Sunday, October 8, 2017

ఇప్పటి సినిమాలు సమాజానికి హానికరమా? ప్రయోజనకరమా?

ఈరోజుల్లో వస్తున్న సినిమాల వలన ఎక్కువుగా ఏమి కలుగుతోంది? మనుషులలో హింసా ప్రవృత్తి పెరిగిపోవడానికి సినిమాలు అత్యధిక పాత్ర పోషిస్తున్నాయా?

Friday, October 6, 2017

అంటరానితనం అంటే ఏమిటి? అంటరానివాళ్ళుగా ఎవరిని పరిగణించాలి?

అంటరానితనం అంటే ఏమిటి? అంటరానివాళ్ళుగా ఎవరిని పరిగణించాలి?

Thursday, September 28, 2017

పరిపూర్ణనంద స్వామి-కంచె ఐలయ్య అసలు సిద్ధాంతాన్ని వక్రీకరిస్తూ మార్గం తప్పిస్తున్నారన్న వాదన సరయినదేనా?

ఐలయ్య విషయంలో ప్రస్తుతం జరుగుతున్నదంతా కులాల మధ్య వ్యవహారం. దీని మధ్యలో మతాన్ని ఎందుకు దూర్చుతున్నారని పరిపూర్ణనంద స్వామినుద్దేశించి కొంతమంది తీవ్రంగానే ప్రశ్నిస్తున్నారు. మొన్న TV9 జరిపిన డిబేట్ ప్రోగ్రాంలో మొదట్లో నాకు రాగద్వేషాలు లేవని బాహాటంగా ప్రకటించుకున్న పరిపూర్ణానంద ప్రోగ్రాం మధ్య కోపోద్రిక్తుడై ఎందుకు లేచి వెళ్ళిపోయాడు. ఇక కోపతాపాలు కూడా అణుచుకోలేని పరిపూర్ణానంద సన్యాసి అయ్యి ప్రయోజనం ఏముందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక పొతే అన్ని కులాల వారిని సమంగా చూడాల్సిన పరిపూర్ణానంద ఒక కులానికి మద్దతిచ్చి మాట్లాడాల్చిన పని అతనికెందుకు? ఆయన మాటలు వింటుంటే అతనిలో ఏమాత్రం సన్యాసి లక్షణాలు కనిపించడం లేదని, అలాగే సత్యాన్ని మాత్రమే పలకాల్సిన స్వామి అబద్ధాలను మోపుతూ కంచె ఐలయ్యను చెడ్డవాడిగా చూపే ప్రయత్నం చేస్తున్నాడని...ఎలా అంటే మొన్న జరిగిన డిబేట్ లో కంచె ఐలయ్య కేవలం ఇదిగో నా తల్లిదండ్రులు..వారి పేర్లు, మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి? అని ఐలయ్య రెట్టించి అడిగినందుకే "నాతల్లిని అవమానించాడని" ఐలయ్యపై నింద మోపడం, అబద్దాన్ని అంటగట్టడం, పైపెచ్చు "నాకు పిల్లనిస్తావా?" అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం చూస్తుంటే ఆయన సన్యాసి ఏమిటబ్బా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఐలయ్య వ్యవహారాన్ని దారి తప్పిస్తూ, మరింత విద్వేషపూరితంగా మార్చుతూ రాష్రంలో అలజడులకు ఆజ్యం పోస్తున్నాడని పరిపూర్ణానందపై కొంతమంది వ్యతిరేకత చూపుతున్నారు. సిపిఐ నాయకుడు రామకృష్ణ కూడా పరిపూర్ణానందను ఖండించిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే! 

Monday, September 25, 2017

మనం ఎవరిని సమర్ధించాలి? కంచె ఐలయ్యనా? పరిపూర్ణానంద స్వామీజీనా?

 Who should we support? The Kancha Ilaiah? Is the Swapanananda Swamiji? మనం ఎవరిని సమర్ధించాలి? కంచె ఐలయ్యనా? పరిపూర్ణానంద స్వామీజీనా?

Monday, August 28, 2017

అక్కడ డేరా బాబా...ఇక్కడ జగన్ బాబా అన్న ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్ పై మీ స్పందన ఏమిటి?

కాకినాడ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్న సి.ఎం. చంద్రబాబు పై విధంగా విమర్శిస్తూ ప్రజలలో వ్యంగ్యం ప్రదర్శించారు.

బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు కేవలం 10 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించడం న్యాయమైన తీర్పేనా?

baba-Ram-Rahim-receives-10-Years-Jail-Sentence-rachabanda
బాబా అవతారం ఎత్తి అరాచకాలకు పాల్పడ్డ డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ఆశ్రమంలో సాద్వీలుగా కొనసాగుతున్న ఇద్దరు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా హత్యారోపణలు ఉన్న గుర్మీత్ సింగ్ ను దోషిగా తేలుస్తూ మొన్న పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నాడు శిక్షను ఖరారు చేయని కోర్టు... ఏ తరహా శిక్ష వేయాలన్న విషయాన్ని నేటికి వాయిదా వేస్తూ తీర్పు  చెప్పింది. అయితే గుర్మీత్ ను దోషిగా తేల్చిన మరుక్షణమే అతడి అనుచర వర్గం ఉత్తర భారతంలో చేసిన ఆగడాలతో దేశం అట్టుడికిపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్రంగానే స్పందించారు. ఇక గుర్మీత్ అల్లరి మూకలు పాల్పడ్డ అచారకాలను అదుపు చేయలేకపోయారన్న ఆరోపణలతో ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి కేంద్రం చీవాట్లు కూడా పెట్టింది.

ఈ క్రమంలో మరోమారు అల్లర్లు  చెలరేగే ప్రమాదముందన్న భావనతో రోహ్ తక్ జైల్లోనే సీబీఐ ప్రత్యేక కోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసిన యంత్రాంగం... అక్కడే శిక్షను ఖరారు చేసే ఏర్పాట్లను చేసింది. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో గుర్మీత్ కు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గుర్ దీప్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. తీర్పు వెలువడిన వెంటనే రాక్ స్టార్ బాబాగా పేరుగాంచిన గుర్మీత్ బోరున విలపిస్తూ కోర్టు ప్రాంగణంలోనే కింద పడిపోయి తీవ్ర స్థాయిలో రోధించారట.  తాను ఏ తప్పూ చేయలేదని - నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. ఇక శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జైలులోనే  వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిబంధనల ప్రకారం ఆయనకు సెల్ ను కేటాయించి శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. ఇదిలా ఉంటే... డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని - దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. అయితే అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి సీబీఐ తరఫు న్యాయవాది వాదన వైపు మొగ్గి గుర్మీత్ కు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 

Saturday, August 12, 2017

చైనా వస్తువులను నిషేధించడం వలన ఉపయోగం ఉందా?

చైనా వస్తువులను నిషేధించడం వలన ఎటువంటి ఉపయోగం లేదని కొంతమంది వాదన. చైనాతో వేరే విధంగా తేల్చుకోవాలి గాని ఆర్ధికంగా దెబ్బ కొట్టడం సరికాదని, అదే జరిగితే చైనా కూడా మన దేశ ఆర్ధిక వ్యవస్థపై గట్టి దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదని కొంతమంది విశ్లేషిస్తున్నారు.

కొంతమంది బ్లాగర్లయితే రెండు విధాల అభిప్రాయపడుతున్నారు.

చైనా ఎగుమతుల్లో 2.8 శాతం మాత్రమే మనదేశానికి వస్తున్నాయి.  మన దేశం మొత్తం ఎగుమతుల్లో 4.8 శాతం చైనా కి వెళుతున్నాయి. మనం చైనా సరుకులు నిషేదిస్తే వాళ్ళు నిషేదించరా ? ఎవరికి నష్టం ? అంటూ నిహారిక గారు కూడా తన బ్లాగులో అభిప్రాయం వెలిబుచ్చారు.

ఇవన్నీ పరిగణంలోకి తీసుకుని చైనా వస్తువులను నిషేధించడం పట్ల ఒక నిర్ణయానికి రావల్సిన అవసరం లేదంటారా?

Tuesday, August 8, 2017

రిజర్వేషన్ల వలన దేశానికి ఉపయోగముందా?

రిజర్వేషన్ల కారణంగా అర్హత కలిగిన వారికంటే, అర్హత లేనివారే ప్రభుత్వ సంస్థలలో కూర్చుంటున్నారు. దీని వలన ప్రభుత్వ సంస్థలలో బద్ధకస్తులు, సోమరిపోతులూ పెరిగిపోయి తుప్పుపడుతున్నాయన్న వాదన బలంగా ఉంది. మరొక విషయమేమిటంటే ఆర్ధిక స్థితిగతులను కాకుండా, అర్హతలను,నైపుణ్యాలను కాకుండా కేవలం కులాల ప్రాతి,పదికపై రిజర్వేషన్లు కలిపించడం మరీ దారుణమన్న వాదన కూడా బలంగా ఉంది.దీనికేమంటారు?

Wednesday, June 28, 2017

GST బిల్లు సామాన్యులకు ప్రయోజనకరమేనా?

July 1 నుండి దేశ వ్యాప్తంగా అమలయ్యే GST బిల్లు వలన సామాన్యులకు ఉపయోగకరమంటారా? GST బిల్లు వలన చిన్న,చిన్న వ్యాపారులతో పాటు, సామాన్యులు కూడా ఇబ్బందుల పాలు కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. నిజానికి GST బిల్లు దేశానికి,సామాన్య ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చుతుందా?

Wednesday, June 14, 2017

నేడు జరుగుతున్నది చర్చ కేవలం గోవధ నిషేధం గురించేనా? లేక పూర్తి మాంసాహార నిషేధం గురించా?

ఈ విషయంపై ఇది వరకే "సాక్ష్యం మేగజైన్"లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. వీలయితే చదువగలరు. పై ప్రశ్నపై చర్చించడం వలన చాలా లోతైన విషయాలు తెలుస్తాయి. అది అవసరం కూడా, చాలా మంది పశు పక్ష్యాదులు మనిషి ఆయరం కోసమే పుట్టాయా? అని తమతమ అభిప్రాయాలు తెలియజేసారు, మరికొంతమంది అయితే మాంసాహార నిషేధ మన్నది కేవలం బ్రాహ్మణ వర్గ కుట్రమాత్రమేనని కూడా నినదించారు. ఏది ఏమైనా మాంసాహార నిషేధం సాధ్యమా? అన్నది తేలాల్చిందే!

Wednesday, February 1, 2017

ఏపీ తుపాకీని పేల్చే మొనగాడు జగనే నన్న వర్మ మాటలతో మీరు ఏకీభవిస్తారా?

Ram-Gopal-Varma-Praises-YS-Jagan
ఏపీ మ్యాప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. ఏపీ భౌగోళిక స్వరూపం తుపాకీని పోలినట్లు ఉందన్న వర్మ.. ఏపీ లాంటి తుపాకీని వినియోగించి దాని బుల్లెట్లు పేల్చి సమస్యల్ని తీర్చగలిగేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేర్కొన్నారు. ఏపీకి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే పలుమార్లు తన గళాన్ని వినిపించిన జగన్ ను.. తాజాగా ఏపీ తుపాకీలోని బులెట్లు పేల్చే మొనగాడిగా అభివర్ణించాడు.

దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు సమంజసమా?

ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా ప్రధాని మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి అనిల్ విజ్ స్పందించారు. "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్‌ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకూ సమంజసం?