Sunday, September 23, 2018

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Interracial marriages and religious marriages are beneficial? Dangerous?

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా?

27 comments:

 1. కులాలు, మతాలు చచ్చిననాడు వాటినుంచి ఒచ్చే ప్రమాదాలు చచ్చినట్టే...

  కనీసం.... కులాలు, మతాలు అనేవి కొందరు మానసిక రోగుల ఆనందంకోసం తప్పితే ఇంకెదుందుకూ పనికిరావు అని తెలుసుకున్నా చాలు. కానీ ఇదే మానసిక రోగులు వాటిని చల్లారకుండా చూసుకుంటు ఉంటారు..

  ReplyDelete
  Replies
  1. వ్యక్తి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ఒకరు కులాంతర వివాహం చేసుకున్నారనో, మతాంతర వివాహం చేసుకున్నారనో ఆ వ్యక్తిని మర్డర్ చేసే అధికారం ఎవరికీ లేదు. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఒకే కులంవాళ్ళే కానీ వాళ్ళ ఇంటి పేర్లు ఒకటి కావడం వల్ల వాళ్ళ బంధువులు వాళ్ళ పెళ్ళిని చూసి నవ్వుకున్నారు. అలా నవ్వకూడదనీ, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో దూరే హక్కు వేరేవాళ్ళకి లేదనీ నేనే వాళ్ళ బంధువులకి చెపుతుండేవాణ్ణి.

   Delete
  2. తన ఇంటి పేరు గల వ్యక్తినే పెళ్ళి చేసుకున్న ఆ స్త్రీ పంచాయితీ ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అయ్యింది. ఆమె బంధువులు ఆమె చూస్తున్నప్పుడు మాత్రం ఆమె గురించి మంచిగానే మాట్లాడుతారు. ఆమెకి తెలియకుండా వెనుక నుంచి ఆమె గురించి చెడుగా మాట్లాడుతారు. పరువు పేరు చెప్పుకునేవాళ్ళలో ఇలాంటి ముసుగు వీరులు చాలా మంది ఉంటారు.

   Delete
 2. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తతంగం. దానికి కులం/మతం వగైరా అంటకట్టడం ఎందుకు?

  ReplyDelete
  Replies
  1. Jai Gottimukkala గారు అంటగట్టడం ఏమిటి? మన దేశంలోనే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో నూటికి 90% పైగా కులమూ, మతమూ చూసే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వేరే కులమోన్ని చేసుకుంటే ఆ కుటుంబాలలో ఒకటే గొడవ. ఇది ఎంతకైనా తెగిస్తుంది.

   Delete
  2. నేను చెప్పదలిచింది సరిగ్గా రాయలేదనుకుంటా.

   వధూవరులను వ్యక్తులుగా చూడడమే కరెక్ట్. వారి కులం/మతం వగైరాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

   షరామామూలుగా మీ టపా శీర్షిక నాకు నచ్చలేదు! నేనయితే ఈ ప్రశ్నను "వధూ వరుల కులం/మతం వేరే అన్న *ఒకే ఒక్క* కారణం వలన ప్రయోజనం లేదా ప్రమాదం ఉంటుందా?" అని అడిగే వాడిని.

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
 3. హరిబాబు గారు ఒక మాట అన్నారు.వీడియో తీసి తండ్రిని రెచ్చగొట్టింది అని.చిరంజీవి కూతురు ఆర్య సమాజ్ లో పెళ్ళిచేసుకుని మీడియాలో ప్రచారం కూడా చేసుకుంది.అదే చిరంజీవి కూతురికి మళ్ళీ అట్టహాసంగా పెళ్ళిచేసి జనానికి చూపించారు. ఆ వీడియోతోనే ఈ సంస్కృతి మొదలయ్యింది.చిరంజీవికి కోపం లేదా ? పరిస్థితులను అంగీకరించడం అందరూ చేయలేరు.ఆధ్యాత్మికత అంటే ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడమే !
  అంబానీ కూతురు నిశ్చితార్ధం ఎక్కడో నిరాడంబరంగా జరుపుకోవలసిన అవసరం ఏమిటీ ? డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా ఖర్చుపెట్టాలి అన్న విషయంలో ఒక క్లారిటీ ఉండబట్టే కదా ?

  ఈ వీడియో చూస్తే మీ కన్నీళ్ళు ఆగవు,ఈ వీడియో చూస్తే మీకు మతిపోతుంది, ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ ఓం ఫట్,గరం చాయ్ అంటూ యూట్యూబ్ చానెల్స్ రకరకాల చెత్త తెచ్చి వదులుతారు.అటువంటి వాటిని చూసి వారికి ఆదాయాన్ని పెంచకండి.మనం ఎంతమంది చూస్తే వారికి అంత ఆదాయం వస్తుంది. చక్కటి ముగ్గులు, మెహందీ డిజైన్లు,పనికిరాని వస్తువులను అందంగా ఎలా తయారుచేయవచ్చు, బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవడం, విద్యా సంబందమైన పెయింటింగులు, లెక్కలు, గ్రామర్ మొదలైన వాటిని చూసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.జపాన్ వాళ్ళు చూడండి పువ్వులతో కళాకృతులు చేస్తారు. మనచుట్టూ సమాజం నుండి మనమేమి నేర్చుకుంటున్నాం అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి.

  ReplyDelete
 4. అమ్మాయి చదువైపోగానే, పెళ్ళి తప్ప ఇంకో ఆలొచన చెయ్యలేని తల్లిదండ్రులకి ఎవ్వడేం చెబుతాడూ? ఎవడో ఒక గొట్టంగాడు ఎక్కడో పని చేస్తున్నాడని.. ఈ అమ్మాయిని ఉన్న ఉద్యోగం మాంపించి.. అక్కడికి వెల్లాక... ఆ గొట్టంగాడు చెయ్యమంటే జాబ్ చెయ్యాలి.. లేదంటే కూరలు చెఉసుకుంటూ అంట్లు కడుక్కోవాలి.. అలాంటీ అమ్మాయిల తల్లిదండ్రులని... ఎంత చెత్తగాల్లనాలి?? మొగిడికిచ్చే కట్నం డబ్బు.. బాంకులో వేసుకుంటే.. వొచ్చే వడ్డీతోటే కాలు మీద కాలేసుకోని తన కూతురు బతకగలదు అని తెలియని ఈ తెలివితక్కువ తండ్రికి ఎవడేం చెప్పగలడూ?

  "కూతురు పుట్టిందా, చదివిందా, పెళ్ళిచేసుకుందా, పడుకుందా, పిల్లల్ని కనిందా... అంతే..తను మనిషిమాత్రం కాదు."

  ReplyDelete
  Replies
  1. మొగిడికిచ్చే కట్నం డబ్బు.. బాంకులో వేసుకుంటే.. వొచ్చే వడ్డీతోటే కాలు మీద కాలేసుకోని తన కూతురు బతకగలదు అని తెలియని ఈ తెలివితక్కువ తండ్రికి ఎవడేం చెప్పగలడూ?
   అదరగొట్టారు చిరంజీవిగారు! నాకు తెలిసిన సంఘటనలు రెండు ఉన్నాయి. ఒక తండ్రి 15లక్షలు కట్నం ఇచ్చి తన కూతురికి పెళ్లి చేసాడు. పెళ్లి జరిగి సంవత్సరం దాటకుండానే గొడవల మీద మళ్ళీ పుట్టింటికే వచ్చేసింది. ఇలా వెళ్తూ, వస్తూనే ఉండేది. ఆమె భర్త త్రాగుబోతు, సైకోగాడు. కొన్నాళ్ళకు ఆదరించే తండ్రి చనిపోతే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయా పనిచేస్తూ బ్రతుకీడుస్తోంది.ఇంచుమించు ఇటువంటిదే రెండో సంఘటన కూడా! కట్నం ఇచ్చి పెళ్లి చేసేయడం, వచ్చిన భర్త సైకో వెధవ అయితే పాపం ఆ అమ్మాయి నరకం చూడటం.ఛ...చాలా దారుణాలే ఉన్నాయి.

   కట్న వ్యవస్థ పూర్తిగా పోవాలి. తల్లి,దండ్రులలో ఆడపిల్లను వదిలించేసుకోవాలి అనే దిక్కుమాలిన ఆలోచన చావాలి.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. ఆడవాళ్ళు కూడా వ్యాపారం చెయ్యొచ్చు కదా. నేను ఇప్పటి వరకు ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్లు, ఫ్యాన్సీ దుకానాలూ నడపడం చూసాను కానీ ఆటోమొబైల్స్, తుపాకులు లాంటి వ్యాపారాలు చెయ్యడం చూడలేదు. బషీర్‌బాగ్, అబిద్స్, కోఠీలలో ఉన్న గన్ డీలర్స్‌లో ఒక్క మహిళా గన్ డీలరైనా ఉందా?

   Delete
  4. రాఫేల్ డీలర్షిప్ ఇప్పిస్తావా ప్రవీణ్..
   అబిడ్స్ లో గన్నులు ఎక్కడ దొరుకుతాయి?
   నిజం గన్నా ? పిట్టలను కాల్చే గన్నులా ?
   పిట్టలను కాల్చే గన్నుతో మనిషిని చంపితే చస్తాడా ?

   Delete
  5. @ Niharika

   చెట్టుకింద కూర్చోడం తప్పితే ఇక ఆడపిల్లలకి వెరే పనేమీ చాతకాదనా మీ ఉద్దేశ్యం?

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. >>ఎంత సంపాదిస్తున్నావు అని ఆడపిల్లలు డిమాండ్ చేస్తున్నారు

   పెళ్ళైంతవరకే వాళ్ళ డిమాండ్లు.. అది కాస్తా ఐపొయాక "పాత సినిమా పాటలు".

   "నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను.. నువ్వు అక్కడ మానేసి ఇక్కడ జాబ్ చూసుకో" అనేంత సీనుందా ఏ అమ్మాయికైనా ?

   Delete
  8. I have seen 2 gun shops nearby Abids. They are Ghouse and Maroof. For pepper sprays, I visit Visakha Arms, on Asilmetta - Waltair Road in Vizag.

   కట్నాలు విషయానికి వస్తే వాళ్ళు డబ్బున్నవాడికే కట్నం ఇస్తారు, డబ్బున్నవాడే కట్నం కోసం హెరాస్ చేస్తాడు.

   Delete
  9. "నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను.. నువ్వు అక్కడ మానేసి ఇక్కడ జాబ్ చూసుకో" అనేంత సీనుందా ఏ అమ్మాయికైనా ?

   బాబూ చిట్టీ... ఇలా కూడా జరిగింది బాబూ !
   (శ్రీలక్ష్మి స్టైల్ లో)

   Delete
 5. కులాంతర వివాహం ఎందుకు అని డైరెక్ట్‌గా అడక్కుండా నైన్‌త్ క్లాస్‌కే లవ్వేమిటి అని అడిగేవాళ్ళకి నా ఉపదేశం: తాను వ్యాపారం చేస్తాననీ, దానికి చదువుతో పెద్ద పని లేదనీ ప్రణయ్ చెప్పుకుంటే ఏమి చేస్తారు? నాకు తెలిసిన ఒక రైల్వే ఉద్యోగి కొడుకే ఉద్యోగం దొరక్క కంప్యూటర్లు రిపెయిర్ చేసుకుని బతుకుతున్నాడు. అతనికి పెళ్ళయ్యింది, కాకపోతే పిల్లలు లేరు. అతని భార్య గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నదా లేదా అనేది నాకు తెలియదు కానీ గర్భ నిరోధక మాత్రలు కావాలనుకుంటే గవర్నమెంట్ నర్స్ అవి ఫ్రీగా ఇస్తుందని నాకు తెలుసు. మీరు చదువు గురించి ఎంఫసిస్ ఇవ్వాలనుకుంటే బతకడానికి గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటే మార్గమని నమ్మేవాళ్ళ దగ్గర ఆ ఎంఫసిస్ ఇవ్వొచ్చు.

  అమృత తండ్రి రియల్ ఎస్టేట్స్ వ్యాపారి. ఆమె పల్లెటూరి సంతలో వ్యాపారం చేసే కోమటివాణ్ణి తన కులంవాడే కదా అని పెళ్ళి చేసుకోదు. ప్రణయ్ కూడా ఆర్థికంగా ముందున్నవాడే. అతను కూడా మాల వీధిలో నివసించే అమ్మాయిని కులాన్ని చూసి పెళ్ళి చేసుకోలేడు. అమెరికాలో కులాలు లేవు. వాళ్ళు స్టేటస్‌ని చూసే పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ కులాలు ఉన్నా అమృత, ప్రణయ్‌లు కులాల గురించి పట్టించుకోలేదు. అంతే, ఆ నిజం ఒప్పుకోలేక వాళ్ళ చదువు గురించి మాట్లాడుతున్నారు.

  ReplyDelete
 6. మారుతిరావు సప్పోర్టర్స్! "ప్రేమకు మీరు వ్యతిరేకమా? లేక తక్కువ కులం వాడ్ని ప్రేమించడానికి వ్యతిరేకమా?"

  ReplyDelete
  Replies
  1. అత్యధిక వ్యతిరేకం కులం తక్కువ వాడిని ప్రేమించనందుకే.నిజానికి మారుతిరావు చేసిన హత్య వెనుక అసలు కారణం అదే కదా!

   Delete
  2. మారుతీ రావు సప్పోర్టర్స్ ఆమాట చెప్పుకోని బలపరచాలి.. లేదా తమలో ఎవ్వడూ లవ్ మారేజ్ చేసుకోలేదని నిరూపించుకోని అప్పుడు అతని వెనకుండాలి

   Delete
  3. మారుతీరావుకి నా సానుభూతి ఉంది.
   నేను ప్రేమ వివాహాలు నమ్మను.
   నా కులాన్ని నేను ప్రేమించుకుంటాను.
   నా మతాన్ని నేను గౌరవించుకుంటాను.
   ఎవరినీ తక్కువగా చూడను.

   Delete
 7. అప్పటిదాకా హిందూ మతంలో ఎస్ సీ రిజర్వేషన్ అనుభవించిన దళితుడు... క్రిస్టియానిటీలోకి మారగానే బిసిగా ఎలా మారతాడు? అంటే తప్పు మతంలోనే ఉంది అని ఒప్పుకున్నట్లేకదా? నీకు హిందూ మతంలో గౌరవం ఉండదు.. క్రిస్టీయానిటీలోకి వెల్లాక అక్కడ నీకు గౌరవం ఉంది కాబట్టి రిజర్వేషన్ తగ్గిస్తున్నాం అని తీర్మానించినట్టేకదా?

  కాబట్టి మారాల్సింది మనిషికంటే ముందు మతం. హిందూ మతం ఇవ్వలేని గౌరవం ఇంకో మతం ఇస్తున్నప్పుడు.. అక్కడికి వెల్లే వాల్లందర్నీ... "డబ్బుకోసం వెల్లారు" అని నిందలేసేవాల్లని ఏమనాలి?

  దీనికి హిందూమతంలో "సైకోలకి నచ్చని పరిష్కారం" ఒకటుంది.. గుల్లల్లో పూజారులుగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చి నియమించగలిగితే.. ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలలోనే కులాంతరాలన్ని తగ్గిపోతాయి.. ఆ డొంకలో, ఈ అడవిలో పూజారిగా దళితున్నాడు అని సొల్లు కబుర్లు చెప్పకుండా.. తిరుమల, భద్రాధ్రి.. లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఇది జరగాలి.


  PS: "ఇక చూడండి సైకోగాళ్ళ చిందులూ...."

  ReplyDelete
  Replies
  1. "క్రిస్టియానిటీలోకి మారగానే బిసిగా ఎలా మారతాడు?"

   ఈ సమస్య క్రైస్తవం & ఇస్లాం రెంటితోనే. బౌద్ధ మతం పుచ్చుకుంటే ఎటువంటి సమస్యా లేదు.

   త్వరలో క్రైస్తవ దళితులకు ఊరట ఇచ్చే విధంగా చట్టం మార్చే అవకాశం ఉంది. దీనితో వివాదానికి తెర దిగుతుందేమో చూద్దాం.

   "గుల్లల్లో పూజారులుగా దళితులకి రిజర్వేషన్ ఇచ్చి"

   దళితుల బ్రాహ్మణీకరణ కంటే మొత్తం సమాజాన్ని బహుజానీకరణ చేయడమే బెటర్ కాదంటారా? బడుగు బలహీన వర్గాలు వారందరూ కంచ ఐలయ్య "నేను హిందువును ఎట్లయిత" పంధా అనుసరిస్తే ఇప్పుడు గుళ్లను ఏలే జేజేమ్మలు దిగిరారా?

   కాలం వేగంగా మారుతుంది. నిన్నటి శిఖరాగ్రాలను స్వాధీనం చేసుకుంటే ప్రయోజనం సున్నా. Remember Alvin Toffler's warning against capturing yesterday's commanding heights.

   Delete
 8. చిరంజీవి గారు...పురోహిత్యం బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వాళ్ళు చేయరు గదా? అటువంటప్పుడు దళితులకు ఎలా ఇస్తారు సర్. ఒకవేళ మీరన్నట్టు ఎక్కడెక్కడో ఉన్నా అదేమంత పెద్ద విషయమే కాదు. నేనైతే ఎక్కడా ఒక దళిత సోదరుణ్ణి కూడా పూజారిగా చూడలేదు.

  ReplyDelete
  Replies
  1. >>దళితుల బ్రాహ్మణీకరణ కంటే మొత్తం సమాజాన్ని బహుజానీకరణ చేయడమే బెటర్ కాదంటారా?

   నేను చూపించినది చాలా సింపుల్ లాజిక్. జస్ట్ సైకోగాల్లని హిందూమతం దూరం పెట్టుకుంటే సరిపోతుంది.. ఒక్కసారి మతంలో అందరికీ సమాన గౌరవం రావడం మొదలుపెడితే, చాలా సులువుగా కులాల మధ్య అంతరాలు తొలగిపోతాయి.. బహుజనీకరణకి నాంది అదే..

   >>పురోహిత్యం బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వాళ్ళు చేయరు గదా?

   ఏ మతమైనా సైకోగాళ్ళ చేతుల్లోనుంచి బయటపడితేనే అది సాధ్యం

   >>నేనైతే ఎక్కడా ఒక దళిత సోదరుణ్ణి కూడా పూజారిగా చూడలేదు.

   ఎక్కడెక్కడున్నారో హరిబాబుగారు తన బ్లాగులో ఇంతకుముందు రాశారు..

   >> PS: "ఇక చూడండి సైకోగాళ్ళ చిందులూ...."

   https://gudibanda.wordpress.com/2018/09/26/%e0%b0%ae%e0%b0%a4%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%a1%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%95%e0%b0%be/

   Delete

కామెంట్లలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలు, దుర్విమర్షలు, బెదిరిoపులు,వార్నింగులు ఉంటే తొలగించబడును. - రచ్చబండ టీమ్