Saturday, July 30, 2016

ప్రధానిగా నరేంద్ర మోడి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అర్హులేనా?

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్తులు ఏమాత్రం అసలు బాగోలేదు. అభివృద్ధి కూడా కనిపించడం లేదు. చంద్రబాబు అమరావతిపైనా, నరేంద్ర మోడి ఇతర మత నిర్మూలనపైన మాత్రమే దృష్టి పెట్టారు. ఈరోజు ఒక వార్త తెలిసింది. నరేంద్ర మోడి గారు గూగుల్ యాడ్స్ సెన్స్ డబ్బులు ఆపేసారట. వాళ్ళు ఏమి చేసారు పాపం. ఎదో బ్లాగింగ్ ను వ్రుత్తిగానూ, Youtube ను తమ కళలకు వేదికగానూ చేసుకుని సంపాదించుకుంటున్నారు. విదేశాల నుండి ఇతర మతస్తులకు వస్తున్న ఫండ్స్ ను అడ్డుకోవడం కోసం వీళ్ళను కూడా నిరోధించడం న్యాయమా? దేశభక్తి ముసుగులో ఇతర మతస్తులను లేకుండా చేయాలనుకోవడం అన్యాయం కాదా? ఆంధ్ర పరిస్థితి అయోమయం.. ఎవరు ఏమి చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్న నరేంద్ర మోడిని, ఇంత జరుగుతున్నా మద్దతు ఉపసంహరించుకోకుండా మోడిని పట్టుకు వేలాడుతున్న చంద్రబాబుని ఎలా నమ్మాలి? ఎలా సమర్ధించాలి? వీళ్ళిద్దరూ పరిపాలనకు అర్హులేనా?

Friday, July 22, 2016

డా|| జాకీర్ నాయక్ పై టెర్రరిస్ట్ ముద్ర వేయడం సమంజసమా?

ఒక ప్రసంగీకుడు అదీ మతపరమైన విషయాలు చర్చించేటప్పుడు మనం పరిశీలించడం వల్ల కొంత అద్భుతమైన విషయపరిజ్ఞానం దొరుకుతుంది. అదీ అన్ని మతాల అధ్యయనకర్త అయిన జాకీర్ నాయక్ ప్రసంగాల వలనయితే మరీ ఉపయోగం ఉంటుంది.
ఎవరో మారణహోమానికి పాల్పడిన దుర్మార్గులు ఆ ప్రసంగాల వలనే ఇలా తయారయ్యానని తప్పుడు స్టేట్ మెంట్ ఇస్తే అది నిజమని నమ్మి మన భారతీయుడిగా ప్రపంచదేశాలలో ఖ్యాతిని నెలకొల్పుతున్న ఒక ధార్మిక ప్రసంగీకుడిని టెర్రరిస్ట్ అని ముద్ర వేయాలని చూడడం దారుణం కదూ?
అదే నిజమైతే జాకీర్ నాయక్ ప్రసంగాలకు ముస్లిములతో పాటు అన్ని మతవర్గాల ప్రజలు, మేధావులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. వారందరూ టేర్రరిస్తులుగా ఎందుకు మారడం లేదు?
జాకీర్ నాయక్ కంటే దారుణంగా మన నాయకులు ముఖ్యంగా RSS నాయకులు ఎన్ని మత విద్వేష ప్రసంగాలు చేయడం లేదు? ఇవేవీ దారుణం కాదా?
టెర్రరిస్టులు కేవలం ముస్లిములలోనే కాదు...అన్ని మతవర్గాలలోనూ ఉన్నారు.
అయితే అంతర్జాతీయంగా మీడియా కేవలం యూదుల,క్రైస్తవుల చేతుల్లో ఉంది కాబట్టి, వారికి బద్ధ శత్రువులు ముస్లింలే కాబట్టి మరీ ఎక్కువు చేస్తున్నారు. ప్రపoచం చేత నమ్మిస్తున్నారు. యూదుల,క్రైస్తవుల దారుణాలు ఇంతా,అంతా చెప్పండి?
ధర్మం దృష్టి తో కాక మతo దృష్టితో చూసేవాడికి అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది.

Thursday, July 21, 2016

తెలుగు బ్లాగర్లు ఒకరి గురించి మరొకరు తమ,తమ బ్లాగుల్లో విమర్శిస్తూ టపాలు వ్రాసుకోవడం సమంజసమా?

ఈమధ్య మళ్ళీ ఒక బ్లాగరు గురించి మరొక బ్లాగరు తమ.తమ బ్లాగుల్లో ఘోరంగా విమర్సించు కోవడం చూస్తున్నాము. ఇది ఎంతవరకూ తెలుగు బ్లాగుల ప్రపంచానికి శ్రేయస్కరం? ఇప్పటికే బ్లాగు ప్రపంచం కుప్పకూలిపోయింది. మంచి,మంచి ఆరోగ్యకరమైన బ్లాగులన్నీ ఇంచుమించు మరుగున పడిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నిలబెట్టాల్సిందిపోయి ఇలా విమర్శించుకోవడం సమంజసమా?