Sunday, September 30, 2018

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?

జగన్ సి.యం. అయితే ఆంధ్రాను ముందుకు నడిపించగలడా?


వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం వలన భార్యాభర్తల మధ్య నమ్మకాలు,బంధాలు, ప్రేమానురాగాలు పతనమయ్యిపోవా? ఈ తీర్పు వలన ప్రధానంగా హిందూ సంస్కృతి నాశన స్థితికి దిగజారిపోదా?

నీహారికా మేడమ్ గారు అడిగిన "వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు?" ప్రశ్నకు ఇప్పటికే చాలా మంది తమతమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే కొన్ని సబ్జెక్ట్ కు అతీతమైన కామెంట్లు కూడా వచ్చాయి. మరికొన్ని కామెంట్లలో అసభ్యకరమైన పదజాలం ఉందని శ్యామలీయం మాష్టారు గారు మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు ఆయన సూచించిన కామెంట్లను వెంటనే తొలగించడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటె పై ప్రశ్న నీహారికా మేడం గారు అడిగిన ప్రశ్నలాగే ఉన్నప్పటికీ పూర్తిగా భిన్నమయినది. ఒకవేళ "వివాహేతర సంబంధాలు నేరం కాదన్న చట్టం" పూర్తీ స్థాయిలో అమలయితే భవిష్యత్ లో దాని పర్యవసానం ఎలా ప్రజలపై ఎలా ఉంటుంది? అనే సందేహం కలిగింది. ఇప్పటికే స్త్రీలకు రక్షణ కరువవుతున్న మనదేశంలో ఈ చట్టం వలన బంధాలు,బాంధవ్యాలు సర్వనాశనమవుతాయనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలను అంగడి వస్తువుగా మార్చేసే ప్రమాదమే కనిపిస్తోంది. దీని వలన ముఖ్యంగా పతనమయ్యేది హిందూ సంస్కృతే అనిపిస్తోంది.

మా మిత్రుడు ఫేస్ బుక్ లో ఒక వీడియో షేర్ చేసాడు. అది ఈ తీర్పు పై చేయబడిన ఒక షార్ట్ ఫిలిం.
ఒక భర్త తన భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెల్సి గన్ తీసుకుని కోపంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని భార్య తన ప్రియుడితో (నా దృష్టిలో ప్రియుడు అనేది కరెక్ట్ పదం కాదు. తప్పక అలా రాయాల్సి వచ్చింది.) పడక గదిలో చూసి కోపంగా ఊగిపోతాడు. తన భార్య ప్రియుడ్ని బయటకు తీసుకుని గన్ పెట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలో అతని భార్య తన ప్రియుడిని తన భర్త చంపేస్తాడనుకుందో లేక భర్తకంటే ప్రియుడే ముఖ్యమనుకుందో తెలీదు గాని తన భర్తను నిర్ధాక్షిణ్యంగా గన్ తో కాల్చి వేస్తుంది. వెంటనే ఆమె భర్త అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు. ఇందంతా చూసిన ఆమె ప్రియుడు "నీ భర్తనే ఇలా చంపుతావా? నీవు నాకు కరెక్ట్ కాదు, నీకూ నాకూ సంబంధం లేదు" అంటూ కారెక్కి వెళ్ళిపోతాడు. తరువాత ఆమె కొడుకు (6నుండి 7సంవత్సరాలు ఉండొచ్చు.) స్కూల్ నుండి వస్తూ తండ్రిని రక్తపు మడుగులో చూసి ఏడుస్తూ తండ్రిని లేపుతూ ఉంటాడు. అప్పటికే తండ్రి కన్నీళ్ళతో కొడుకు వైపుకు చూస్తూ మరణిస్తాడు. ఈ చట్టం అమలయితే బంధాలెక్కడ? అనే క్యాప్షన్ తో ముగుస్తుంది.

ఏది,ఏమైనా ఈ సుప్రీం తీర్పు చట్టమయితే భారతదేశ పటిష్టమైన వివాహ వ్యవస్థ బీటలు వారినట్టే!!

Friday, September 28, 2018

"భారతదేశ ప్రధాని"గా "నరేంద్ర మోడీ" పాసా? ఫెయిలా?

"భారతదేశ ప్రధాని"గా "నరేంద్ర మోడీ" పాసా? ఫెయిలా?

Thursday, September 27, 2018

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ? Illegal relationship is not a crime, is it a triple talaq crime? Asaduddin asked.

వివాహేతర సంబంధం నేరం కాదు,ట్రిపుల్ తలాక్ నేరమా ? అని అసదుద్దీన్ గారు ప్రశ్నించారు.మీరేమంటారు ?

ప్రశ్నించినవారు : నీహారికా మేడమ్ గారు.

"రచ్చబండ"కు ప్రశ్నలు పంపించండి. | Send questions to "Rachabanda".

ముఖ్యమైన విషయాలపై చర్చించడం వలన, లోతైన సమాచారాన్ని అందించడం వలన చదూవరులకు చక్కని పరిజ్ఞానం అందుతుంది. దీని కారణం చేతనే "రచ్చబండ"ను స్థాపించడం జరిగింది. ఎందుకంటే విషయ పరిజ్ఞానం, విషయ అవగాహన మనిషిని ఉన్నత స్థితికి దగ్గర చేస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగార్ధమైన ప్రశ్నలను చర్చల కోసం అందించమని కోరుకుంటున్నాము.

మీ ప్రశ్నలను క్రింది కామెంట్ బాక్స్ లో పెట్టండి. వీలు వెంబడి వాటిని చర్చల కోసం ఆహ్వానిస్తాను. - మీ రచ్చబండ టీం.

Tuesday, September 25, 2018

ప్రధానమైనవి హక్కులా? బాధ్యతలా?

ప్రధానమైనవి హక్కులా? బాధ్యతలా?

హక్కుల కోసం వాదించేవారే..బాధ్యతల కోసం మాట్లాడేవారు బహు తక్కువమంది ఉన్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు, మామూలు వివాహాలు, ఆస్తి పంపకాలు..ఇలా ఒకటేమిటి...అనేక వాటిల్లో మన హక్కుల కోసం మనం పోరాడతామే గాని మనం నిర్వర్తించాల్చిన బాధ్యతలను మాత్రం గుర్తెరగము. నిజానికి తన బాధ్యతలను నిర్వర్తించిన వారికే హక్కు ఆశించే అవకాశం ఉంటుంది గాని బాధ్యతలను నిర్వర్తించని వారికి ఏవిధమైన హక్కు ఉండదు. దీనికి మీరేమంటారు?

Sunday, September 23, 2018

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Interracial marriages and religious marriages are beneficial? Dangerous?

కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ప్రయోజనకరమా? ప్రమాదకరమా?

Friday, September 21, 2018

అన్ని భాషలకు మూలం సంస్కృతమన్న వాదనలో యధార్ధమెంత?

అన్ని భాషలకు మూలం సంస్కృతమన్న వాదనలో యధార్ధమెంత?

Wednesday, September 19, 2018

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?

ప్రధాని నరేంద్ర మోడీ "ఆంధ్రా"పై కక్ష కట్టడానికి ప్రధాన కారణాలేమిటి?


Monday, September 17, 2018

బిజెపి అధికారంలోకి రావడం వల్లే "హిందూ ఉగ్రవాదం" పెరిగిందన్న వాదన సమంజసమా?

బిజెపి అధికారంలోకి రావడం వల్లే "హిందూ ఉగ్రవాదం" పెరిగిందన్న వాదన సమంజసమా? 


Sunday, September 16, 2018

దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? సనాతన హిందూ విజ్ఞానం పరిపూర్ణమేనా??

దేవుడు ఎప్పటినుంచి ఉన్నాడు? సనాతన హిందూ విజ్ఞానం పరిపూర్ణమేనా?? - ప్రశ్నించినది : చిరంజీవి గారు

Thursday, September 13, 2018

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే లాభమెవరికి?

ఆంధ్రాకు ముందస్తు ఎన్నికలొస్తే  లాభమెవరికి?

Thursday, September 6, 2018

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడానికి గల ప్రధాన కారణాలేమిటి?

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడానికి గల ప్రధాన కారణాలేమిటి?

Monday, September 3, 2018

కుటుంబ వ్యవస్థలపై TV సీరియల్స్ ప్రభావమెంత? | Are TV serials affecting family systems?

కుటుంబ వ్యవస్థలపై TV సీరియల్స్ ప్రభావమెంత? | Are TV serials affecting family systems?