Breaking News

ఆడవారిపై అత్యాచారాలను నిరోధించాలంటే ఏమి చెయ్యాలి?

పై ప్రశ్నను పంపినవారు: తిరుపతిరావు -ఖమ్మం.

24 comments:

 1. చాలా చేయాలి. ముందు ఆడవారిలో తాము అబలం కామనే చైతన్యం స్థైర్యం పెంచాలి. వారు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబం - సమాజం - ప్రభుత్వం అన్ని రకాల ఏజెన్సీలు ఆ పనిని చేయాలి.

  ReplyDelete
 2. చిన్న పిల్లలు బూతులు మాట్లాడటం అవి ముదిరి ఇలాంటి అఘాయిత్యానికి దారి తిస్తూన్నాయని నా అభిప్రాయం
  మునుపే నేను రాసిన పోస్ట్ చూడగలరు

  బరితెగిస్తున్నబూతు
  http://gavidipydinaidu.blogspot.in/2014/11/blog-post_10.html?m=1

  ReplyDelete
 3. చేయాల్సిన అనేక పనులలో పాశ్చాత్య కల్చర్ వదిలి పెట్టి ముందు స్త్రీలు భారతీయ కట్టుబొట్టు అవలంభించాలి.

  ReplyDelete
  Replies
  1. అంతకంటే ముందు పురుషులు చక్కగా పంచె కట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. వెక్కిరించడానికి కాదు స్త్రీలే మారాలి అని పట్టు పట్టడం ఎందుకన్న ప్రశ్నగా తీసుకోండి.

   Delete
  2. పురుషులు అప్పుడైనా,ఇప్పుడైనా నిండుగానే బట్టలు వేసుకుంటున్నారు.స్త్రీల అప్పటి వస్త్రధారణకి,ఇప్పటి వస్త్రధారణకి అసలు సంబంధం లేదని మనకందరికీ తెలుసు. పై కామెంట్ కేవలం దానిని ఉద్దేశించి మాత్రమే1 ఇక పోతే స్త్రీలను ఆవిధంగా(అర్ధనగ్నంగా) చూడాలని ఉబలాటపడేవారికి, పాశ్చాత్యకల్చర్ రుచి చూస్తున్నవారికి నా మాటలు రుచించవు.

   Delete
  3. మీ మొదటి వ్యాఖ్యలో "భారతీయ కట్టుబొట్టు" గురించి ఉంది. ఇప్పుడు దాన్ని "నిండు"గా మార్చారు. సరే అట్లే కానిండు.

   మొగవారు టీ-షర్టులు జీన్స్ (నిండుగా సుమండీ) వేసుకుంటే మీకు ఒకే అనుకుంటా. స్త్రీలు కూడా అంతే నిండుగా టీ-షర్టులు జీన్స్ (లేదా షర్టులు-పాంట్స్) వేసుకుంటే ఇబ్బంది ఉండదని ఆశిస్తా.

   Delete
  4. ఆడా,మగా ఏమాత్రం తేడాలేని కల్చర్ ప్రాశ్చాత్యకల్చర్.నిజానికి మన భారతావనిలో చాలా చక్కని డ్రెస్ కోడ్ మన స్త్రీలది.మగవాని బట్టలు స్త్రీలు తొడిగినంతమాత్రాన నిండిదనం రాదు,గౌరవం కలగదు.నేను దానిని ఉద్దేశించే "కట్టు,బొట్టు"అని చెప్పాను.స్త్రీలపై జరిగే అత్యాచారాలకు ఒక కారణం నేటి స్త్రీ ధరించే అర్ధనగ్నపు వేషధారణ ఒకటి అని చెప్పడమే నా ఉద్దేశ్యం అని గమనించండి జైగారు.

   Delete
  5. వస్త్రధారణలో ఇలా ఉండాలి అని రూల్ పెట్టలేము. మన సంస్కృతిలో వస్త్రధారణ అన్నప్పుడు జై గారు చెప్పినట్లు మగవాళ్లలోనూ మార్పులొచ్చాయి. కేవలం వస్త్రధారణే కారణమైతే పల్లెటూర్లలో మంచి సాంప్రదాయబద్ధంగా ఉన్న అబలలపై కామాంధుల ఆగడాలు ఎందుకు జరుగుతున్నాయో మీరు ఆలోచించాలి తప్పకుండా? అలాంటప్పుడు ముందు సినిమాలలో జరుగుతున్నవాటిని అదే చూపిస్తున్నవాటిని నియంత్రించాలి. వస్త్రధారణ ఆడవాళ్ల అందాలను ఆరబోయడానికి , పురుషుడిని రెచ్చగొట్టడానికి చేస్తే తప్పే. న్యూసెన్స్ క్రియేట్ చేయడం వేరు డ్రెస్ కోడ్ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనుకునే ఆలోచనలు వేరు. ఇలాంటి ఆలోచన చాలామందికి ఉన్నదని చాలా చర్చలను బట్టి అర్ధమవుతున్నది. ఆడవారిపై అత్యాచారాలకు అసలు కారణాలను వెతకడానికి విపరీతార్ధాలు లేదా తప్పుడు అర్ధాలు వెతకడానికే ఈ అలోచనలు ఉపయోగపడతాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఓ ఆలోచన తప్పుగా మనం ఆలోచిస్తుంటే దానిని సరిచేసుకునేందుకు పాజిటివ్ గా ప్రయత్నించాలని మనవి.

   Delete
  6. భారతావనిలో చాలా చక్కని డ్రస్ కోడు"లు" ఉన్నాయి. మగవారు పంచెకట్టు అనే తమ ఆచారాన్నిఎప్పుడో తాతల కాలంలో వదిలేసారు. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు మరి మహిళలు మారితే మాత్రం అంతే లిబరల్గా ఎందుకు తీసుకోరు?

   అత్యాచారాలు చేసేదే పురుషులు, స్త్రీలు ఈ విషయంలో విక్తిమ్. తాము చేసిన పాపానికి బాధ్యత తరలించే క్రమంలో భాగమే ఈ వాదన. Blaming the victim for the crime is nothing but guilt transposal.

   Delete
  7. స్త్రీలు వస్త్రధారణ విషయంలో జాగ్రత్త వహించాలనే ఉద్దేశ్యమే తప్ప మరేమీ లేదు. కామాంధులైన రాక్షస వెధవలను సమర్ధించడం లేదు.జైగారు నా వాదనను ప్రక్కదారి పట్టిస్తున్నట్లు అనిపిస్తొంది.

   Delete
  8. మీకు దురభిప్రాయముండదని తెలుసు కానీ మీ నోటినుండి వచ్చే మాట చర్చలో తప్పనిసరిగా మీరు ఇతరులకు నేర్పేదైనా కావాలి. మీరు నేర్చుకునేదైనా కావాలి. మీరు డ్రెస్ కోడ్ విషయంలో దురభిప్రాయంతో చెప్తారని కాదు కానీ అత్యాచారాలకు డ్రెస్ కోడ్ అనేది కారణం కాదు.

   Delete
  9. నేటి ప్రాశ్చాత్య కల్చర్ కలిగిన డ్రెస్(శరీర అంగాలు ప్రదర్శించే ఫ్యాషన్ డ్రెస్సుల గురించి మాత్రమే)అనేది కూడా అనేక కారణాలలో ఒక కారణం మాత్రమేనని నా అభిప్రాయం సర్!

   Delete
 4. మనుషుల్లో అతి ఏర్పాటు కాకుండా జాగ్రత్త పడటం నేర్పించాలి.. ఈ పైడి నాయుడికి & కే ఎస్ చౌధురికీ అన్ని మాటలూ నేర్పించాలి, అన్ని రుచులూ చూపించాలి. అందుకు పైనున్న ఇద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి..

  ఎందుకు అని అడిగితే చెప్తాను..

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్ నేను సీరియస్ గా తీసుకోలేదు.రచ్చబండ ఇతరుల కామెంట్లను వ్యక్తిగత దూషణకు టార్గెట్ చేస్తే అటువంటి కామెంట్లు డస్ట్ బిన్ కి వెళ్లిపోతాయి.అయినప్పటికీ మీరు మమ్మల్ని అనడం ఎందుకో మరి..చెప్పండి కాయగారు.?

   Delete
 5. కాయ గారు రాస్తే చదవాలని ఉంది
  మి నుంచి ఎమైనా నేర్చుకోవచ్చెమో కదా.

  ReplyDelete
 6. ఆశ కి అవకాశం దొరికితే వదిలి పెడుతుందా??

  భారతీయత, వినయ విధేయతలు అనే రంగుల బట్టలేసుకున్న మీ ఇద్దరికి ఇలాంటి అవకాశం వస్తే ఇలానే మాట్లాడతారు.

  వస్త్ర ధారణ, చదువు, కులం, గోత్రం లలో భారతీయత ఉంటేనే మనుషులు తప్పులు చేయకుండా ఉంటారా ?
  ఇంతకీ ఈ భారతీయ విధానాలు సమాజం లో అందరికీ అందుబాటులోకి వచ్చాయా?

  అసలు ఏమిటి భారతీయత ?

  ReplyDelete
  Replies
  1. కాయగారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తొంది తప్ప చెప్పే విశేషం ఏమీ కనిపించడం లేదు.

   Delete
 7. కెఎస్ చౌదరి గారూ, కొండలరావు గారు చెప్పినట్టు నిండుగా బట్టలు వేసుకున్న గ్రామీణ మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు ఆకేశేపణ తెలిపే బట్టలు వేసుకొనే పాశ్చాత్య దేశాలలో అత్యాచారాలు మనకంటే ఎంతో హెచ్చు రెట్లు ఉన్న దాఖాలాలు లేవు.

  అంచేత ఒకవేళ వస్త్రధారణ సమస్యకు కారణం అయినా కూడా, దాని ప్రభావం అరకొర మాత్రమె. దాన్నే ఫోకస్ చేస్తూ ఉంటె సమస్య మూలాలకు పోలేము.

  అత్యాచారం మూలాలు ఆధిపత్యంలో ఉంటాయి. పురుషులే గొప్ప స్త్రీలు ఎందుకూ పనికి రారు అన్న ధోరణి ప్రబలంగా ఉన్నంత కాలం వీటిని ఆపలేము. ఈ వాక్యంలో "పురుషులు" బదులు అగ్రవర్ణాలు, "స్త్రీలు" బదులు దళితులు అంటూ మార్చినా నిజం అలానే ఉంటుంది.

  సమస్యకు ఒకటే పరిష్కారం: ఆధిపత్యాన్ని అంతం చేసి సమానత్వాన్ని పెంపొందించడం. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు చిన్నపటి నుండే సమానత్వం నూరిపోస్తే కొన్నాళ్ళకు పరిస్తితి కొంత మెరుగు పడవోచ్చు.

  ReplyDelete
 8. బాగుందండి, ఇంకాస్త చేర్చాలి, పని చెయ్యకుండా ఉండే వారిని పని చేసేటట్టు చెయ్యాలి!
  దాంతో కొంచం ఆ భావం నుంచీ బయట పడతారు!
  ఇక వస్త్రధారణ కూడా కారణం, మరి పూర్తిగా బట్టలు కట్టుకున్నా ఎలా జరుగుతున్నాయి అన్నారు, కారణం కామం రెచ్చగొట్టే బట్టలు వేసుకున్న వాళ్ళను చూసి ఎవరైనా అదే వస్తువు అని కోరిక తీర్చు కుంటున్నారు.
  ఇక చివరిగా రాత్రిళ్ళు ఒంటరి ప్రయాణాలు మానాలి!

  ReplyDelete
 9. బాగా బలిసిన వాళ్ళే రేపులు చేస్తున్నారా ఏమిటి. ఢిల్లీ లో వలస కూలీలే కదా చేసేది.. రాక్షస రాజ్యంలో అకృత్యాలు సహజం. జీవించటమే దుర్భరం అయినప్పుడు, సహజం గా, సమాజానికి నచ్చేలా వాంఛలు తీర్చుకోవటానికి వారేమీ సమాజానికి జవాబు దారులు కారు కదా.. ఈ సమాజం వారి అన్ని ప్రశ్నలకి పరిష్కారం చూపించలేదు.

  వ్యవస్థకు దృష్టి తమని తాము గొప్పగా చూపించుకోవాలనే ఉంది కానీ, సమస్య మూలాలను వెతకాలనీ, పరిష్కారం చేయాలనీ లేదు. ఎందుకంటే కొంతమంది అజ్ఞాన చక్రవర్తులు మేము ప్రశ్నిస్తాం, పొడిచేస్తాం అంటూ ముందుకు వస్తున్నారే కానీ, తమ ముందున్న పనినే సక్రమంగా చేయట్లేదు.

  ఒక పువ్వు పరిమళం తన చుట్టూ విస్తరిస్తుంది.. ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నవి అంటే అక్కడ పువ్వులు కాదు.. మంటలున్నాయని అర్థం చేసుకోవాలి కానీ, అమాయకం గా మంటలను ఊదేస్తాం అంటే ఆరిపొతాయా.. ఎగజిమ్ముతాయా..

  ReplyDelete
  Replies
  1. కాయగారు మీరు ఎవర్ని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారో అర్ధం కావడం లేదు.బలిసిన వాళ్లే అత్యాచారాలు చేస్తున్నారని పైవారు ఎవరూ అనలేదు.ఒకవేళ మీరు జైగారన్న అగ్రవర్ణాలు మాటనుద్దేశించి అలా అన్నారా? ఏమిటి?

   Delete
 10. అవును. అగ్రవర్ణాలు/బలిసిన వాళ్ళు.. నేను టాపిక్ పై మాట్లాడుతున్నానే. ఎవరికీ జ్ఞానోదయం చేయించాల్సిన పని నాది కాదు, దేవుడిది.

  ReplyDelete
 11. To talk of rapes, and only rapes - is kinda focussing on one single aspect of a multi dimentional problem. మన దేశపు సమస్య మానభంగాలు కాదు. ఇతరుల స్వేచ్ఛనీ ఇష్టాయిష్టాల్నీ గౌరవించని తనం. మానభంగం అంటే ఏంటి? ఒక స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతంగా ఆమెతో గడపడం. అయితే ఈ బలవంతాలనేవి మన దేశంలో కేవలం శృంగారం విషయంలోనే కాదు. అన్ని రంగాల్లో అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లోనూ చాలా మామూలు. ఆ ధోరణే మానభంగాల్లో కూడా ప్రతిఫలిస్తోంది తప్ప దానంతట అది ప్రత్యేక సమస్య కాదు. విడివ్యక్తుల్నీ, వారి ఇష్టాయిష్టాల్నీ గౌరవించడం, వారి వ్యక్తిగత గోప్యతనీ, ఇతర హక్కుల్నీ గౌరవించడం ప్రభుత్వానికే చేతకావడం లేదు. ఇంక ఏ మొహం పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులు వాటిని గౌరవించాలని డిమాండు చేస్తాం? అందులోనూ పురుషుల మీద ఆధారపడి ఉన్న లింగజాతి విషయంలో?

  మగపిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా పెంచితే వారికి హింసాప్రవృత్తిని నేర్పనివాళ్ళమవుతాం. మగపిల్లల్ని ప్రేమగా పెంచడం మానభంగాల సమస్యకు గల పరిష్కారాల్లో ఒకటి.

  ReplyDelete
  Replies
  1. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ హింసకు గుఱికానివాళ్లు స్వయంగా అందుకు దిగడానికి సంకోచిస్తారు. ఒకఱిని బాధించడం వారికి హింస నేర్పడమే అవుతుంది. కాబట్టి మగవారి పట్లా/ మగపిల్లల పట్లా ఏ విషయంలోనూ దయాదాక్షిణ్యాలు చూపించని ప్రస్తుత సామాజిక వాతావరణం సమూలంగా మారాల్సి ఉంది. వారిని కూడా దయగా చూసుకోగలిగినప్పుడు మనకి ఆడవాళ్ళ గుఱించి ప్రత్యేకంగా వర్రీ అయ్యే అవసరం తగ్గిపోతుంది.

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్