Thursday, January 8, 2015

ఇటువంటి దుర్మార్గులను ఏం చెయ్యాలి?

ఈరోజు సాక్షి దిన పత్రికలో వచ్చిన వార్తను చూసి మనసంతా బాధతో నిండిపోయింది. స్త్రీలకు ఎక్కడికెళ్లినా రక్షణ లేదా? ఆఖరికి యాక్సిడెంట్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్న మన దేశ ఆడబిడ్డకు హాస్పటల్లో కూడా రక్షణ లేదంటే మన దేశం ఎటు ప్రయణిస్తుంది? ఇటువంటి మానవ మృగాలను ఏమి చెయ్యాలి?
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  ఆ డాక్టర్ ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్ పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు. 
ఆధారం: http://www.sakshi.com/news/national/2-cops-doctor-held-for-raping-college-student-202087

Sunday, January 4, 2015

భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క విశ్లేషణ మీరు చేయగలరా?

తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత!
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం!!

భావం:ఓ అర్జునా సర్వ విధముల అతనినే శరణు పొందుము. అతని యనుగ్రహముంటే సర్వోత్తమగు శాంతిని, శాశ్వతమగు మోక్ష పదవిని నీవు పొందగలవు.

పై శ్లోకం గీతలోని 18:62 నుండి సేకరించబడినది.దీని యొక్క విశ్లేషణ మీరు అందించగలరా?