Thursday, December 24, 2015

"మత మార్పిడి వద్దు...మతి మార్పిడి ముద్దు" అనే నినాదం యొక్క వాస్తవికత ఏమిటి?

ఈమధ్య కాలంలో ఎక్కువుగా మనం చాలా నినాదాలు ఆటోల మీద మోటారు బైకుల మీద చూస్తున్నాము. "గొర్రెల కాపరి వద్దు,గోవుల కాపరే ముద్దు"అని, ఇంకా పరమత౦లో మోక్షం లేదు, స్వమతంలోనే మోక్షముందని" ఇలా ఎన్నో నినాదాలు చూస్తున్నాము. ఈ మధ్యే ఒక ఆటో పై "మత మార్పిడి వద్దు...మతి మార్పిడి ముద్దు" అనే నినాదం కనిపించింది. దాని వాస్తవికత వివరించగలరా?

Sunday, December 20, 2015

ఒక మతం వారి ఆహార నియమాలను మరొక మతం వారు నివారించాలని చూడడం సమంజసమా?

ఈమధ్య ఎక్కువుగా ఆవుమాసంపై జరుగుతున్న రగడ మనకందరికీ తెలిసిందే! ముస్లింలు ఆవులను భక్షిస్తే హిందువులు (అత్యధికులు) పూజిస్తారు. కాబట్టి గోవధ నిషేధ నినాదం అమలు చేయడం సాధ్యమా? మనం పూజిస్తున్నామని ఇతర మతస్తులను నివారింప చూడడం సమంజసమా?

Saturday, December 19, 2015

పురాణాలకు "పుక్కిటి పురాణాలు" అనే వాడుక ఎలా వచ్చింది?

అనేకమంది దృష్టిలో పురాణాలన్నీ ఊహాజనితమే, కల్పిత కధలే అనే భావన బలంగా ఉంది. నిజానికి కొన్ని పురాణాలు నమ్మదగ్గవైతే అత్యధిక పూరాణాలు మాత్రం కేవలం కల్పిత కధలని, మనిషి నీతిని నేర్వడమ్ కోసం వ్రాయబడినవని అంటారు. అందుకనే ఇవ్వన్నీ వింత,వింతగా ఆలోచనలకు నిలబడలేనట్టుగా అనిపిస్తాయి కాబట్టే వీటిని పుక్కిటి పురాణాలుగా పేర్కొంటున్నారని వాదన. నిజానికి వీటికి పుక్కిటి పురాణాలు అనే వాడుక ఎలా వచ్చింది?

Friday, November 13, 2015

తెలుగు బ్లాగులలో స్త్రీల పాత్ర ఏమిటి?

తెలుగు బ్లాగులోకంలో స్త్రీల పాత్ర అంతగా లేదనే చెప్పొచ్చు. నాకు తెలిసినంత మేరకు మొదటి స్త్రీ బ్లాగు జ్యోతిగారు "బ్లాగు గురువు" పేరుతో ప్రారంభించారు. ఇంకా వనజవనమాలి, మేరాజ్ ఫాతిమా గార్ల బ్లాగులతో పాటు మరికొన్ని బ్లాగులున్నాయి. అయితే రెండు,మూడు బ్లాగులు తప్ప పెద్దగా స్త్రీ బ్లాగులు ప్రాచుర్యానికి నోచుకోలేదు.దీనికి ప్రధాన కారణం ఏమిటి? తెలుగు బ్లాగుల ప్రపంచంలో స్త్రీ బ్లాగులు వెలుగొందాలంటే మనం ఏమి చేయాలి?

Sunday, August 30, 2015

ఏ కుటుంబం ప్రశాంతంగా ఉండగలుతుంది?

భార్య, తల్లి,దండ్రులతో ఉన్న కుటుంబమా? లేక భార్య, అత్త,మామలతో కల్సియున్నకుటుంబమా? ఇవేమీ కాకుండా భార్య,భర్త మాత్రమే కల్సుంటే ఉంటుందా? ఈ ప్రశ్నలు హాస్యాస్పందంగా ఉండవచ్చు. కాని కుటుంబ విచ్ఛిన్నాలన్నీ వీటి వలనే ఎక్కువుగా జరుగుతున్నాయి. వీటికి మీరిచ్చే సలహాలు,సమాధానాలు అందరికీ ఉపయోగపడవచ్చు. 

మైనారిటీల పట్ల మెజారిటీ వివక్ష చూపే అలవాటును మానుకొన్న వెంటనే, మైనారిటీల ఉనికికి తావే వుండదు. అవి అంతరించిపోతాయి.

పై వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత డా: బి.ఆర్.అంబేద్కర్ 4-11-1948 నాడు అంటే మొదటిసారి రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టిన సందర్భంలో చేసిన ప్రసంగమిది. దీనితో మన ఏకీభవించవచ్చా?

Friday, August 28, 2015

నేటి ఆంధ్రప్రదేశ్ దారుణ పరిస్తితికి సరైన పరిష్కారం ఏమిటి?

తెలంగాణ నుండి వేరైన ఆంధ్ర సమస్తము కోల్పోయింది. నిజానికి చెప్పాలంటే ఆంధ్ర ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ ఉన్న ప్రశాంతమైన స్థలం కూడా లేదు. సమకూర్చుకున్న వనరులన్నీ తెలంగాణలో ఉండిపోయాయి. ఆంధ్ర వాళ్ళు చేసిన అభివృద్ధిని తెలంగాణ వాళ్ళు నిలువునా దోచుకున్నారు. వారికి అన్ని వసతులతో కూడిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మిగిలిపోయాయి. వట్టి చేతులతో ఆంధ్రను నడిరోడ్డుపై నిలబెట్టారు నేటి కుతంత్ర రాజకీయ దుశ్శాసనులు. ఆంధ్రప్రదేశ్ పరిస్తితి చాలా దారుణంగానే ఉంది.ఈ సమస్యలన్నిటికీ సరైన పరిష్కారం ఏమిటి?

Thursday, August 27, 2015

వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు ఉంటుందా?

ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు విషయంలో చాలా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రకృతి విరుద్ద కార్యాలకు, స్వలింగ సంపర్కం, సహ జీవనం ఇటువంటివి కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు పరిమితం చేశారు. నిజానికి వ్యక్తిగత స్వేచ్ఛ అని దేనినంటారు? దానికి హద్దులు ఉంటాయా? ఉండవా?  ఉంటే ఇది దేని పరిధిలో ఉండాలి?

Tuesday, August 25, 2015

ఆటోల సమస్యకు పరిష్కారం సూచించండి.

కప్పుడు ఆటో వాహనం వచ్చిన తరువాత ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉండేది. బస్సు దిగినా, ట్రైన్ దిగినా లగేజీతో ఇంటికి పోవడానికి ఎంతో వీలుగా ఉండేది. కాల క్రమేణా ఆటోల సంఖ్య పెరిగిపోవడమో, లేక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఆటో డ్రైవర్లలా మారడమో తెలియదు గాని ప్రయాణికులకు మాత్రం ఆటో ప్రమాదీకారిగా మారిపోయింది. ఆటో వాలాలందరూ ఒకలాంటి వారు మాత్రం కాదు. తమ ప్రయాణికుల పట్ల గౌరవభావంతోనూ, నమ్మకంగానూ, నిజాయితీగాను పని చేసే మంచివారు కూడా ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు, వికలాంగులకూ ఉచితంగా సర్వీస్ అందించే గొప్ప మనస్సున్న వారు కూడా ఉన్నారు. అయితే అత్యధికులు ప్రమాదకరమైన వారే ఉన్నారు. ఒంటరిగా ఆడది ఆటో ఎక్కితే చాలు... అత్యాచారాలకు పాల్పడే వాళ్ళు కూడా ఉన్నారు. నిలువునా దోచుకునే వారు సైతం కూడా ఉన్నారు. రాను,రానూ వీళ్ళ నేరముల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం సూచించాలో తెలియజేయగలరు? ప్రయాణికుల భద్రతకు జాగ్రత్తలు సూచించగలరు?

Sunday, August 23, 2015

నెహ్రూ పూర్వీకులు ఎవరూ హిందువులే కాదు. నెహ్రూ గారి జయంతిని పిల్లలు జరుపుకోవాల్సిన అవసరం లేదు.

ఈ క్రింది బ్లాగులో జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా కల్పిత చరిత్రేనా? నెహ్రూ కుటుంబలో చీకటి దాగియుందా?

నెహ్రు కుటుంబ నిజాలు

Wednesday, August 12, 2015

గూగుల్ క్రోమ్ సమస్యకు పరిష్కారం సూచించండి.

మన దేశ బ్లాగులుగాని, వెబ్సైట్స్ గాని ఈమధ్య అత్యధికంగా Block అవుతున్నాయి. సమస్య ఎక్కడుందంటారు? గూగుల్ క్రోమ్ లోనా? ఆయా బ్లాగులు లేక సైట్లలోనా? మీకు తెలిసిన సమాచారాన్ని సూచించి నలుగురికీ ఉపయోగపడగలరు?

Thursday, July 23, 2015

హిందూమతం పతనమవ్వడానికి కారణాలేమిటి? దానినెలా పరిరక్షించుకోవాలి?

ఈ అంశంపై ఇటీవలే ఆంధ్రజ్యోతి ఛానెల్లో వివిధ పీటాధిపతుల మధ్య మేధావుల మధ్య ఒక చర్చా కార్యక్రమం జరిగింది.వీలయితే ఈ లింక్ ద్వారా చూడవచ్చు. ఇక పై సమస్యలకు మీ అమూల్య మార్గదర్శకాలు అందించే ప్రయత్నం చేయండి.

Tuesday, July 14, 2015

యేసు రక్తాన్ని నమ్ముకున్నప్పటికీ సకల క్రైస్తవదేశాలూ నైతిక నేరాల్లో-ఘోరాల్లో అగ్రస్థాయిలో ఎందుకు ఉన్నాయి?

"అన్యమతాల"ప్రబోధనం ఏమిటంటే..?
తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంధాలలోని బోధనలను "వ్యక్తిగత శ్రద్ధ"తో ఆచరిస్తూ చెడుమాని,మంచి చేస్తూ...తమ ప్రవర్తనను సంస్కరించుకుని,పాపాల తాకిడి నుండి "తనను తాను కాపాడుకుంటూ" ఉంటేనే తప్ప నీతిమంతుడిగా ఉండలేడు! అన్నది.

       అయితే దీనికి భిన్నంగా ...
       "క్రైస్తవ పండితుల" ప్రబోధనం ఏమిటంటే? 
        ఎంతటి ఘోరపాపి అయ్యినప్పటికీ యేసు నాకోసం రక్తం చిందించారని "విశ్వసిస్తే చాలు" ఇక అతని భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు చెందిన పాపాలన్నీ పరిహరించబడి అతడు మహిమాన్వితుడిగా నీతిమంతుడైపోతాడు! ఆ తరువాత ఏ పాపానికి పాల్పడడు అన్నది!

        అదే నిజమైతే...
        క్రైస్తవులు అధికంగా నివశిస్తున్న దేశాలే సకల నైతిక "నేరాల్లో,ఘోరాల్లో"అగ్రస్థాయిలో (Top Ten)లో ఉండటానికి కారణం ఏమిటి?

        క్రైస్తవ పండితులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే లోపభూయిష్టమా? పరిశుద్ద గ్రంధమైన బైబిల్ ఈ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? తిరస్కరిస్తుందా? పాపహరిహారానికి రక్తం అవసరమేనా?

Thursday, July 9, 2015

మానవత్వం మంటగలుస్తోందా?

ఈమధ్య కాలంలో కొన్ని సంఘటనలు అసలు మానవత్వం అనేది బ్రతికి ఉందా ? అనే సందేహాన్ని కలిగించాయి. ఒక తండ్రి తన రాక్షస బుద్ధిని ఉపయోగించి కడుపున పుట్టిన కన్నకూతురినే మానభంగం చేసి మరీ చంపాడు. మరొక చోట తన రెండో భార్యతో కల్సి మొదటి భార్యకు పుట్టిన తన కన్నకూతురి ముఖంపై యాసిడ్ దాడి చేసిన తండ్రి ఉదంతం, కొత్త ప్రియుడికోసం మాజీ ప్రియుడిని హతమార్చాలనుకున్న ఓ ప్రియురాలి దురాగతం...ఏదో ఒక చోట అతికిరాతకంగా బలవుతున్న ఆడకూతుర్ల ఆర్తనాదాలు ఇవన్నీ వెరసి నేటి సమాజాన్ని చీకటి కోణంలోకి నెట్టివేశాయి. మానవత్వాన్ని మంటకలిపేశాయి. ఈ దారుణ పరిస్థితుల ప్రభావానికి కారణం ఏమిటి? ఇటువంటి దుస్థితిని పునరావృతం కాకుండా సమూల నాశనం చేయాలంటే ఏమి చేయాలి?

Sunday, May 24, 2015

ఇటువంటి తండ్రులను ఏమి చేయాలి?

కనురెప్పే కాటేసింది!
గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది తండ్రే
అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య విచారణలో నేరం ఒప్పుకున్న తండ్రి
వికారాబాద్/బంట్వారం/మోమిన్‌పేట్: కనురెప్పే కంటిపాపను కాటేసింది! కన్నతండ్రే కామాంధుడయ్యాడు. గిరిజన బాలిక ‘హత్యా’చారం కేసులో విస్తుపోయే నిజం వెలుగుచూసింది. తండ్రి మెగావత్ క మాల్ తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అఘాయిత్యానికి ఒడిగట్టిన తర్వాత.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుండగులు తనపై దాడి చేసి కుమార్తెను అపహరించారని అతడు కట్టుకథ అల్లినట్లు స్పష్టమైంది.
రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) వేసవి సెలవుల అనంతరం సొంతూరుకు తండ్రి కమాల్‌తో కలిసి వస్తుండగా అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. కమాల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం చేసినట్లు అంగీకరించాడు.
ఆ కత్తి, మోపెడ్ కమాల్‌వే..
సంఘటనా స్థలంలో దొరికిన కత్తితోపాటు మోపెడ్ టైర్ల గుర్తులు కమాల్ వాహనానివేనని పోలీసులు నిర్ధారణకు రావడంతో గుట్టురట్టయింది. అంతేకాకుండా రాత్రి 9 గంటలకు ఘటన జరిగితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫిర్యాదు చేయకపోవడం కూడా పోలీసుల అనుమానానికి తావిచ్చింది. ఈ కోణంలోనే దర్యాప్తు సాగించిన పోలీసులు.. వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో వీడియో ఫుటేజీని సైతం పరిశీలించారు. సాయంత్రం 7.26 గంటలకు గుల్బర్గా ప్యాసింజర్ రైలులో వికారాబాద్‌కు కమాల్ చేరుకున్నాడు. అక్కడ్నుంచి నేరుగా స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలోని ఓ ఇంటికి వెళ్లారు.
అక్కడే ఉన్న తన మోపెడ్‌ను తీసుకొని పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పిన కమాల్.. బయటికి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. తర్వాత కూతురుతో కలసి సొంతూరుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో మోత్కుపల్లి గేటు సమీపంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కట్టుకథ చెప్పాడు. ఒక ఆటోలో వచ్చిన దుండగులు తనపై దాడి చేసి కూతురును అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. కమాల్‌కు గతంలో పలు దొంగతనాలతో సంబంధం ఉండడం, జైలుకు వెళ్లి వచ్చిన నేరచరిత్ర ఉండడం, బలిష్టిగా ఉన్నా అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కమాల్ నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలిసింది.
ఐదు బృందాలతో దర్యాప్తు
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. వేకువజామునే కమాల్‌ను మోమిన్‌పేట పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ఆ తర్వాత మరోసారి విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం విలేకర్ల సమావేశంలో ప్రకటి స్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Thursday, April 23, 2015

మరణించిన తరువాత మనిషికి ఒకే జన్మ ఉంది.అది చేసుకున్న కర్మలను బట్టి స్వర్గమన్నా కావచ్చు. నరకమన్నా కావచ్చు. ఇవి శాశ్వతలోకాలు. ఇకపోతే హిందూ మతంలో చెప్పబడుతున్న జన్మల సిద్ధాంతం - పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణుల ఇంట లేక ధనికుల ఇంట పుట్టడం, పాపం చేసుకుంటే అధముల ఇంట లేక, పశుపక్చ్యాదుల రూపంలోనూ, పిల్లి కుక్క రూపాలలోనూ పుట్టడం అన్నది కాలక్రమేణా వైధిక థర్మంలో కలిపించబడిన కాల్పనిక విశ్వాసాలు అని, వీటిని ఏమాత్రం హిందూ మూల శాస్త్రాలైన వేదాలు సమర్ధించవని కొంతమంది మేధావులు ఖరాఖండిగానే వాదిస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రామేమిటి?


Saturday, March 7, 2015

గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ చదువులు చదివినవారికి ప్రైవేట్ ఉద్యోగం మాత్రమే ఇవ్వాలి. ఈ పద్ధతి అమలు చేయడం వలన ఉపయోగం ఉంటుందా?

వేలకు వేలు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్న గవర్నమెంట్ టీచర్సే తమ పిల్లలను ప్రవేట్ స్కూలల్లో చదివించుకుంటున్నారు. అంటే వీళ్లకు తాము పని చేసే ప్రభుత్వ స్కూళ్ల పట్లే సరైన అభిప్రాయం లేనప్పుడు అంతంత జీతాలు తీసుకుని వీళ్లు ఏమి చేస్తున్నట్టు? ఏది ఏమైనా ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగుపడాలన్నా? ప్రభుత్వ విద్యారంగం పట్ల సరైన అభిప్రాయం కలగాలన్నా కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు పూర్తి పభుత్వ విద్యాసంస్థలలో విద్యను అభ్యసించిన వారికే ఇవ్వాలి. ప్రవేట్ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం తీసివేయాలి. దీని వలన చదువును వ్యాపార రంగం నుండి రక్షించవచ్చు.

Thursday, January 8, 2015

ఇటువంటి దుర్మార్గులను ఏం చెయ్యాలి?

ఈరోజు సాక్షి దిన పత్రికలో వచ్చిన వార్తను చూసి మనసంతా బాధతో నిండిపోయింది. స్త్రీలకు ఎక్కడికెళ్లినా రక్షణ లేదా? ఆఖరికి యాక్సిడెంట్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్న మన దేశ ఆడబిడ్డకు హాస్పటల్లో కూడా రక్షణ లేదంటే మన దేశం ఎటు ప్రయణిస్తుంది? ఇటువంటి మానవ మృగాలను ఏమి చెయ్యాలి?
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు.

రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  ఆ డాక్టర్ ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్ పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు. 
ఆధారం: http://www.sakshi.com/news/national/2-cops-doctor-held-for-raping-college-student-202087

Sunday, January 4, 2015

భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క విశ్లేషణ మీరు చేయగలరా?

తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత!
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం!!

భావం:ఓ అర్జునా సర్వ విధముల అతనినే శరణు పొందుము. అతని యనుగ్రహముంటే సర్వోత్తమగు శాంతిని, శాశ్వతమగు మోక్ష పదవిని నీవు పొందగలవు.

పై శ్లోకం గీతలోని 18:62 నుండి సేకరించబడినది.దీని యొక్క విశ్లేషణ మీరు అందించగలరా?