Sunday, December 21, 2014

మతమార్పిడి నిరోధక బిల్లు తీసురావాలనుకోవడం సమంజసమా?

మన భారతదేశం అనేక సంస్కృతి,సంప్రదాయాలకు, అనేక మత భావాలకు నిలయం. ప్రపంచ పటంలో మనదేశానికి ఉన్న ఔన్నత్యం మరే దేశానికి లేదు. ఇక్కడ మతాల మధ్య ప్రేమ సామ రస్యాన్ని తీసుకు రావాలి తప్ప ఎవరికిష్టమైన వారి మతభావ స్వీకరణా నిరోధాన్ని తీసుకు రావాలనుకోవడం దేశ మత సామరస్యాన్ని నిర్మూలించడం కాదా? మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకురావాలనుకోవడం అన్యాయం కాదా?

Monday, November 24, 2014

ఇతర బ్లాగులను విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనా?

మధ్య కొంతమంది బ్లాగర్లు, ఇతర బ్లాగుల యొక్క ఉనికిని తట్టుకోలేకో, ఉన్నతిని సహించలేకో అతి దారుణంగా విమర్శించడాలు ప్రారంభిస్తున్నారు. మొన్న ఒకరు "ప్రజ" బ్లాగును, నిన్న "రచ్చబండ" బ్లాగును, రాజకీయబ్లాగులను విమర్శిస్తూ టపాలు వ్రాయడం మీకందరికీ విదితమే! దాని ప్రభావం "ప్రజ" బ్లాగు "పల్లె ప్రపంచాని"కి డైవర్ట్ అవ్వడం, శ్యామలీయం గారిలాంటి కొంతమంది ప్రముఖులు చర్చావేదికలకు, రాజకీయ బ్లాగులకు దూరంగా ఉంటానని ప్రకటించడం జరిగిపోయాయి. ఇలా ఒకరికొకరు విమర్శించుకుంటూ టపాలు వ్రాయడం ప్రారంభిస్తే ఇక తెలుగు బ్లాగుల ప్రపంచానికి పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం లేదంటారా? కొంతమంది బ్లాగర్లు ఇతర బ్లాగులను టార్గెట్ చేసి, విమర్శిస్తూ "టపాలు" వ్రాయడం సమంజసమేనంటారా?

Sunday, November 23, 2014

అవీ,ఇవీ,అన్నీ బ్లాగువారికి రచ్చబండ బ్లాగ్ పట్ల విచారం ఎందుకో?

బ్లాగ్ మిత్రుడు సాయికుమార్ గారు తన అవీ,ఇవీ,అన్నీ బ్లాగులో రచ్చబండ గురించి విచారకరం అని వ్రాసారు. దేనికి విచారమో, అసలు ఈయన సమస్య ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు.ప్రజ ,రచ్చబండ లాంటి చర్చా వేదికలు ఎన్నొ రావాలి. కొన్ని అంశాలపై చర్చలు చేయడం వలన కొంతవరకైనా నిజా,నిజాలు తెలుస్తాయి. వాటి వలన ప్రయోజనం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండానే నిష్ప్రయోజనం అంటే ఎలా? అగ్రిగేటర్లోని వ్యాఖ్యల స్థలానంతా ఈ చర్చావేదికలే మింగేస్తున్నాయి అంటున్నారు. ఇంతకు ముందు ప్రజ మాత్రమే ఉంది. ఈమథ్య అయితే రచ్చబండ వచ్చింది. ఇవి రెండూ తప్ప వేరే చర్చావేదికలే లేవు. అయినా అది వ్యాఖల స్థలమే కదా?అందులో ఏ బ్లాగులకు ఎక్కువమంది కామెంట్స్ పెడితే ఆ బ్లాగులే కనిపిస్తాయి.ఆ అగ్రిగేటర్లోని ముంగిలిలో కూడా ఇవే తాండవిస్తున్నాయా? ఏమిటి? అందులో రెండు పోస్టులు తప్ప ఎక్కువుగా ఎవరివీ కనిపించవు.అందులో ఈ చర్చావేదికలు ఆ స్థలానంతా ఆక్రమిస్తే బాధ పడినా అర్ధముంది. కేవలం వ్యాఖ్యల స్థలమే కదా! బాధెందుకు చెప్పండి. ఒకవేళ ఇతరులు చదివి వ్యాఖ్యలు పెడితేనే అవి చూసి ఆ బ్లాగులను చదువుతారా సార్? ఒకో టపా మీద ఒకొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇతరుల అభిప్రాయం చదివి మనం ఆ బ్లాగులను చదవకూడదు. అసలు ఆ బ్లాగ్ టపా ఉద్దేశ్యమేమిటో చదివి మన అభిప్రాయం వెలిబుచ్చాలి. కొన్ని అభిప్రాయాలు ఆ టపాల యొక్క ఉద్దేశ్యమేమిటో సరిగా అర్థం చేసుకోక పోవచ్చు కదా!ఒకవేళ అందులో వాఖ్యలు చదివినా తరువాత ఆ బ్లాగులను చూడవచ్చు. తప్పులేదు. అయితే అందులో ఎక్కువ వాఖ్యల బ్లాగులను తప్పు పట్టడం ఎందుకో మరి? బ్లాగిల్లు శ్రీనివాస్ గారు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అది మీ ఒక్కరికి నచ్చకపోతే తొలగించేయాల ఏమిటి? సర్ మీరు మీ బ్లాగును పాపులర్ చేసుకోవడం కోసం ఇతర బ్లాగులను నిందుస్తున్నారనిపిస్తోంది. 

Monday, November 17, 2014

ఆడవారిపై అత్యాచారాలను నిరోధించాలంటే ఏమి చెయ్యాలి?

పై ప్రశ్నను పంపినవారు: తిరుపతిరావు -ఖమ్మం.

మానవ సంబంధాలు ఇలా ఉండాలి అని నిర్ణయించాల్సింది ఎవరు!? మానవ సంబంధాలలో మార్పులు ఎలా జరుగుతాయి!?

పై ప్రశ్నను పంపినవారు:- పల్లా కొండల రావు గారు.

తెలుగు బ్లాగు మిత్రులందరికీ స్వాగతం..సుస్వాగతం.

 గౌరవనీయులైన తెలుగు బ్లాగు మిత్రులారా! ఈబ్లాగు ద్వారా అనేక అంశాలపై చర్చలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రచ్చబండ ను స్థాపించాను.ఏదైనా అంశం పట్ల నల్గురూ కల్సి చర్చించగలిగినప్పుడే దాని యొక్క లోతుపాతులు తెలుస్తాయి. దాని యొక్క అసలు ప్రయోజనం మనిషికి అర్ధమవుతుంది. దాని అసలు ఉద్దేశ్యం నిరూపితమవుతుంది. దాని కారణంగానే ఈ రచ్చబండ బ్లాగు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేను నిర్వహించాలనుకుంటున్నాను. ఇప్పటికే "ప్రజ" అనే పేరుతో ఓ చర్చావేదికను పల్లా కొండలరావుగారు నడుపుతున్నారు. ఇది తప్ప మరో చర్చావేదిక తెలుగు బ్లాగుల ప్రపంచంలో లేదు. బహుశా ఈ రచ్చబండ రెండవదవుతుంది. ఏది ఏమైనా ఈ రచ్చబండ అందరికీ ఉపయోగపడాలని ఆశపడుతున్నాను.
 చివరిగా ఓ విన్నపం.

  • సమకాలీన పరిస్థితులకు తగ్గట్లున్న అంశాలనే ఎన్నుకుని చర్చలు నిర్వహిస్తే ఉపయోగం అని నా అభిప్రాయం.
  • దయచేసి బ్లాగు మిత్రులు మీరు మంచి అంశాన్ని ఎన్నుకుని మా మెయిల్ sakshyamgroup@gmail.com కు పంపండి.
  • ఈ రచ్చబండ లోని అంశాలపై చర్చించగలరు.మీ అభిప్రాయలు ఎంతోమందికి ఉపయోగపడవచ్చు.
  • వివాదాలకు, దుర్విమర్శలకు ఈ రచ్చబండ పూర్తి వ్యతిరేకం అని గమనించగలరు.

గౌరవనీయులైన మీరందరూ దీనిని ముందుకు నడిపిస్తారని, అందరికీ ప్రయోజనకారిగా మార్చుతారని కోరుకుంటున్నాను.
ప్రత్యేక వందనాలతో..
మీ
సాక్ష్యం గ్రూప్
బ్లాగ్ వేదిక టీం.