Monday, August 22, 2016

కేవలం సిల్వర్ పతకం పట్టుకొచ్చిన సింధు పట్ల ఇంత ఆర్భాటం అవసరమా?

క్రీడలలో గెలుపు,ఓటములు సహజం. నెగ్గినంత మాత్రాన దేశం పరువు పెరిగిపోదు. ఓడినంత మాత్రాన దేశం పరువు దిగజారిపోదు. మన పిచ్చి కాకపొతే! ఈ ఒలింపిక్స్ లో సిల్వర్ కాయిన్ సాధించుకొచ్చిన సింధు పట్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్భాటాలు చూస్తుంటే అంతా,ఇంతా కాదు. ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలు కలిపి చెరొక 5 కోట్ల చొప్పున మొత్తం 10 కోట్ల రూపాయలు, అక్కడా,ఇక్కడా ప్రభుత్వ స్థలాలు ముట్టజేప్పాయి. మా దగ్గర నిధులే లేవన్న చంద్రబాబు గారు ప్రభుత్వ స్థలం, 5 కోట్ల రూపాయలు ధారబోయడం మరీ విడ్డూరం! దేశానికి ప్రాణాలు పోసి పోరాడే ఒక సైనికుడికి ఈ గౌరవం చేయరు. ఇదేమిటో బంతాట ఆడుకునే వారికి మాత్రం సన్మానాలు,ఊరేగింపులునూ! సింధు వలన దేశానికి ఏమి కలిసి ఒచ్చిందో తెలియదు. కాని కోట్లు కుమ్మరించి వేస్తున్నారు. నా దృష్టిలో ఇంత అవసరం లేదు. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించవచ్చు. ఇవ్వన్నీ చూసి కోట్లు వస్తాయని, పేరు వస్తుందని అందరూ బంతాటలు ఆడుకుంటే దేశం బాగుపడిపోతుందా? ఏమిటి? మిలటరీ నుండి రిటైర్ అయ్యిన చాలా మంది కంపెనీల దగ్గర, ఎ.టి.యం ల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వీళ్లకు మనం ఇచ్చే గుర్తింపు ఇదేనా? పేద పిల్లల చదువుల పట్ల, నిరుద్యోగుల ఉపాధి పట్ల శ్రద్ధ చూపించని ఈ ప్రభుత్వాలు క్రీడలకు కోట్లు కుమ్మరించడం వలన ఉపయోగం ఏముంది?

Saturday, August 6, 2016

స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?

తన స్వంత మతం స్వధర్మమము, పరాయి మతము పరధర్మము అనే భావనలో మనిషి ఉన్నాడు. నిజానికి ఈ విధమైన సిద్ధాంతాన్ని గాని, భావనను గాని మన ధార్మిక గ్రంధాలు కలిగియున్నాయా?