాదా? మీరు నా కామెంటులో major partని ఎందుకు పట్టించుకోలేదో చెప్పగలరా? దేవుళ్ళందరూ మనుషుల నుంచి ఆశించిన నడతా, ప్రార్ధన విధానాలు వేరయినప్పుడు వాళ్లందరూ కేవలం పిలుపుల్లోనే భిన్నంతప్ప మిగతా అంతా ఒకటే అన్న అభిప్రాయానికి మీరెలా వచ్చారు? లేకపోతే మీరు దాన్ని ఎవరైనా quote చేస్తే చదివి నిజమని అనుకుంటున్నారా?

   యూదులు యేసును ఒప్పుకోకుంటేనేం? వాళ్ల దేవుణ్ణి(= అల్లాహ్‌ని) పూజిస్తూనే ఉన్నారుగా? అది సరిపోదా? ఇస్లాం తరువాత పుట్టుకొచ్చిన దేవుళ్ళను ముస్లిములు గుర్తించాల్సిందేనని మీ అభిప్రాయమా? Xenuని మహమ్మద్ తరువాతి ప్రవక్తగా ముస్లిములు అంగీకరించగలరా? మరలంటప్పుడు యూదులుమాత్రం జీసస్‌ని ప్రవక్తగా ఎందుకు అంగీకరించాలి?

   "EDGEగారు నాకు ప్రామాణికం థార్మిక గ్రంధాలే గాని ఈ శాస్త్రవేత్తల అభిప్రాయాలు కాదు. ఇక సైన్స్, సైన్స్ అంటుంటే ఐన్ స్టీన్ విషయం చెప్పాల్సి వచ్చింది. రాధాకృష్ణన్ గారు మొక్కారు అంటున్నారు కాబట్టి...ఒక విషయం రుజువవుతుంది.(అసలు దేవుడెవరు అనే విషయం ప్రక్కన బెడితే..) ఈ శాస్త్రవేత్తల్లో కూడా భక్తిభావం ఉందంటే దేవుడనే వాడు ఉన్నాడనే కదా? దేవుడు లేడనే వాదన సైన్స్ తెచ్చిన వారే త్రోసివేస్తున్నారు కదా సర్. ఇంతకంటే గొప్ప సైన్స్ యధార్ధమైనది థార్మిక శాస్త్రాలలో ముందే చెప్పబడింది. కాలానుగుణంగా బయటపడుతూనే ఉంది. "

   నేను ప్రశ్నించిందే' ప్రామాణిక గ్రంధాల' శాశ్త్రీయతను గురించి. ఆ గ్రంధాల్లో ఉన్నవాటిని రుజువులెక్కడున్నాయి? సైంటిస్టులు దేవుణ్ణి పూజించినంతమాత్రాన దేవుడి అస్థిత్వ నిరూపణ జరిగిపోతే, కొందరు ముస్లిములు (ప్రముఖులే సుమండీ) తరువాతి కాలంలో నాస్తికులుగా మారారు. దాన్ని బట్టి ఏం నిరూపితమవుతుంది? సరిగ్గా ఇందుకే నేను appeal to authorityని ప్రస్తావించింది. మీరు దానిమాత్రం పట్టించుకోవడంలేదు. గ్రంధాల్లో సైన్స్ లేదండీ. సైన్సుకు తగ్గట్టుగా గ్రంధాలను interpret చెయ్యడం మాత్రమే ఉంది. సైన్సు ఎప్పుడూ ప్రయోగశాలల్లోనో, శాస్త్రవేత్తల మెదళ్ళలోనో ముందుగా బయట పడుతుంది. అలా జరిగినతరువాత మతపెద్దలు వాళ్ళ గ్రంధాల్లోని రాతలను సైన్సుకు తగ్గట్లుగా వివరించి క్రెడిట్ కొట్టేయ్యాలని చూడటం ఉంది. ఆయా శాశ్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చెయ్యకపోతే, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పుకోడానికి మతపెద్దలకు ఏమీ ఉండదు. మీరన్నదే నిజమైతేముందుగా మతగ్రంధాల్లోంచి బయటపడి నిరూపణలకు నోచుకున్న ఒక్క విషయం ప్రస్థావించండి. లేదా Name one scientific theory that has been replaced with a religious explanation. ఈ దిశగా ఒక్కటి చూపించండి.

   Delete
  5. "యూదులపై ఆగ్రహం చూపింది విగ్రహారాధనను మాననదుకు, యేసును ప్రవక్తగా నమ్మకుండా నిందలు మోపుతున్నందుకు."

   ఈ రెండింటినీ హిందువులూ చేస్తారుకదా! ఒకవేళ మహమ్మద్ ఇప్పుడు జీవిస్తూ ఉంది ఉంటే హిందువులమీద విగ్రహారాధనను ఆచరిస్తున్నందుకూ, యేసును దేవుని ప్రవక్తగా నమ్మనందుకూ యుధ్ధాన్ని ప్రకటించి ఉండేవాడా? మరి క్రైస్తవులు శిలువముందు మ్రొక్కడం విగ్రరాధన కాదా? వారినేం చెయ్యాలి?

   నెను కాదు. మీరే వాటిని మరోసారి చదవండి. ఈ సారి ప్రశ్నించుకుంటూ చదవండి. తర్కించుకుంటూ చదవండి. భక్తిని కొంచెం పక్కనపెట్టి చదవండి.

   Delete

 16. "ఐన్ స్టీన్" లాంటి మహా శాస్త్రవేత్త నమ్మాడు, ISRO చైర్మన్ రాధాకృష్ణన్ శాటిల్లైట్ విజయవంతంగా ప్రయోగించబడినప్పుడల్లా తిరుపతి వెళ్ళి మొక్కుతీర్చుకున్నాడు కాబట్టి దేవుడున్నాడు అంటే కుదరదు చౌదరి గారు. ఈ వాదనెలా తర్క విరుద్ధమో త్రిశూల్ గారు బాగానే explain చేసారు కాబట్టి , నేను ఆ శ్రమ మళ్ళీ చేయనవసరంలేదు. ఇక, ఆధ్యాత్మిక శాస్త్రాల్లో శాస్త్రీయత వెతకడం కంటే ఇసుకనుంచి తైలం పిండడం సులభం.

  మీరు గమనించారో లేదో గాని, ప్రస్తుత చర్చలో మొట్ట మొదటిగా వ్యక్తిగత ధూషణకి పాల్పడిన వ్యక్తి పెద్దమనిషిగా తెలుగు బ్లాగ్లోకంలో చాలా మందిచే గౌరవించబడే శ్యామలీయం గారు:

  “బొద్దింక నీచమైనది కాదు, (దేవుడి సంగతి తరువాత ఆలోచిద్దాంకాని,) కొందరు మనుషులకన్నా అన్నది మీరు ఋజువు చేసారుగా చాలును.”

  ReplyDelete
  Replies
  1. EDGEగారు నాకు ప్రామాణికం థార్మిక గ్రంధాలే గాని ఈ శాస్త్రవేత్తల అభిప్రాయాలు కాదు. ఇక సైన్స్, సైన్స్ అంటుంటే ఐన్ స్టీన్ విషయం చెప్పాల్సి వచ్చింది. రాధాకృష్ణన్ గారు మొక్కారు అంటున్నారు కాబట్టి...ఒక విషయం రుజువవుతుంది.(అసలు దేవుడెవరు అనే విషయం ప్రక్కన బెడితే..) ఈ శాస్త్రవేత్తల్లో కూడా భక్తిభావం ఉందంటే దేవుడనే వాడు ఉన్నాడనే కదా? దేవుడు లేడనే వాదన సైన్స్ తెచ్చిన వారే త్రోసివేస్తున్నారు కదా సర్. ఇంతకంటే గొప్ప సైన్స్ యధార్ధమైనది థార్మిక శాస్త్రాలలో ముందే చెప్పబడింది. కాలానుగుణంగా బయటపడుతూనే ఉంది.

   Delete
 17. నా మాట ఒకటి వ్యక్తిగతదుషణగా అక్షేపించబడటం చూసాను. ఎవరికైనా, తమది ఐన ఒక వాదన (అది పరిగణనీయం కానీయండి, కాకపోనీయండి) ఉన్నంత మాత్రాన, అభ్యంతరకరమైన ఉపమానాలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్రాయటం ద్వారా తమవాదనని వినిపించాలనుకోవటం సరి కాదు. అలాంటి ధోరణి పట్ల కటువుగా స్పందించటంలో ఇక్కడ దూషణ జరిగింది అని నేను అనుకోవటం లేదు. విశృంఖలంగా మాట్లాడటం అన్నది చెల్లుతుంది అనుకుంటే అలాంటి ధోరణులకు న్యాయస్థానాలు అడ్డుకట్టలు వేయటాన్ని కూడా మీరు అక్షేపించగలారా? లేదు కదా? అవి అడ్డుకట్తలు వేస్తూ ఉండతానికీ, ప్రభుత్వాలూ అలాగే స్పందిస్తూ ఉండటానికీ కారణం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం పధ్ధతి కాకపోవటమే. నిమజీవులు మనని హింసించటంకోసం ఏమీ ప్రత్యేకంగా అలోచించి చేయవు. కాని మనమధ్య మనుష్య్లు కొందరు ఆలోచించి మరీ ఇతరులను మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో మాట్లాడటం చాలా దారుణం.

  త్రిశూల్ గారి వాదన ఇతరత్రా ఆలోచనీయంగా బాగానే ఉంది. కాని ఇంకా ఆయన వ్రాసిన విషయాలపై నా అభిప్రాయాలు వ్రాసి చర్చలోనికి దిగదలచుకోలేదు.

  నేను కొంచెం ఎక్కువగా ఆవేశపడుతున్నది నిజమే. అలా ఉద్రేకపడటం నా స్వభావం కాదు కాని ఈ‌మధ్య ఇలా జరుగుతూ‌ ఉండటానికి కారణం నా అరోగ్యపరిస్థితి కావచ్చును. (నిజానికి ఈ‌ ప్రస్తుత వ్యాఖ్యలో కూడా కొంత అనవసరమైన ఆవేశం ఉందేమో అనిపిస్తోంది!)

  అందుచేత మనస్సును ఉద్రేకింపచేసే విషయాలను చదవటమూ చర్చించటమూ చేయటం పట్ల ఆసక్తిలేదు. ఐనా ఒక్క శ్యామలీయం అనేవాడు కలగజేసుకున్నా మానినా ఈ రకమైన చర్చలు నిత్యం సమాజంలో జరుగుతూనే ఉంటాయి. వాటి వలన ఎప్పుడు తేలేదీ ములిగేదీ ఏమీ ఉండదు.

  ReplyDelete
  Replies
  1. "అభ్యంతరకరమైన"

   ఏది అభ్యంతరకరమో తేల్చడానికి ఏది ప్రమాణం? హిందువులు వరాహాన్ని విష్ణు అవతారంగా భావిస్తే, దాన్ని ముస్లిములు అవమానకరంగా భావిస్తారు. ముస్లిములు గోవధను న్యూట్రల్‌గా భావిస్తే హిందువులు అతి దారుణమైన నేరంగా భావిస్తారు. ఒక వ్యక్తి ఇన్ని పరస్పర విరుధ్ధమైన నీతులను పాటించడమంటే తన నోరు తాను కట్టేసుకోవడమేకాదా?

   "విశృంఖలంగా మాట్లాడటం అన్నది చెల్లుతుంది అనుకుంటే అలాంటి ధోరణులకు న్యాయస్థానాలు అడ్డుకట్టలు వేయటాన్ని కూడా మీరు అక్షేపించగలారా?"
   "సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే మాటలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం పధ్ధతి కాకపోవటమే."

   విశృంఖలంగా?!! నేనేమైనా వాళ్లనీవీళ్లనీ నరకమని చెబితే (demagogy) తప్పుగానీ, విమర్శించడం తప్పెలా అవుతుంది? ఒకవేళ విమర్శించడం తప్పని కోర్టులు భావిస్తే అది ఖచ్చితంగా సరైనవిషయంకాదు. కోర్టులు కూడా కొన్ని విషయాల్లో తమనుతాము సరిదిద్దుకున్న సంఘటనలు చూస్తున్నాంకాదా! అసలు logicకి గాయపడేంత సున్నిత హృదయాలు ఎందుకైనా ఎందుకుండాలి? అర్ధరహితమైన నమ్మకాలను నమ్మడంలో లెను బాధ/అవమానమూ వాటిని ఇంకొకరు తీవ్ర పదజాలంతో విమర్శిస్తేమాత్రం ఎందుకుండాలి?

   నాస్తిక అతివాదులు మాహా ఉంటే నాలుగు కార్టూన్లు వేస్తారు, రెండు సినిమాలు తీస్తారు, మరికొన్ని జోకులు వేస్తారే తప్ప ఆస్తికులంతా పాపులనిగానీ, ఆస్తికత పాపమనిగానీ, వాళ్లందరినీ చంపాలనీ అభిప్రాయపడరు. వారు మహా ఉంటే ఎగతాళిచేస్తారేగానీ మతయుధ్ధాలు చేయడంగానీ, అల్లర్లను ప్రేరేపించడంగానీ చేయరు. చేయలేదు. నా అభిప్రాయాలను తప్పనిచెప్పగల ఉదాహరణలను తెలిస్తే ఎవరైనా ఉదహరించండి. నేను ఈ విషయంలో నా అభిప్రాయం మార్చుకోవడానికి ఎప్పుడూ సిధ్ధం. దేవుడి పేరుమీద పారిన రక్త ప్రవాల ఒడ్డున నిలబడి అడుగుతున్నాను అసలు నాస్తికులు చిందించిన రక్తపుబొట్లు ఎన్ని?

   Delete
  2. "అసలు నాస్తికులు చిందించిన రక్తపుబొట్లు ఎన్ని?"

   I mean నాస్తికత్వపు వ్యాప్తికై చిందించబడిన రక్తపు బొత్లెన్ని?

   స్టాలునులూ, లెనినులూ, మావోలూ కమ్యూనిజపు వ్యాప్తికోసం ఏమినా చేసుండవచ్చు. దాన్ని నాస్తికఖాతాలో వెయ్యడం కుదరదు.

   Delete
 18. అన్నట్లు science ఏమీ ఖాళీగా కూర్చోలేదు. ఒక్కొక్క రంగాన్నీ దేవుడి, దేవుడి పూజారుల చేతుల్లోంచి లాగేసుకుంటోంది (ofcourse that is working to our benefit).
  -----------
  త్రిశూల్ గారూ మీరు అన్నది నిజం కాదేమో అనిపిస్తున్నది. నిన్ననే మెడిటేషన్ కంట్రోల్స్ DNA అనికూడా చదివాను (Scientific American Mind ) . ప్రేయర్ గురించి చేసిన రిసెర్చ్ మీద ఒక ఈ మెయిల్ వచ్చింది. అది క్రింద ఇస్తున్నాను. ప్రతి మతం లోను దేముడు, ప్రేయర్ ఉన్నాయి. నాకు ఈ వాగ్వివాదములలొ కల్పించుకోనటం ఇష్టంలేదు కానీ కొన్ని విషయాలు చెప్పాల్సివుంది. మీకింకా నమ్మకంలేదు అంటే చేసేది ఏమిలేదు.
  Millions of Americans believe prayer works. Yet the mainstream media tends to avoid the subject altogether.

  But our Mind Health Report team at Newsmax Health wanted answers to questions like these:

  Can modern science explain prayer?
  Does praying strengthen your brain and prevent mental decline?
  What benefits, if any, does prayer offer you — physically, mentally, and emotionally?
  To this end, the team went out to the scientific and medical community to learn the potential benefits of prayer — and what they found both surprised and excited all of us here at The Mind Health Report.

  The results were so startling, in fact, we created a FREE video presentation to share with you exactly what we discovered.

  When you watch this FREE video, you’ll discover how prayer actually changes four distinct areas of your brain. In fact, you’ll see exactly how prayer or other spiritual practices increase activity in the areas of your brain that are most helpful to you, and diminish activity in areas that are less helpful — or even harmful.

  You’ll also see:

  How a specific amount of “prayer time” per day can help prevent memory loss, mental decline, and even dementia or Alzheimer’s . . .
  The #1 prayer pitfall that can actually make you sick if you’re not careful (this is one of the most important bits of wisdom you’ll ever gain) . . .
  47 scientifically proven benefits of prayer, including pain relief, reduced risk of death from heart attack or stroke, lessened anxiety or depression, and more . . .
  And much, much more . . .
  So Take a Few Minutes to See This FREE Video
  on the Brain Science Behind Prayer Right Now!

  This video does not promote any specific religion or spiritual practice. But it does shed light on a practice that 3 out of 4 Americans engage in on a regular basis — a practice basically ignored by the mainstream media.

  Please don’t delay watching this. You could get busy and forget — or the video could be removed and you’ll have lost this special opportunity.

  Dedicated to your healthy mind and brain,

  Newsmax Health

  P.S. See for yourself how prayer activity can be scientifically measured — and how it alters four key areas of your brain. Click here now to take advantage of this special FREE VIDEO about the scientific basis of prayer!

  ReplyDelete
  Replies
  1. లక్కరాజు గారు : ప్రార్ధన/మెడిటేషన్ వాటిని పాటించే/చేసే వ్యక్తిమనసుమీద ప్రభావం చేస్తాయని నేను నిర్ద్వందంగా ఒప్పుకుంటున్నాను (నిజానికి ఈ విషయం మీద నాకు ఇంతకుముందే అవగాహన ఉంది).

   కానీ.. ప్రార్ధన చేసేవారు కేవలం తమ మనోబలంకోసం చేయరు. వాళ్ళు ప్రార్ధన చేయడంవల్ల దైవం (లేదా universe) వాళ్లవైపు మొగ్గుచూపుతుంది అని అనుకుంటారు. ఉదాహరణకి నేను ప్రార్ధించడంవల్ల దేవుదు నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు/సినిమా టికెట్లు దొరికేలా చేస్తాడు/పారెకింగ్ ప్లేస్ దొరికేలా చేస్తాదు/అనారోగ్యాన్ని రూపుమాపుతాడు అన్న అభిప్రయాలతోనే నా తకరారంతా.

   ప్రార్ధన వల్ల మనోబలంచేకూరి, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాము అన్నది నిజమే. కానీ మతాలు ఆవిషయాన్నికాక దేవుడు మీకోరికల్ని తీర్చడంలో నిమగ్నమైపోతాడు అని చెబుతాయి. నా గొడవ దీని గురించి.

   Delete
  2. లక్కరాజు గారు : మీకామెంటులోను "నిన్ననే మెడిటేషన్ కంట్రోల్స్ DNA అనికూడా చదివాను" ని మాత్రం నేను అంగీకరించలేను. మీరన్నదే నిజమైతే ఒక వ్యక్తి అణిమాది అష్టసిధ్ధులను సాధనచేసి తన DNAను మార్పుచేసుకుంటే, అతనికి పుట్టే కొడుకులూ, కూతుళ్ళూ ఆయనగారి సిధ్ధులను inherit చెయ్యాలి. అలాచేస్తారు అనడానికి ఋజువులున్నాయా? ఈమధ్య హిందూ సైన్స్, ఇస్లామిక్ సైన్స్, క్రిస్టియన్ సైన్స్ అంటూ journals రాస్తూ ఎవరికి కావాల్సిన విధంగా వారు సైన్సును వండుతున్నారు -అదేదో బిరియానీలాగా. వీళ్ల journalsలో రాసేవాళ్ళెవ్వరి వ్యాసాలూ standard journalsలో ప్రచురితమవ్వవు. అదే ఆశ్చర్యం నాకు! వీళ్ళ దౌర్భాగ్యంకొద్దీ సైన్స్ అనేది ఒక ధృవతారగా నిలిచిపోయింది కాబట్టి అర్జంటుగా వీళ్ళవీళ్ళ మతాల compassలను సైన్స్ వైపు point చేస్తున్నారు. వీళ్ళుచెప్పే అర్ధంపర్ధంలేని విషయాలకు సైన్సురంగు పులుముతున్నారు. వీళ్ళెలాంటివారంటే రోడ్డుప్రక్కన డేరాల్లో ఎయిడ్స్‌నుకూడా నయంచేయగలమని కొందరు చెబుతుంటారు చూడండి, అలాంటివారు. వాళ్ళు మెడికల్ సైన్సెస్ గురించి చెబుతారు. కాకపోతే వాళ్ళుచెప్పేది పూర్తిగా nonsense అని తెలుసుకోవడానికి మంకు నామం నామమాత్రపు తర్కం వాడగలిగితే చాలు. మీరొక్కసారి Fads and Fallacies in the name if science అన్న పుస్తకం చదివితే, ఇలాంటివాన్నీకూడా సైన్సే నని ప్రజలు నమ్ముతున్నారా/నమ్మారా అని నవ్వుకుంటారు. ఒక్కసారి bad science అని googleలో సెర్చ్ చేసి, imagesకి వెళ్ళి అందులో మొదటి image చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని దానితో సరిపోల్చండి. విషయం మీకే అర్ధమవుతుంది.

   ఒక్కమాట చెబుతాను వినండి. (శాస్త్రవేత్తల) అభిప్రాయాలు వేరు. నిరూపితమైన విషయాలు వేరు.

   Delete

 19. Scientific American Mind & Brain
  Dec 17 (2 days ago)

  to me
  A study finds meditating cancer patients are able to affect the makeup of their DNA
  To view this email as a web page, go here.
  You received this email because you opted-in to receive email from Scientific American.
  To ensure delivery please add news@email.scientificamerican.com to your address book.

  Mind & Brain
  December 17, 2014 Scientific American
  FEATURED THIS WEEK
  Changing Our DNA through Mind Control? Changing Our DNA through Mind Control?
  Read More
  Top Stories
  SCIENTIFIC AMERICAN MIND VOLUME 25, ISSUE 6 MIND & BRAIN
  Exercise Counteracts Genetic Risk for Alzheimer's
  Regular physical activity may correct the brain's metabolism to stave off dementia
  SCIENTIFIC AMERICAN MIND VOLUME 25, ISSUE 6 MIND & BRAIN
  Why Do We Want to Bite Cute Things, Like Adorable Newborn Babies?
  —Emma Poltrack, Virginia
  TALKING BACK MIND & BRAIN
  Brain Training Doesn’t Give You Smarts...Except When It Does
  Our site recently ran a great story about how brain training really doesn't endow you instantly with genius IQ. The games you play just make you better at playing those same games.
  Scientific American
  November 2014

  Scientific American Mind Volume 25, Issue 6

  Featured Products from Scientific American

  Online Course: Cognition and the Aging Brain
  Dr. Brian Levine, a board certified clinical neuropsychologist and expert on human memory, will explain the processes underlying healthy brain aging, and how the major dementia syndromes are recognized.

  ReplyDelete
  Replies
  1. లక్కరాజు గారు :

   మీ అభిప్రాయాన్ని, మీ దగ్గరున్న సాక్ష్యాన్ని తప్పకుండా పరిగణించవలసిందే. నేను ఇంతవరకూ మీరిచ్చిన evidenceని చదువలేదు. చదివిన తరువాతమాత్రమే నేను ఈవిషయంలో ఇకమీదట నా అభిప్రాయాన్ని ఇక్కడ తెలియబరచాలనుకుంటున్నాను. (నా అభిప్రాయంకోసం మీరందరూ కాచుక్కూచున్నారన్న వెఱ్ఱి భ్రమలు నాకు లేవు) వారాంతం కావున కొంచెం వేచిచూడవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

   Delete
 20. This comment has been removed by the author.

  ReplyDelete
 21. Meditation Combats Aging, Fights Depression and More…

  naturalm December 20, 2014 Home, Mind & Body
  References

  1http://www.alzheimersprevention.org/downloadables/Yoga_and_Medical_Meditationtm.pdf

  2 Ibid.

  3 Ibid.

  4 Newberg AB, Wintering N, Khalsa DS, et al. Meditation Effects on Cognitive Function and CBF in Subjects with Memory Loss. Journal of Alzheimer’s Disease 20 (20)(2010) 517-526. November 2010.

  ReplyDelete
  Replies
  1. LAKKARAJU gaaru : ఓపికగా చదివాను. study! అంటే అది కొందరి పరిశీలన. DNA మారుతుంది అని చెప్పారు. ఏమేరకు అన్నది నాకు దొరకలేదు. Control groups గురించి వెదికాను. ఆ సమాచారమూ దొరకలేదు. సరే ఒప్పుకుంటాను మెడీటేషన్ వల్ల DNAని మార్చుకోవచ్చు. దానికీ దేవుడికీ సంబంధమేమిటి? I could meditate on almost anything right? if meditation means suppressing thoughts and letting go of regret or things like that, I don't still understand the significance of God here. దీంట్లో దేవుడి ప్రమేయం నాకు ఎంతమాత్రమూ అర్ధం కాలేదు. ఇది ఈ పోస్టుకు ఎలా related అన్నదీ అర్ధం కాలేదు.

   Delete
 22. దేవుడు అన్న భావం ఎందుకైనా పనికొచ్చిందంటే అది వాణ్ణి నమ్మనివారిని నరికి చంపడానికి, వాడు చెప్పాడని కొందర్ని కాల్చుకు తినడానికి (bible allows rape and slavery while Qur'an sanctions killing and Hinduism allows inhuman practices and subjugation of human rights), పరలోక సుఖాల (అందులో మళ్ళీ వేశ్యలు/హూర్‌లు ఉంటారు మరి) ఎరచూపి మనిషిచేత అకృత్యాలు చేయించడానికి, నీ కష్టాలకు కారణం ముందు జన్మలో చేసిన పాపాలేనని బుకాయించడనికి. దేవుడిపేరుతో ఎలాంటి productiove పనీచేయకుండా కొందరు self appointed servants of God మిగతావాళ్ళని అధములుగా భావిస్తూ, వాళ్లమీద రక్తాలుపీల్చి బ్రతకడం దానికిమళ్ళీ వ్యవస్థ, సంఘం అంటూ సొల్లుకబుర్లు చెప్పడం నిజం. దేవుణ్ణి లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టాకనే యూరప్, అమెరికా, ఇండియాలు అబివృధ్దిచెందాయి. దేవుణ్ణి మరీ సీరియస్‌గా తీసుకోవదంవల్లే (algebraమొదలుకొని numerical systemని co-found చెయ్యడం నుండి, geography, astrologyల్లో ఎంతో ప్రగతి సాధించిన) మధ్యప్రాచ్యం ఇలా తగలడింది.

  The concept of god has never been logical. One doesn't need really evidences but the religious books to expose the ugliness of the religion.

  ReplyDelete
 23. I could meditate on almost anything right?
  -----------------------------------------
  I thought most of the people meditate and pray for the blessings of God. May be I am wrong.

  ReplyDelete
  Replies
  1. I thought most of the people meditate and pray for the blessings of God. May be I am wrong."

   U are right sir! Most of the ppl do meditate on God (probably) but one doesn't HAVE TO meditate on god. Technically one could meditate on absolutely any'thing' (I meditate on my pet rabbit). I just couldn't understand where does God come into the picture?

   Delete
  2. త్రిశూల్ గారూ చాలా మంది దేముణ్ణి ప్రార్దిస్తారని (Meditation & Prayer ) వప్పుకున్నారు కదా. వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోటానికి ప్రార్ధిస్తారు. అల్లా ప్రార్ధిస్తే (Meditation & Prayer) వాళ్ళ మానసిక వ్యాధులూ , కాన్సర్ కూడా తగ్గిందని శాస్త్రజ్ఞుల పరిశోధనలు తేల్చాయని చూపెట్టాకదా. అంటే దేముడు వారి కోర్కెలని తీర్చినట్లే కదా. అంటే దేముడున్నట్లే కదా. అందుకనే మీ ప్రార్ధనలకి మీరు ప్రార్ధించే రాబిట్ కూడా ఆరోగ్యంగా చక్కగా ఉంది.
   Meditation & Prayer మీద నేనిచ్చిన రెఫెరెన్సులు మీకు నచ్చకపోతే నేను చేసేదేమీ లేదు. అవి ఆయా అంశాలలో నిష్ణాతులైన శాస్త్రజ్ఞులు చదివే పుస్తకాలలోనివి.

   Delete
  3. This is exactly where you started to loose me. నేను నా కుందేలుకోసం ప్రార్ధించడంలేదు. కుందేలు 'పైన' దృష్టి నిలుపుతున్నాను (meditating 'on' my rabbit). మీరన్నది నిజమైతే నా కుందేలూ, (ఇంకొకరు గాడిదమీద మెడీటేట్ చేస్తే ఆ) గాడిద దేవుడవ్వాలి. నాకు/మెడిటేట్ చేసినవారికి ఆరోగ్యం కలిగితే దానికి నా/మెడిటేట్-చేసినవారి మనోబలం కారణమేతప్ప దేవుడెలా కారణమౌతాడు? అసలు దేవుడంటూ ఒక ప్రాణి ఉంటెకదా! (దేవుణ్ణి ప్రాణి అనే పొరబాటు నేనుకూడా చేశాను).

   కొన్ని maleases(ఉదాహరణకు తలనొప్పి) ని నయంచేసుకోగల శక్తి మనిషికి తన మనోబలం కలిగిస్తుంది. క్యాన్సర్లాంటి తీవ్రమైన రోగాల విషయంలో అది నిజంకాదని నేను ఇంతవరకూ నమ్ముతూ వచ్చాను(ఎందుకంటే నాకు ఆధారాలు దొరకలేదుకాబట్టి). మీరో 'పరిశీలన'ను నాముందు నిలిపారు. దీనికి మరిన్ని ఋజువులు తోడై ఒక treatment స్థాయికి చేరేవరకు వేచిచూద్దాం. ఏమంటారు? Observations అనేవి sciencesలో సాధారణం. అవి repeatable అవ్వాలి, కాలపరీక్షకు తట్టుకు నిలబడాలి. సరిగ్గా ఇక్కడే నేనుదహరించిన bad sciences టాపిక్ అవసరమౌతుంది.

   Delete
  4. వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోటానికి ప్రార్ధిస్తారు. అల్లా ప్రార్ధిస్తే (Meditation & Prayer) వాళ్ళ మానసిక వ్యాధులూ , కాన్సర్ కూడా తగ్గిందని శాస్త్రజ్ఞుల పరిశోధనలు తేల్చాయని చూపెట్టాకదా. అంటే దేముడు వారి కోర్కెలని తీర్చినట్లే కదా. అంటే దేముడున్నట్లే కదా.

   కొందరు serial killers దేవుడు తమ చెవుల్లో పోరబట్టే తాము జనాల్ని చంపామని చెప్పారు. పవిత్రుడైనటువంటి అబ్రహాం/ఇబ్రహీం కూడా devine inspiration వల్లనే చిన్నపిల్లలౌ బలిపెట్టబూనారు (హిందువులు ధర్మవ్యాధుడి కధ చదువుకోగలరు).

   మీరన్నదే నిజమైతే దేవుడు రోగాల్ని నయంచేయదంతోబాటూ వాడొక pervert అని నమ్మాలా?

   Delete
 24. లక్కరాజువారికి, మీరూ ఈ వాదనలలో చిక్కుకుంటున్నారు. వాదనలతో ఈ‌ విషయంలో ఎవరినీ ఎవరూ ఒప్పించనూ లేదు మార్చనూ లేరు. ఈ‌ వాదనల పొడిగింపులకు దోహరపడినంతకాలమూ ఇరుపక్షాలూ మరిన్ని తమకు ఆట్టె హితవు కాని మాటలను చదువవలసి వస్తుంది తప్ప మరేమీ సాధ్యమయ్యేది ఉందని అనుకోను. మరింతగా వాదనలో ఉండటం గురించి ఆలోచించుకోవటం మంచిది. అన్నట్లు ముఖ్యమైన మాట. దేముడు అన్నది సరైన పదం కాదండి, దేవుడు అనాలి. ఈ రెండుముక్కలూ చెప్పటానికి మాత్రం సాహసించాను తప్ప వాదనపట్ల ఆసక్తితో కాదు, స్వస్తిరస్తు.

  ReplyDelete
 25. Trishul garu I gave up. Thanks any way.

  ReplyDelete
 26. నిజానికి దేవుడున్నాడని నమ్మడం విశ్వాసమే! నాస్తికవాదులకు అది కేవలం ఒట్టి నమ్మకం క్రింద మాత్రమే కనిపిస్తుంది.కాని ఆస్తికవాదులకు అది ఆత్మీయ అనుభూతి.ఇది అందరికీ అర్ధం కాకపోవచ్చు. నా దృష్టిలో ఆస్తికవాదమే బలమైనది.దేవుడు ఈ సృష్టిని తయారు చేసి నడుపుతున్నాడు. అందుకే మనిషి పుట్టుక, మరణం అతని ఆధీనంలోనే ఉన్నాయని ఆస్తికుల ప్రగాఢంగా నమ్ముతారు. ఆధ్యాత్మిక రుషులు దేవుడే ఈ సృష్టికి కర్తయని చెప్పి ఆయనే శాసకుడు అని చెప్పారు. ప్రంపంచంలోని ఏ సైంటిస్ట్ ఏ వస్తువునూ కొత్తగా సృష్టించనూ లేడు,నాశనం చేయనూ లేడు.కేవలం రూపురేఖలు మార్చగలడంతే! భూమి గుడ్రంగా ఉన్న విషయాన్ని చెప్పిన సైంటిస్ట్ ల మాటలు నమ్మి దేవుడు లేడని వాదించే ఈ నాస్తిక వాదులు ఆ భూమిని గుడ్రంగా చేసి నడుపున్న దేవున్ని ఆరాధించడని చెప్పిన ఆ అధ్యాత్మిక సాస్త్రవేత్తల మాటలను కొట్టివేయడం అర్ధరహితులు కాదా? నిజానికి ఈ నాస్తికవాదులు కూడా ఆస్తికులలోంచే పుట్టుకొచ్చారు. అధ్యధికులు కల్పించిన పనికిమాలిన సిద్ధాంతాలను చూసి,చూసి విసిగి వేసారిపోయి నాస్తికులుగా రూపాంతరం చెందారు. ఇప్పటికైనా ఈ ఆస్థికులు తప్పుడు,కల్పిత సిద్ధాంతాలను, విశ్వాసాలను విడనాడి శాస్త్ర అనుచరణ చేస్తే ఈ నాస్తికవాదం కొట్టుకుపోతుంది. అయితే ఇలా జరుగుతుంది అనుకోవడం అడియాసే అవుతుంది. ఎందుకంటే వీరిరువురూ వితండవాదంలో ముదిరిపోయారు.

  ReplyDelete
  Replies
  1. >>> నిజానికి దేవుడున్నాడని నమ్మడం విశ్వాసమే!
   >>> దేవున్ని ఆరాధించడని చెప్పిన ఆ అధ్యాత్మిక సాస్త్రవేత్తల మాటలను కొట్టివేయడం అర్ధరహితులు కాదా?

   ఈ రెందు వాక్యాలు ఒకదానికొకటి విభేదిస్తున్నాయి. దేవుడున్నాడు అన్నది విశ్వాసమైనపుడు ఆ విష్వాసాన్ని ఆరాధించండి అని చెప్పడం శాస్త్రీయం ఎలా అవుతుంది? దాన్ని కొట్టివేయడం అర్థరహితం ఎలా అవుతుంది?

   >>> ఆ భూమిని గుడ్రంగా చేసి నడుపున్న దేవున్ని...

   దేవుడే భూమిని గుండ్రంగా చేసి నడుపుతున్నాడని అనడానికి ఆధారం ఇవ్వగలరా?

   >>> అధ్యధికులు కల్పించిన పనికిమాలిన సిద్ధాంతాలను చూసి,చూసి విసిగి వేసారిపోయి నాస్తికులుగా రూపాంతరం చెందారు.
   >>> ఇప్పటికైనా ఈ ఆస్థికులు తప్పుడు,కల్పిత సిద్ధాంతాలను, విశ్వాసాలను విడనాడి శాస్త్ర అనుచరణ చేస్తే ఈ నాస్తికవాదం కొట్టుకుపోతుంది.

   అస్థికులు కల్పించిన "పనికిమాలిన" సిద్ధాంతాలేవో కొన్ని వివరించ గలరా?
   భూమ్మీద ఉన్న ఏ మతాన్ని తీసుకున్నా మనిషి కల్పించకుండా దానంత అదే ఉన్న సిద్ధాంతం ఏదో చెప్పగలరా?
   దేవున్ని నమ్మడమే ఒక విశ్వాసం అని మీరే అన్నారు, మళ్ళీ విశ్వాసాన్ని విడనాడమని మీరే అంటున్నారు... రెండూ ఒకేసారి ఎలా సాధ్యం? విశ్వాసాన్ని విడనాడాలంటే శాస్త్రీయంగా ఋజువైన దాన్నే నమ్మాలి. నాస్తికులు చేసేది అదే. దేవున్ని నమ్మాలంటే ఋజువులడక్కుండా విశ్వసించాలి.

   Delete
  2. నావీ అవే ప్రశ్నలండీ. దేవుడు గుండ్రంగా భూమినిచేసి నడుపుతున్నాడని, దానంతట గుండ్రంగా లేదని మీరెలా చెప్పగలిగారు. గ్రహాలు ఎలా క్రమంగా గుండ్రంగా మారుతాయన్నదానికి scientific explanation ఉంది. శాస్త్రవేత్తలు proto planetsని (తయారీలో ఉన్న గ్రహాలని) పరిశీలించి ఈ విషయాలను తెలుసుకోగలిగారు.

   మనిషి మరణం పుట్టుక్క మనిషి ఆధీనలో లేవు అనిమాత్రమే మనం ఖచ్చితంగా చెప్పగలం (నేనన్నది మళ్ళీ నూటికి నూరుపాళ్ళు నిజం కాదుకూడా) కాబట్టి మనిషి ఒక దేవుణ్ణి సృష్టించుకొని, దేవుణ్ణి ప్రార్ధించడంద్వారా మనిషిచేతిలో లేని విషయాలను indirectగా తనకు అనుకూలంగా మళ్ళించుకోవాలన్న భ్రమే మతం, వాటిని కొంతవరకైనా తాను తనకు అనుకూలంగా మళ్ళించుకోగలను అన్న సాంత్వనే మతం. ప్రస్తుతం ఆ భ్రమలోకి కొంత భయం, మరికొంత పాలిటిక్స్ కలవడంవల్లే సాంత్వననివ్వడానికిమాత్రమే ఉద్దేశ్యించబడతం ఏకైక సత్యంగా తనను తాను ప్రకటించుకుంటూ, మనుషుల మధ్య విభేదాలకు కారణమవుతుంది.

   actually నాస్తికవాదం మొట్టమొదటిది (primordial). మనిషి ప్రకృతిశక్తులగూర్చిన చేసిన ఊహలు మతాలయ్యాయి, వాటి విషయంలో అతనికున్న విశ్వాసాలు మతాలయ్యాయి. పుట్టిన పిల్లలనే చూడండి వాళ్లు చాలా inquisitivenessతో ఉంటారు. పుడుతూనే వాళ్ళు ఒకదేవుణ్ణి పూజించడం మొదలుపెట్టరు. చుట్టూ ఉన్న సమాజం(అంటే ప్రధానంగా తల్లిదండ్రులు) వారి ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పడం మానేసి, 'తెలీదు' అని ఒప్పుకోవడం అవమానకరంగా భావించి, తమ పెద్దలు తమకు చెప్పినవాటిని పిల్లల ముందు వల్లెవేస్తారు. సరిగ్గా ఇదేతంతు మానవ సమాజంలో ఆదినుంచి జరుగుతూ ఉండవచ్చుకదా? ఒకరి నమ్మకాలు fancibleగా ఉండడంవల్లనో, ఆనమ్మకాలున్నవారు influential అయినందువల్లనో, ధైర్యంగా ప్రవర్తున్నందువల్లనో, వేటాడడంలో గొప్ప నైపుణ్యం కలిగి ఉన్నందువల్లనో మిగతావారుకూడా ఆ నమ్మకాలను అలవర్చుకొని ఉండవచ్చుకదా? మతాలు ప్రస్తుత మానవజాతి అంతటి పురాతనమైనవడానికి ఎలాంటి archaeological evidence ఉందని నేను చదవకపోగ తద్విరుధ్ధంగా చదివాను.

   'ఆధ్యాత్మిక శాస్త్రవేత్త'లన్నమాట నాకు ఎంతమాత్రమూ అర్ధంకాలేదు. బహుశా మీ ఉద్దేశ్యం 'ఆధ్యాత్మిక సిధ్ధాంతకర్తలు' ఏమో.

   Delete
  3. త్రిశూల్ గారు మీరు వాదించే తీరు నాకు చాలా బాగా నచ్చింది.ఆ విషయంలో మిమ్మల్ని నేను మనస్పూర్తిగా అభినందించకుండా ఉండలేను.ఇక నా దృష్టిలో మతం వేరు, థర్మం వేరు.ఒకొక్క సందర్భంలో థర్మాన్ని కూడా మతంగానే పరిగణిస్తున్నారు నేటి ఆధునికులు.ఒక ముఖ్య విషయమేమిటంటే ఈరోజు మతం పేరుతో రాజ్యమేలుతున్నవి నిజ థర్మానికి వ్యతిరేకమైనవే!థార్మిక శాస్తాలలో ఉన్న థర్మం(లేక మతం) వేరు.నేడు చెలామణీలో ఉన్న మతం వేరు.దీనికి ,దానికి ఏవిధమైన పొంతన లేదు.శాస్తాలకతీతమైన మతం ఉనికిలోకి వచ్చింది కాబట్టే ఈరోజు నాస్తిక వాదానికి అడ్డు లేకుండా పోయింది.విపరీతంగా పెరుగుతుంది.శాస్త్రానుకూలమైన మతం లేక థర్మం మనిషి యొక్క మేధస్సును,సైకాలజీకి సైన్స్ కు అందుతుంది.నిజమని బలపర్చుతుంది.నేటి మూఢనమ్మకాలతోను,పిచ్చి,పిచ్చి సిద్ధాంతాలతోనూ ఉన్న మతం దేని విషయంలోనూ నిలబడలేదు.వీటి కారణంగా దేవుడు లేడనే వితండవాదం పెరిగిపోయింది.

   Delete
 27. నేను మీతో కనీసం ఒక్క విషయంలోనైనా అంగీకరించాలని ప్రయత్నిస్తున్నాను.

  "ఈరోజు నాస్తిక వాదానికి అడ్డు లేకుండా పోయింది.విపరీతంగా పెరుగుతుంది."
  "దేవుడు లేడనే వితండవాదం పెరిగిపోయింది."
  ఇది ఏవిధంగా తప్పు? నాస్తికత్వమేమీ పాపంకాదే! (మతాల మ్యానిఫెస్టోల్లో నాస్తికత్వం పాపమని ఉంటే ఉంటేమాత్రం అది పాపమైపోతుందా?). నాస్తికత్వవంవల్ల/హేతువాదంవల్ల మానవాళికి జరిగిన నష్టమెటువంటిది? దాన్ని ఏవిధంగా, ఎందుకు పాపంగా పరిగణించాలి?
  అసలు దేవుడు లేదనేది 'వితండవాదం' కాదు. ఎందుకంటే 'వితండవాదం' అంటే అవతలివారి ఎప్పుడూ తప్పని వాదించడం/ఋజువు చెయ్యడం (నాకు ఎరుకపడిన తర్కశాస్త్ర పరిజ్ఞాన ప్రకారం). ఎందుకంటే 1) దేవుడున్నాడన్నది ఒక వాదమైతే అది తననుతాను ఖండించుకొంటుంది. మీరన్నట్లుగా అది కేవలం నమ్మకం. 2) దేవుడు ఉన్నాడనడానికి proof లేనప్పుడు, ఆ profని 'dis' చెయ్యడం (dis-prove) ఎవరికైనా ఎలా సాధ్యం? అసలు dis-prooving లేనప్పుడు ఏవాదమైనా వితండమెలా అవుతుంది?

  "శాస్త్రానుకూలమైన మతం లేక థర్మం మనిషి యొక్క మేధస్సును,సైకాలజీకి సైన్స్ కు అందుతుంది"
  actually (ధర్మ)శాస్త్రాల(రామాయణం/కురాన్/బైబిలు) నీతిని నేడు ఎవరైనా 'నూటికి నూరుశాతం' అనుసరిస్తే, వాటిలో చెప్పినట్లునడచుకుంటే వాళ్ళు IPCలోని వేర్వేరు సెక్షన్లను ఉల్లంఘించినవారై, శిక్షార్హులౌతారు. IPCని కాస్సేపు ప్రక్కనబెట్టినా మన(భారతీయ) సమాజపు ఉమ్మడి నైతికత ('collective morality') ఆయా శాస్త్రాల్లోని విషయాలను నూటికినూరుశాతం ఒప్పుకొనే స్థాయికి ఇంకా చేరుకోలేదు (ఐర్లాండు, మధ్యప్రాచ్యము, భారతదేశంలోనే కొన్ని మత అతివాద ఫ్యాక్షన్ల మాట చెల్లుబడయ్యే సమాజాలను మనం ఇక్కడ ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి) may god (as you see I did invoke 'god' in different way) save us from such a fate/lot. మతాల్లో చెప్పిన విషయాలు సైకాలజీ అందుతాయి, కానీ సైన్సుకు కాదు (ఈ విషయమ్మీద నేను ఈ పాటికే విస్తృతంగా వ్యాఖ్యానించి ఉన్నాను. మీరు ఒకప్రక్క ఆ నా వ్యాఖ్యలను మెచ్చుకుంటూనే వాటిని పూర్తిగా బుట్టదాఖలుచేశారేమోనన్న అనుమానం నాకు మీ ఈ వ్యాఖ్యవల్ల కలుగుతోంది).

  "నిజమని బలపర్చుతుంది.నేటి మూఢనమ్మకాలతోను,పిచ్చి,పిచ్చి సిద్ధాంతాలతోనూ ఉన్న మతం దేని విషయంలోనూ నిలబడలేదు."
  మరొక్కసారి శ్రీకాంత్ చారి గారిదే ప్రేశ్న : "అస్థికులు కల్పించిన "పనికిమాలిన" సిద్ధాంతాలేవో కొన్ని [ధైర్యంచేసి] వివరించ గలరా?"
  ఏవి ప్రస్తుత మతాల్లో ఉన్న 'మూఢనమ్మకాలు', 'పిచ్చిపిచ్చి సిధ్ధాంతాలు' అని మీరనుకుంటున్నారు? మీరు కొన్ని ఉదాహరణలను ఇప్పుడైనా ఇస్తారా లేక diplomaticగా వ్యవహరించడానికే మొగ్గుచూపుతారా?

  ReplyDelete
 28. "మతం వేరు, థర్మం వేరు"

  నా ఉద్దేశ్యంలో: ధర్మం అన్నదానిని ఒక్కోమతం ఒక్కోలా నిర్వచిస్తుంది. అసలు ధర్మం అన్నమాటకే వాడుకలో వేర్వేరు అర్ధాలున్నాయి అది వేరే విషయం. అసలు ఒకేమతంలో వేర్వేరు కలాల్లో అదే ప్రవక్తలు/అవతార పురుషులు వేరు ధర్మాలను ప్రతిపాదిస్తుంటారు. ఉదాహరణకి రాముడి ధర్మమల్లా న్యాయమైనా, అన్యాయమైనా ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాట్రించడమైతే (ఇప్పుడు 'న్యాయం' అంటే ఏమిటి అనిమాత్రం నన్నడిగే ప్రయత్నం దయచేసి చెయ్యవద్దు), కృష్ణుడుమాత్రం న్యాయానికి భంగం కలిగినప్పుడు (=తననుకున్న ధర్మానికి నష్టంవాటిల్లినప్పుడు) ధర్మాన్ని (ఇక్కడ 'ధర్మం' అన్నమాట ఇంకో అర్ధంలోవాడబదింది) కాసేపు ప్రక్కనబెట్టి దాన్ని సవరించేపని పెట్టుకుంటాదు. జీసస్ మోషే ధర్మశాస్త్రాన్ని బుట్టదాఖలుచేసి ప్రేమనే ధర్మంగా నెలకొల్పుతాడు. మహమ్మద్ ధర్మం గురించి, సహనం గురించి చెప్పేమాటలు అవిశ్వాసులను జయించిన తరువాత (ఈ కాలంలో మహమ్మద్ బోధించిన ధర్మాన్ని ఇస్లాంలోని మితవాదులు ఎక్కువగా quote చేస్తుంటారు) ఒకరకంగానూ, జయించక ముందు(ఈ కాలంలో మహమ్మద్ చెప్పిన ధర్మాన్ని తీవ్రవాదులు ఎక్కువగా quote చేస్తుంటారు) ఇంకొకరకంగానూ ఉంటాయి.

  అసలు ధర్మన్న పదానికున్న లెక్కకుమిక్కిలి నానార్ధాలు ఈ confusionకి కారణం -అని నా అభిప్రాయం.

  ReplyDelete
 29. Actually I am moving on... I guess even I am making a fool of myself trying to explain/argue things over and over again when it's clear no one is heeding to them.

  Humans have less need for bitter truth. What they need is a comforting lie that makes them appear special in the Universe. Apparently religion does this. It just makes it's followers appear bigger, greater, super human and dearer to the some nonexistent keeper of the universe than those that doesn't follow. Besides that it's really hard to follow scientific advances while it is easy to assume that which is written in those books is science (sans proofs though) and then feel proud of having access to the secrets of the universe.

  Greetings!

  ReplyDelete
 30. ఆల్జిబ్రాలో (a+b)2 అని ఉంటుంది కదా. అందులో a b ల విలువలు తెలియదు. అందుకే వాటిని a అని b అని అంటారు కొందరు x,y,z అని కూడా అంటారు. లెక్క తరవాత వచ్చే విలువకి ఇప్పుడు ఉన్న a,b లకి ఏమీ సంబంధం లేదు. విలువని తెలుసుకోటానికి అక్కడ ఎదో ఒకటి పెట్టి ముందుకెళ్లాలి కాబట్టి అక్కడ a,b లు పెడతారు.

  అసలు విషయంలోనికి వస్తే ఆ a,b లు దేవుళ్ళు కావు...అయితే విలువని తెలుసుకోటానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు...అందుకని a,b లతో పనిలేదు అని అనద్దు...అలాగే a,b లే అసలు విలువలు అని కూడా అనద్దు... కొంచం కన్ఫుజనుగా అనిపించినా...పైన పెద్ద ఎత్తున వాదనలు చేశారు కాబట్టి అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నాను.

  ఇకపోతే పై దేవుళ్ళ మాటేమో కానీ, వాదనలలో పడి వ్యక్తిగత దూషణలు లేక ఒకరు ప్రతిపాదించిన వాదనని మరొకరు అవమానించటం చెయ్యకుండా ఓపిగ్గా లెక్క చేస్తే నిజమైన ఆన్సరు రావచ్చును :)

  ReplyDelete
 31. ఈ చర్చను అతి సన్నిహితంగా అనుసరిస్తున్నవాళ్ళలో నేనొకర్ని.

  a, bల విలువలు తెలీకకాదు వాటినివాడేది. దాన్ని abstraction అంటారు. a, bల విలువలు ఏవైనా ఆ formula నిజమౌతుంది అని అల్జెబ్రా చెబుతుంది. కొంచెం బుర్రవాడితే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు.

  ReplyDelete
  Replies
  1. మతాల నుండి ఆల్జీబ్రా లోపలివరకు దూరి మీ తెలివితేటలని బాగానే చూపించారు SREE NAADHగారు. అవన్నీ తెలియక కాదు. ఉదాహరణకి చెపితే వెనకటి మీలాంటి వారొకరు రేపు ఆదివారం అంటే; వెంటనే వారాల లిస్టు చదివేశాడుట. రేపు ఆది వారం అంతే వచ్చే ఆదివారం అని ఇప్పుడు మీకు తప్పకుండా వివరించాలిసిందే, లేకపోతే మీ భాషలో బుర్ర వాడకపోతే తెలియదు. బహుశా పైన చర్చల దుష్ఫలితం మీకు "బుర్రలేని తనం" వచ్చి ఉంటుంది. మీ తప్పేమీ లేదు. అయితే అక్కడ మీరు బాగా బుర్ర ఉపయోగించి ఉండి ఉంటే నేను ఇచ్చిన ఉదాహరణలో పై దేవుడు ఉన్నాడు లేక లేడు అనేదానికి సమాధానం వచ్చి ఉండేదేమో.

   రెండవ పేరా కూడా చదివే ఓపిక ఉండి ఉంటే ఇలాంటి కామెంటు పెట్టేవారు కాదు. ఎవరో తెలియని వారి మీదకి ఇలా కామెంటు పెట్టేవారు కాదు. ఒకటి నిజం. రోడ్డు మీద గొడవ జరుగుతుంటే మధ్యలో దూరితే కత్తిపోట్లే. కానియ్యండి. తప్పు జనాలని రెచ్చగొట్టి కాలక్షేపం చేసే బ్లాగుని మైంటెన్ చేసేవారిదే.

   Delete
  2. BHAARATIYAVAASI గారు మీరు విషయాన్ని మాత్రమే చర్చించాలని సూచన.దయచేసి ఏ విధమైన వ్యక్తిగత విమర్శలు వద్దని మనవి.ఉన్న విషయాన్ని లోతుగా నల్గురూ చర్చించి నిజానిజాలు తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే ఈ బ్లాగు యొక్క ప్రధాన లక్ష్యం. దయచేసి అర్ధం చేసుకోండి చాలు.యధా మీకు చర్చలోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము.

   Delete
  3. BHAARATIYAVAASI

   Your example was limited. You could never prove god in an algebraic way. Even an example in this matter was useless.

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్